Bank of India BOI Credit Officer Recruitment 2026 Notification కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
Hello Friends బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మన ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు అందరకి ఒక సూపర్ గుడ్ న్యూస్ మామ! బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) నుంచి ఏకంగా 779 క్రెడిట్ ఆఫీసర్ (Credit Officer) పోస్టులకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు మన AP, TG వాళ్ళు లోకల్ గా ఎగ్జామ్ రాసి ఈజీగా అప్లై చేసుకోవచ్చు, కాబట్టి ఈ నోటిఫికేషన్ ని అస్సలు మిస్ అవ్వద్దు.
ఈ జాబ్ రిక్రూట్మెంట్ ద్వారా మంచి సాలరీ, లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది.కాబట్టి డిగ్రీ లేదా పీజీ కంప్లీట్ చేసి కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, లేదా CA/CMA చేసిన వాళ్ళు దీనికి పక్కాగా ఎలిజిబుల్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నా లేదా బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వెంటనే ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి మామ, వాళ్ళ కెరీర్ కి ఈ ఆర్టికల్ చాలా హెల్ప్ అవ్వచ్చు!
Post-wise Vacancy Details :-
ఏయే స్కేల్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అని ఈ టేబుల్ లో క్లియర్ గా ఇచ్చాను ఒకసారి చూసుకోండి:
| Post Name & Scale | Vacancies |
| Credit Officer (MMGS-II) | 400 |
| Credit Officer (MMGS-III) | 250 |
| Credit Officer (SMGS-IV) | 129 |
| Total Posts | 779 |
Recruitment Overview :-
| Organization | Bank of India (BOI) |
| Post Name | Credit Officer (GBO Stream) |
| Total Vacancies | 779 Posts |
| Qualification | Graduation / CA / CMA / CS |
| Job Location | All Over India (AP & TS included) |
| Apply Mode | Online |
| Apply Starting Date | 25-June-2026 |
| Last Date | 20-July-2026 |
| Official Website | bankofindia.co.in |
Education & Age(విద్యార్హత & వయసు) :-
BOI Credit Officer జాబ్స్ కి అప్లై చేయాలంటే అర్హతలు కాస్త స్పెసిఫిక్ గా అడిగారు, వాటి డీటెయిల్స్ కింద క్లియర్ గా ఇచ్చాను చెక్ చేసుకోండి:
- ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60% మార్కులతో డిగ్రీ (Graduation) పాస్ అయి ఉండాలి. SC/ST/OBC/PwBD కేటగిరీలకు 55% ఉంటే సరిపోతుంది. CA / CMA / CS / CFA పాసైన వారు కూడా ఈ జాబ్స్ కి డైరెక్ట్ గా ఎలిజిబుల్.
- వర్క్ ఎక్స్పీరియన్స్: ఫ్రెషర్స్ కి ఇది కాదు మామ. MMGS-II కి కనీసం 3 ఏళ్లు, MMGS-III కి 5 ఏళ్లు, మరియు SMGS-IV కి 8 ఏళ్ల బ్యాంకింగ్ లేదా క్రెడిట్ విభాగంలో ఎక్స్పీరియన్స్ కచ్చితంగా ఉండాలి.
- వయోపరిమితి (Age Limit): స్కేల్-2 పోస్టులకు 25-32 ఏళ్లు, స్కేల్-3 పోస్టులకు 28-38 ఏళ్లు, స్కేల్-4 పోస్టులకు 32-45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
- ఏజ్ రిలాక్సేషన్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,ST కి 5 ఏళ్లు, OBC కి 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయసు సడలింపు పక్కాగా వర్తిస్తుంది.
Salary Details(జీతం వివరాలు) :-
BOI Credit Officer జాబ్స్ కి సెలెక్ట్ అయితే మాత్రం సాలరీస్ వేరే లెవెల్ లో ఉంటాయి మామ, ఫుల్ డీటెయిల్స్ చెక్ చేసుకో:
- MMGS-II (Scale 2): బేసిక్ పే ₹64,820 ఉంటుంది. అన్ని అలవెన్సులు కలుపుకుని స్టార్టింగ్ లోనే నెలకు దాదాపు ₹85,000 పైన చేతికి వస్తుంది.
- MMGS-III (Scale 3): దీని బేసిక్ పే ₹85,920. HRA, DA తో కలిపి దాదాపు ₹1,10,000 వరకు గ్రాస్ శాలరీ తీసుకోవచ్చు.
- SMGS-IV (Scale 4): ఇది టాప్ లెవెల్ పోస్ట్ కాబట్టి బేసిక్ ₹1,02,300 ఉంటుంది. నెలకు ₹1,30,000 కు పైగా శాలరీ మీ అకౌంట్ లో పడుతుంది.
- ఇతర బెనిఫిట్స్: ఈ జీతంతో పాటు బ్యాంక్ క్వార్టర్స్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC), మరియు రిటైర్మెంట్ కోసం మంచి పెన్షన్ స్కీమ్ లాంటి సూపర్ ఫెసిలిటీస్ ఉంటాయి.
Selection Process(ఎంపిక విధానం) :-
BOI Credit Officer జాబ్ కొట్టాలంటే ఈ మూడు స్టెప్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయాలి:
- ఆన్‌లైన్ రాత పరీక్ష (Online Exam): ఫస్ట్ ఆన్లైన్ లో ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పెడతారు. ఇందులో ప్రొఫెషనల్ నాలెడ్జ్ లో వచ్చే మార్కులు చాలా కీలకం.
- గ్రూప్ డిస్కషన్ (GD): రాత పరీక్షలో పాస్ అయిన వాళ్లకి గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేస్తారు. బ్యాంకింగ్ సెక్టార్ కి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడే చెక్ చేస్తారు.
- పర్సనల్ ఇంటర్వ్యూ (Personal Interview): ఫైనల్ గా ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామ్, GD మరియు ఇంటర్వ్యూ లో వచ్చిన టోటల్ మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి జాబ్ పోస్టింగ్ ఇస్తారు.
Syllabus(సిలబస్) :-
BOI Credit Officer ఎగ్జామ్ కి ఏమేమి చదవాలో క్లియర్ గా ఇచ్చాను ఈ టాపిక్స్ నోట్ చేసుకోండి:
- English Language: ఇంగ్లీష్ గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్ లాంటి బేసిక్ టాపిక్స్ కవర్ అవుతాయి. (ఇది జస్ట్ క్వాలిఫై అయితే చాలు).
- General/Banking Awareness: కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ టెర్మినాలజీ, రీసెంట్ ఎకనామిక్ అప్డేట్స్ మరియు RBI గైడ్ లైన్స్ చదువుకోవాలి.
- Professional Knowledge: ఇది చాలా ఇంపార్టెంట్ మామ! క్రెడిట్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ అనాలిసిస్, రిస్క్ అసెస్మెంట్ లాంటి కోర్ బ్యాంకింగ్ సబ్జెక్ట్స్ నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. దీనిపైనే మెయిన్ ఫోకస్ పెట్టండి.
How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి) :-
BOI Credit Officer పోస్టలుకు అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్ గా ఎలా చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇచ్చాను చెక్ చేసుకోండి:
- ముందుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- తర్వాత హోమ్ పేజీలో ఉన్న ‘Careers’ సెక్షన్ లోకి వెళ్లి క్రెడిట్ ఆఫీసర్ 2026 అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి.
- మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇచ్చి ‘New Registration’ కంప్లీట్ చేసుకోండి.
- ఆ తర్వాత ఐడీ, పాస్వర్డ్ తో లాగిన్ అయి మీ పర్సనల్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ జాగ్రత్తగా ఫిల్ చేయడం మర్చిపోకండి.
- రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం స్కాన్ చేసి కరెక్ట్ సైజు లో అప్లోడ్ చేయాలి.
- చివరిగా జనరల్, OBC, EWS వాళ్ళు ₹850; SC, ST, PwD వాళ్ళు ₹175 అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో (UPI/Debit Card ద్వారా) పే చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోకండి.
Mandatory Links :-
- Official Notification PDF: Click Here
- Apply Online Link: Click Here to Apply
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
- WhatsApp Channel Join Link:– Join Our Community
- Telegram Channel Join Link :-Join Our Community
FAQs(ముఖ్యమైన ప్రశ్నలు) :-
- BOI Credit Officer జాబ్స్ కి AP, TS నుంచి అప్లై చేస్తే ఎగ్జామ్ ఎక్కడ రాయాలి?
మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు మామ. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి మెయిన్ సిటీస్ లోనే ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ వున్నాయ్. కాబట్టి ప్రశాంతంగా మీ దగ్గరలో రాసుకోవచ్చు.
- BOI Credit Officer జాబ్స్ కి ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా?
లేదు ఫ్రెండ్స్. ఇవి స్పెషలిస్ట్ ఆఫీసర్ (స్కేల్ 2, 3, 4) కేటగిరీ పోస్టులు కాబట్టి, కనీసం 3 సంవత్సరాల అయిన బ్యాంకింగ్ లేదా క్రెడిట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కచ్చితంగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది మంచి ఛాన్స్.
- BOI Credit Officer జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?
ఆన్లైన్ అప్లికేషన్స్ జూన్ 25న స్టార్ట్ అయ్యాయి, జూలై 20, 2026 అనేది లాస్ట్ డేట్. సర్వర్ ఇష్యూ రాకముందే ఫాస్ట్ గా అప్లై చేసుకోండి.




