🚀 RITES Assistant Manager Recruitment 2026 | B.Tech/B.E కి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Published On:

RITES Assistant Manager

Join WhatsApp

Join Now

మామ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి RITES Assistant Manager Recruitment 2026 నుండి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకోసం ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్ ని  తీసుకు వచ్చాను మామ. కేంద్ర ప్రభుత్వ రైల్వే మినిస్ట్రీ కింద పనిచేసే ‘నవరత్న’ సంస్థ అయిన RITES లిమిటెడ్ 24 అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. B.Tech లేదా B.E మెకానికల్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

 RITES Assistant Manager అనేది మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మామ, పైగా స్టార్టింగ్ లోనే లక్షల్లో జీతం ఉంటుంది, ఈ జాబ్ ని మాత్రం మిస్ అవ్వద్దు మామా! ఈ పోస్టులకు కావాల్సిన క్వాలిఫికేషన్స్, ఖాళీల వివరాలు, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ లాంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కింద చాలా క్లియర్ గా ఇచ్చాను, ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి . అలాగే, ఈ జాబ్ అప్డేట్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేయడం మర్చిపోకండి, ఎవరికో ఒకరికి బాగా యూజ్ అవ్వచ్చు.

Recruitment Overview:-

వివరాలు  సమాచారం
Organization RITES Limited (Ministry of Railways)
Post Name Assistant Manager (Mechanical)
Total Vacancies 24
Qualification B.Tech / B.E (Mechanical)
Job Location All Over India
Apply Mode Online
Apply Starting Date 17 జులై 2026
Last Date 17 ఆగస్టు 2026
Official Website www.rites.com

Vacancy Details (ఖాళీల వివరాలు):-

RITES Assistant Manager పోస్టులకు సంబంధించి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని ఈ కింద టేబుల్ లో క్లియర్ గా ఇచ్చాను చెక్ చేసుకోండి మామా:

Category Total Vacancies
UR (General) 12
SC 05
ST 04
OBC (NCL) 01
EWS 02
Total 24

(గమనిక: ఇందులో 1 పోస్టు అనేది PwBD అభ్యర్థులకు కేటాయించబడింది)

Education & Age :- 

అసలు RITES Assistant Manager పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మనకు ఉండాల్సిన ఎడ్యుకేషన్ మరియు ఏజ్ లిమిట్ అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాం:

  • విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫుల్ టైం B.Tech లేదా B.E (Mechanical, Production, Automobile లాంటి బ్రాంచ్స్) కంప్లీట్ చేసి ఉండాలి.
  • మార్కులు: జనరల్ (UR), EWS వాళ్ళకి మినిమమ్ 60% మార్కులు, అదే SC/ST/OBC వాళ్ళకైతే 50% మార్కులు ఉంటే సరిపోతుంది.
  • ఎక్స్‌పీరియన్స్: చదువు అయిపోగానే కుదరదు మామా, ప్రొడక్షన్ లేదా మెకానికల్ మెయింటెనెన్స్ ఫీల్డ్ లో పక్కాగా 2 ఏళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉండి తీరాలి. ఇంటర్న్‌షిప్స్ లాంటివి కన్సిడర్ చేయరు గుర్తుంచుకోండి.
  • వయస్సు(AGE): 17 ఆగస్టు 2026 నాటికి మీ వయసు 32 ఏళ్లు దాటకూడదు.
  • Age Relaxation: గవర్నమెంట్ రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, PwBD కి 10 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.

Salary(జీతం) :- 

నిజం చెప్పాలంటే  RITES Assistant Manager జాబ్స్ కి అప్లై చేయడానికి మెయిన్ రీజన్ ఇదే ఫ్రెండ్స్:

  • RITES Assistant Manager జాబ్స్ కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్ నెలకు ₹40,000 బేసిక్ పే ఉంటుంది. అక్కడి నుంచి ₹1,40,000 వరకు పే స్కేల్ వెళ్తుంది.
  • బేసిక్ తో పాటుగా డియర్‌నెస్ అలవెన్స్ (DA), అదిరిపోయే HRA లేదా లీజు అకామిడేషన్ వస్తుంది.
  • ఇంకా ప్రావిడెంట్ ఫండ్ (PF), గ్రాట్యుటీ, పెర్ఫార్మన్స్ రిలేటెడ్ పే, మంచి మెడికల్ ఫెసిలిటీస్ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని వస్తాయి. మంచి లైఫ్ సెటిల్మెంట్ మామ ఈ నోటిఫికేషన్!

Selection Process(ఎంపిక విధానం) :-

RITES Assistant Manager జాబ్స్ కి సెలెక్షన్ ప్రాసెస్ మూడు స్టెప్స్ లో చాలా నీట్ గా జరుగుతుంది:

  1. రాత పరీక్ష (Written Test): ఫస్ట్ 125 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ తో ఒక ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఎగ్జామ్ పెడతారు. దీనికి 2.5 గంటల టైం ఇస్తారు. ఇంకో గుడ్ న్యూస్ ఏమిటంటే, ఇందులో ఎలాంటి నెగటివ్ మర్క్స్ వుండవు.
  2. సర్టిఫికెట్ వెరిఫికేషన్ (Document Scrutiny): ఎగ్జామ్ రాశాక అందులో వచ్చిన మార్కుల బట్టి షార్ట్ లిస్ట్ చేసి, మీ సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేస్తారు.
  3. ఇంటర్వ్యూ (Interview): సర్టిఫికెట్స్ అన్నీ ఒకే అయిన వాళ్ళకి 1:6 రేషియోలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఫైనల్ గా రాత పరీక్షకు 60%, ఇంటర్వ్యూకి 40% వెయిటేజ్ ఇచ్చి జాబ్ కన్ఫామ్ చేస్తారు.

Syllabus(సిలబస్) :- 

RITES Assistant Manager ఎక్సమ్ కోసం మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్స్ గట్టిగా చదవాలి. సిలబస్ మెయిన్ టాపిక్స్ ఇవే:

  • Applied Mechanics & Design: మెకానిక్స్, మెషీన్ డిజైన్, థియరీ ఆఫ్ మెషీన్స్, వైబ్రేషన్స్.
  • Fluid Mechanics & Thermal Sciences: ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, IC ఇంజిన్స్.
  • Manufacturing Processes: మెటల్ కాస్టింగ్, ఫార్మింగ్, వెల్డింగ్ వగైరా.
  • Materials & Industrial Engineering: మెట్రాలజీ, ఆపరేషన్స్ రీసెర్చ్, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మాన్యుఫాక్చరింగ్.
  • Testing of Materials: నాన్-డిస్ట్రక్టివ్ అండ్ ఫిజికల్ టెస్టింగ్ పద్ధతులు.

How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి):- 

RITES Assistant Manager పోస్టులకు అప్లై చేసుకునే ప్రాసెస్ పెద్ద కష్టమేమి కాదు మామ, ఈ కింద సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోండి:

  • ముందుగా RITES వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ (www.rites.com) ఓపెన్ చేయండి.
  • అక్కడ ‘Careers’ ఆప్షన్ లోకి వెళ్లి ఈ అసిస్టెంట్ మేనేజర్ (Mechanical) జాబ్స్ కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి.
  • ముందు మీ బేసిక్ డీటెయిల్స్ తో రిజిస్టర్ అవ్వండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫారం ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయండి.
  • మీ ఫోటో, సంతకం, క్వాలిఫికేషన్ మరియు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్ అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
  • జనరల్, ఓబీసీ కాండిడేట్స్ ₹600 అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో పే చేయాలి.
  • ఫైనల్ గా సబ్మిట్ కొట్టేసి, ఆ అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి.

Mandatory Links :- 

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు) :- 

1. ఫ్రెండ్స్, RITES Assistant Manager పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?

అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 17 ఆగస్టు 2026 మామా. లాస్ట్ మినిట్ లో సర్వర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయండి.

2.  RITES Assistant Manager పోస్టులకి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా?

లేదు మామా, వీళ్ళు కచ్చితంగా ప్రొడక్షన్ లేదా మెకానికల్ మెయింటెనెన్స్ లో 2 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అడిగారు. కాబట్టి ఎక్స్‌పీరియన్స్ లేని ఫ్రెషర్స్ కి ఎలిజిబిలిటీ లేదు.

3. RITES Assistant Manager EXAM కి  నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా?

లేవు మామ అదే మనకి పెద్ద ప్లస్ పాయింట్. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు మామా! 125 కి 125 క్వశ్చన్స్ ప్రశాంతంగా, ధైర్యంగా అటెంప్ట్ చేయవచ్చు.

🔴Related Post

Leave a Comment