ఈ రోజు మనం ఎంతగానో ఎదురుచూస్తున్న Indian Army SSC (Tech)-68 Men Recruitment 2026 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నటున్నాం.
Hello mama, అందరూ ఎలా ఉన్నారు? ఇంజనీరింగ్ పాస్ అయినా వాళ్ళ కోసం ఇండియన్ ఆర్మీ నుండి ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా, డైరెక్ట్ గా ఆఫీసర్ అయ్యే అద్భుతమైన అవకాశం ఈ నోటిఫికేషన్ లో వుంది.B.E లేదా B.Tech కి కోర్సెస్ కి సరైన గుర్తింపు తెచ్చే జాబ్స్ ఇవ్వి. ఈ నోటిఫికేషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు ఎందుకంటే ఈ జాబ్ లో మంచి శాలరీ తో పాటు సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఉంటుంది.
మొత్తం 350 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు మామ. ఏ బ్రాంచ్ వాళ్లకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అప్లై చేయడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఏంటి, 5 రోజుల ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు కింద డీటెయిల్డ్ గా ఇచ్చాను.సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కచ్చితంగా యూజ్ అవుతుంది, అలాగే మీ ఫ్రెండ్స్ & ఫామిలీ గ్రూప్స్ లో షేర్ చేయడం మర్చిపోకండి.
Recruitment Overview :-
| Organization | Indian Army |
| Post Name | SSC (Tech)-68 Men |
| Total Vacancies | 350 |
| Qualification | B.E. / B.Tech |
| Job Location | All Over India |
| Apply Mode | Online |
| Application Start Date | 9 July 2026 |
| Last Date | 7 August 2026 |
| Official Website | joinindianarmy.nic.in |
Vacancy Details (Branch-wise) :-
ఏ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఈ కింద టేబుల్ లో క్లియర్ గా ఇచ్చాను చెక్ చేసుకో మామా:
| Engineering Stream | Vacancies |
| Mechanical (Production, Automobile, Industrial etc.) | 101 |
| Civil (Architecture, Building Construction etc.) | 75 |
| Electronics (Telecom, Avionics, Opto Electronics) | 64 |
| Computer Science (IT, AI/ML, Cyber Security) | 60 |
| Electrical (Electrical & Electronics) | 33 |
| Miscellaneous (Plastic Tech, Mining, Metallurgy) | 17 |
Eligibility Criteria
Education & Age(విద్యార్హత & వయసు) :-
- Education: Indian Army SSC (Tech) జాబ్స్ అప్లై చేసుకోవడానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత బ్రాంచ్ లో B.E లేదా B.Tech కంప్లీట్ చేసి ఉండాలి.
- Final Year Students: ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ Indian Army SSC (Tech) జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. కానీ 01 ఏప్రిల్ 2027 నాటికి పాస్ అయినట్లు ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. అప్లై చేసే టైం కి ఎలాంటి బ్యాక్ లాగ్స్ ఉండకూడదు గుర్తుంచుకోండి.
- Age Limit: Indian Army SSC (Tech) జాబ్స్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 1 ఏప్రిల్ 2027 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. (అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 02 ఏప్రిల్ 2000 నుండి 01 ఏప్రిల్ 2007 మధ్య ఉండాలి).
- Marital Status: అన్ మ్యారీడ్ (పెళ్లి కాని) పురుషులు మాత్రమే దీనికి అర్హులు.
Salary Details(జీతం వివరాలు) :-
Indian Army SSC (Tech) జాబ్స్ కి శాలరీ లో కింద ఇచ్చిన విధంగా పే చేస్తారు సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి.
- Stipend: ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA) గయా లో 49 వారాల ట్రైనింగ్ ఉంటుంది. ఆ టైం లో నెలకు ₹56,100 ఫిక్స్డ్ స్టైపెండ్ ఉంటుంది.
- Basic Pay: ట్రైనింగ్ పూర్తయ్యాక లెఫ్టినెంట్ (Lieutenant) ర్యాంక్ తో Level-10 లో జాయిన్ అవుతారు. అప్పుడు బేసిక్ పే ₹56,100 నుంచి ₹1,77,500 వరకు ఉంటుంది.
- Allowances: బేసిక్ తో పాటు మిలిటరీ సర్వీస్ పే (MSP) నెలకు ₹15,500 వస్తుంది. ఇంకా Dearness Allowance (DA), హై ఆల్టిట్యూడ్ అలవెన్స్, యూనిఫామ్ అలవెన్స్ (ఏడాదికి ₹20,000), చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా ఉంటాయి. అన్ని కలుపుకుంటే స్టార్టింగ్ లోనే నెలకు లక్ష రూపాయల పైగా జీతం వస్తుంది.
How to Apply (ఎలా అప్లై చేసుకోవాలి) :-
- ముందుగా Indian Army SSC (Tech) జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ joinindianarmy.nic.in ఓపెన్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి.
- తర్వాత హోమ్ పేజీలో “Officer Entry Apply/Login” అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. కొత్త వారైతే ‘Registration’ పైన క్లిక్ చేసి, ఆధార్ వెరిఫికేషన్ తో మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి రిజిస్టర్ అవ్వండి.
- రిజిస్ట్రేషన్ అయిన తరవాత లాగిన్ అయ్యి, మీ డ్యాష్ బోర్డ్ లో “Apply Online” ఆప్షన్ కి వెళ్లి “Indian Army SSC (Tech)-68 Men” ని సెలెక్ట్ చేసుకోండి.
- మీ పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్, మరియు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇక్కడే మీ సెమిస్టర్ వారీగా వచ్చిన మార్కులను చాలా జాగ్రత్తగా, తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి మామ.
- తర్వాత మీ పాస్ పోర్ట్ సైజు ఫోటో, సిగ్నేచర్ ని కరెక్ట్ సైజు లో అప్లోడ్ చేయండి.
- చివరిగా అన్ని వివరాలు ఒకసారి చెక్ చేసుకుని ఫామ్ సబ్మిట్ చేయండి. ఫైనల్ గా రోల్ నెంబర్ తో జనరేట్ అయిన అప్లికేషన్ ఫామ్ ని 2 కాపీలు ప్రింట్ తీసుకుని పెట్టుకోండి (ఇంటర్వ్యూ కి తీసుకువెళ్లాలి).
Selection Process (ఎంపిక విధానం) :-
Indian Army SSC (Tech) జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ 4 స్టేజెస్ లో చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది:
- Shortlisting of Applications: మీరు అప్లికేషన్ లో పెట్టిన ఇంజనీరింగ్ మార్కుల (సెమిస్టర్ క్యుములేటివ్) ఆధారంగా బ్రాంచీల వారీగా కట్-ఆఫ్ తీసి షార్ట్ లిస్ట్ చేస్తారు.
- SSB Interview: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు అలహాబాద్, భోపాల్, బెంగళూరు లేదా జలంధర్ లో 5 రోజుల పాటు SSB (Services Selection Board) ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇక్కడే మీ ఆఫీసర్ క్వాలిటీస్ ని టెస్ట్ చేస్తారు.
- Medical Examination: SSB లో రికమెండ్ అయిన వాళ్లకు ఆర్మీ మెడికల్ బోర్డు ద్వారా చాలా డీటెయిల్డ్ గా ఫిజికల్ మరియు మెడికల్ టెస్టులు చేస్తారు.
- Final Merit List: మెడికల్ గా ఫిట్ అయిన వారికి, కేవలం SSB ఇంటర్వ్యూ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసి ఆఫర్ లెటర్ పంపిస్తారు.
Syllabus(సిలబస్) :-
Indian Army SSC (Tech) జాబ్స్ కి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి బుక్స్ సిలబస్ ఉండదు మామ. కానీ 5 రోజుల SSB ఇంటర్వ్యూ లో ఏమేమి టెస్టులు ఉంటాయో క్లియర్ గా ఇచ్చాను చెక్ చేసుకోండి:
- Stage 1 (Screening): మొదటి రోజు Officer Intelligence Rating (OIR) Test (లాజికల్ రీజనింగ్), మరియు Picture Perception & Description Test (PP&DT) ఉంటాయి. ఇందులో ఒక బ్లర్ ఇమేజ్ చూపించి స్టోరీ రాయమంటారు, తర్వాత దానిపై గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఇందులో పాస్ అయితేనే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తారు.
- Stage 2: మిగతా నాలుగు రోజులు సైకలాజికల్ టెస్టులు (TAT, WAT, SRT, SDT), గ్రౌండ్ లో గ్రూప్ టాస్కులు (GTO), మరియు ఆఫీసర్ తో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి.
Mandatory Links :-
- Official Notification PDF: Click Here
- Apply Online Link: Click Here
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
FAQs(ముఖ్యమైన ప్రశ్నలు) :-
1. Indian Army SSC (Tech)-68 Men కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?
Indian Army SSC (Tech) జాబ్స్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 7 ఆగస్టు 2026 (మధ్యాహ్నం 3 గంటల వరకు). లాస్ట్ మినిట్ లో సర్వర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ముందుగానే అప్లై చేయడానికి ట్రై చేయండి.
2. Indian Army SSC (Tech) జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఏమైనా ఫీజు ఉంటుందా?
లేదు ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఎంట్రీస్ కి ఎప్పుడు ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. అందరూ ఫ్రీగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
3. బీటెక్ లో ఎంత పర్సంటేజ్ ఉంటే ఈ Indian Army SSC (Tech) పోస్టులకి షార్ట్ లిస్ట్ అవుతాము?
ఆర్మీ వాళ్ళు అప్లై చేసిన వారి సంఖ్యను బట్టి కట్-ఆఫ్ పర్సంటేజ్ డిసైడ్ చేస్తారు మామ. బ్రాంచ్ ని బట్టి 60% నుండి 75% మధ్య కట్-ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 60% పైన ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయడం బెస్ట్.





