🚀 Sri Sathya Sai District Anganwadi Helper Recruitment 2026 | 10th Pass భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Published On:

Sri Sathya Sai District Anganwadi Helper

Join WhatsApp

Join Now

Sri Sathya Sai District Anganwadi Helper Recruitment 2026 కోసం ఎదురుచూస్తున్న స్థానిక మహిళలకు ఇది నిజంగా పెద్ద పండుగ లాంటి వార్త. Hello friends, ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ఏకంగా 129 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి అఫీషియల్ గా నోటిఫికేషన్ రీలీజ్ అయింది మామ! కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయ్యి, తమ సొంత ఊరిలో, ఇంటి దగ్గరే ఉంటూ ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనుకుంటున్నారో, అలాంటి మహిళలకు ఈ జాబ్ నోటిఫికేషన్ బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఈ జాబ్ కి ఎలాంటి రాత పరీక్ష ఉండదు, అప్లికేషన్ ఫీజు కూడా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. సొంత ఊరి పిల్లలకు సేవ చేస్తూ ఈ జాబ్ లో సెటిల్ అవ్వడానికి ఇది ఒక మంచి ఛాన్స్.

Sri Sathya Sai District Anganwadi జాబ్స్ కు కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ జాబ్స్ కేవలం ఆయా గ్రామాల్లోని స్థానిక పెళ్లి అయిన మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని అసలు మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. అసలు ఈ నోటిఫికేషన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా సెలెక్షన్ ఎలా చేస్తారు, డాక్యుమెంట్స్ ఏం కావాలి అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ పక్కాగా ఇచ్చాను. సో ఈ ఆర్టికల్ బాగా చదివి అప్లై చేసుకోండి మరియు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కు, రిలేటివ్స్ కు వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూప్స్ లో కచ్చితంగా షేర్ చేయండి, 

Recruitment Overview :- 

Organization District Women Development & Child Welfare Office, Sri Sathya Sai
Post Name Anganwadi Helper
Total Vacancies 129
Qualification 10th Class (SSC) Pass
Job Location Sri Sathya Sai District, Andhra Pradesh
Apply Mode Offline
Apply Starting Date 04 July 2026
Apply Last Date 17 July 2026
Official Website srisathyasai.ap.gov.in

Vacancies Details :- 

Sri Sathya Sai District Anganwadi Helper నోటిఫికేషన్ లో ఏ ఏ ప్రాజెక్టు పరిధిలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ క్లియర్ గా  కింద టేబుల్ లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్:

ICDS ప్రాజెక్టు పేరు (మండలాలు) ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్టులు అప్లై చేయాల్సిన ఆఫీస్
ఓబులదేవచెరువు (ODC) ప్రాజెక్ట్ 45 పోస్టులు CDPO ఆఫీస్, ఓబులదేవచెరువు
పుట్టపర్తి ప్రాజెక్ట్ 42 పోస్టులు CDPO ఆఫీస్, పుట్టపర్తి
నల్లచెరువు ప్రాజెక్ట్ 42 పోస్టులు CDPO ఆఫీస్, నల్లచెరువు
మొత్తం ఖాళీలు 129 పోస్టులు శ్రీ సత్యసాయి జిల్లా

(గమనిక: మీ గ్రామ పంచాయతీలో ఖాళీ ఉందో లేదో కచ్చితంగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ PDF లేదా మీ దగ్గరలోని సచివాలయంలో చెక్ చేసుకోండి).

Education & Age Limit (పూర్తి వివరాలు) :- 

  • విద్యార్హత: ఎవరైతే ఈ Sri Sathya Sai District Anganwadi Helper పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వారు కచ్చితంగా 10వ తరగతి (SSC) పాస్ అయి ఉండాలి. అంతకంటే ఎక్కువ చదివినా పర్వాలేదు కానీ 10th పాస్ సర్టిఫికెట్ తప్పనిసరి.
  • స్థానిక నివాసం: ఇది చాలా ఇంపార్టెంట్! ఏ ఊరిలో అంగన్‌వాడీ కేంద్రం ఖాళీ ఉందో, అభ్యర్థి కచ్చితంగా అదే గ్రామానికి చెందిన వారై ఉండాలి. (రెసిడెన్స్ సర్టిఫికెట్ లేదా రేషన్ కార్డు ఉండాలి).
  • వివాహ అర్హత: అప్లై చేసే మహిళలకు కచ్చితంగా పెళ్ళై ఉండాలి. వివాహ ధృవీకరణ పత్రం అప్లికేషన్ తో జత చేయాలి. (విధవలు కూడా అప్లై చేసుకోవచ్చు).
  • వయోపరిమితి: 01 జూలై 2026 నాటికి జనరల్/బీసీ క్యాండిడేట్స్ కు వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
  • వయో సడలింపు: ఒకవేళ 21 ఏళ్ల వయసున్న SC/ST అభ్యర్థులు ఆ ఊరిలో దొరకకపోతే, 18 సంవత్సరాలు నిండిన SC/ST వివాహిత మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు.

Salary Details (జీతం వివరాలు) :- 

  • ఈ Sri Sathya Sai District Anganwadi Helper (ఆయా) పోస్టులకు ఎంపికైన వారికి ప్రస్తుతం నెలకు ₹7,000/- చొప్పున గౌరవ వేతనం (Honorarium) అందుతుంది.
  • ఇది మాత్రమే కాకుండా, ప్రభుత్వం తరఫున ప్రతి ఏటా దసరా/సంక్రాంతి పండుగలకు ఫ్రీగా చీరలు పంపిణీ చేస్తారు.
  • ఐసీడీఎస్ మీటింగ్స్ కు వెళ్ళినప్పుడు ప్రయాణ ఖర్చులు (TA/DA) ఇస్తారు.
  • భవిష్యత్తులో ప్రభుత్వాన్ని బట్టి, ఈ గౌరవ వేతనం కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయ్ రిటైర్మెంట్ సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొంత ఆర్థిక సహాయం కూడా అందుతుంది.

How to Apply (ఎలా అప్లై చేసుకోవాలి) :- 

  • Sri Sathya Sai District Anganwadi Helper (ఆయా) పోస్టులకు అప్లై చేసుకోవాలో కింద క్లియర్ గా ఇచ్చాను జాగ్రత్తగా చదివి అప్లై చేయండి:
  • Step 1: ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆఫ్‌లైన్ లోనే జరుగుతుంది. ఆన్‌లైన్ వెబ్‌సైట్ లో లింక్ ఉండదు.
  • Step 2: ముందుగా శ్రీ సత్యసాయి జిల్లా వెబ్‌సైట్ లో కానీ, లేదా మీ మండలంలోని ICDS (CDPO) ఆఫీస్ లో కానీ అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోండి.
  • Step 3: ఆ ఫారం లో మీ పేరు, మీ భర్త పేరు, పుట్టిన తేదీ, కులం, టెన్త్ మార్కులు ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా బ్లూ లేదా బ్లాక్ పెన్ తో నీట్ గా ఫిల్ చేయండి. కుడివైపున రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అతికించండి.
  • Step 4: అప్లికేషన్ వెనకాల కింద ఇచ్చిన జిరాక్స్ కాపీలు పెట్టాలి: 
  • టెన్త్ మార్క్ లిస్ట్, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, స్థానిక నివాస పత్రం (Nativity), మరియు వయసు ధ్రువీకరణ (లేదా టెన్త్ మెమో). అన్ని జిరాక్స్ కాపీల మీద మీ సంతకం (Self Attestation) కచ్చితంగా చేయాలి.
  • Step 5: ఈ పూర్తి చేసిన అప్లికేషన్ ఫారాన్ని ఒక కవర్‌లో పెట్టి, 17 జూలై 2026 సాయంత్రం 5 గంటల లోపు మీ మండలంలోని CDPO ఆఫీస్ లో నేరుగా అక్కడ ఆఫీసర్ చేతికి ఇచ్చి రసీదు తీసుకోవడం మర్చిపోకండి.

Selection Process (ఎలా సెలెక్ట్ చేస్తారు?) :- 

Sri Sathya Sai District Anganwadi Helper పోస్టులకు అసలు రాత పరీక్షే లేదు కదా, మరి జాబ్ కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని డౌట్ మీకు రావచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది కింది ఇచ్చాను చెక్ చేసుకోండి:

  1. మెరిట్ ఆధారంగా: ముందుగా మీరు సబ్మిట్ చేసిన టెన్త్ క్లాస్ సర్టిఫికెట్స్ లోని మార్కులను/గ్రేడ్ పాయింట్లను లెక్కలోకి తీసుకుంటారు. ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
  2. వెయిటేజీ మార్కులు: ఒకవేళ అప్లై చేసిన మహిళ వితంతువు (Widow) అయినా, అనాథ అయిన, లేదా దివ్యాంగురాలు (Handicapped) అయినా వారికి ప్రభుత్వ రూల్స్ ప్రకారం అదనపు వెయిటేజీ మార్కులు కలుపుతారు.
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్: మెరిట్ లిస్ట్ లో ఉన్న వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఒరిజినల్స్ చెక్ చేస్తారు.
  4. ఫైనల్ సెలక్షన్: కలెక్టర్ గారు మరియు జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో రోస్టర్ పాయింట్లు (కుల రిజర్వేషన్లు) పాటిస్తూ ఫైనల్ లిస్ట్ ను ఆఫీస్ నోటీస్ బోర్డులో అంటిస్తారు.

Syllabus (సిలబస్) :- 

  • నేను ఇంతక ముందే చెప్పినట్లు ఈ Sri Sathya Sai District Anganwadi Helper రిక్రూట్‌మెంట్‌కి ఎలాంటి రాత పరీక్ష (Written Exam) ఉండదు. కాబట్టి మీరు ఈ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు.
  • అలాగే ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. 
  • సెలెక్షన్ మొత్తం 100% మీ టెన్త్ క్లాస్ మార్కులు మరియు మీ కుల రిజర్వేషన్ల మీదే ఆధారపడి ఉంటుంది. మంచి మర్క్స్  ఉన్నవాళ్లకే జాబ్ వస్తుంది.

Mandatory Links :- 

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు) :- 

  1. నేను వేరే జిల్లాలో ఉన్నాను,ఈ Sri Sathya Sai District Anganwadi Helper పోస్టులకు అప్లై చేసుకోవచ్చా ?

లేదు ఫ్రెండ్స్, కేవలం ఎక్కడైతే పోస్ట్ ఖాళీ ఉందో ఆ గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న స్థానిక మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. వేరే ఊరి వాళ్ళు నాన్-లోకల్ కింద వస్తారు కాబట్టి అప్లికేషన్ ని రిజెక్ట్ చేస్తారు.

  1. Sri Sathya Sai District Anganwadi Helper పోస్టులకు టెన్త్ ఓపెన్ స్కూల్ లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చా?

కచ్చితంగా చేసుకోవచ్చు. రెగ్యులర్ అయినా, ఓపెన్ టెన్త్ (APOSS) అయినా ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి పాస్ అయితే చాలు. మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

  1. Sri Sathya Sai District Anganwadi Helper పోస్టులకు అప్లికేషన్ తో పాటు పెళ్లి సర్టిఫికెట్ లేకపోతే ఏం చేయాలి?

ఈ అంగన్‌వాడీ ఉద్యోగాలకు వివాహిత మహిళలే అర్హులు కాబట్టి పెళ్లి అయినట్లు ప్రూఫ్ తప్పనిసరి. ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోతే, మీ రేషన్ కార్డులో మీ భర్త పేరు ఉన్నా సరిపోతుంది లేదా తహసీల్దార్ (MRO) దగ్గర నుండి తీసుకున్న సర్టిఫికెట్ అయినా ఈ అప్లికేషన్ కి జత చేయవచ్చు.

🔴Related Post

Leave a Comment