🚀 ISRO ISTRAC Apprentices Recruitment 2026 | Degree/Diploma/ITI Pass | Apply Online Now!

By Quick Job Updates

Published On:

ISRO ISTRAC Apprentices

Join WhatsApp

Join Now

ISRO ISTRAC Apprentices Recruitment 2026 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక సూపర్ న్యూస్ తీసుకొని వచ్చా Hello friends, అందరూ ఎలా ఉన్నారు? మీ కోసం ఈ రోజు ఒక అదిరిపోయే, ఎంతో ముఖ్యమైన జాబ్ అప్డేట్ ని  తీసుకొచ్చాను మామా. మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) కింద పనిచేసే ISTRAC (ISRO Telemetry, Tracking and Command Network) విభాగం నుంచి డిగ్రీ, డిప్లొమా, అలాగే ITI చేసిన వాళ్ళకి ఒక సూపర్ అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇస్రో లాంటి అత్యుత్తమ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో పని చేసే ఛాన్స్ రావడం అంటే అదృష్టం ఉండాలి మామ, మీ కెరీర్ కి ఇది చాలా పెద్ద ప్లస్ అవ్వచ్చు ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ అవ్వకండి.

మొత్తం 95 ఖాళీలు ఉన్నాయి, ISRO ISTRAC Apprentices కి ఎంపికైన వారు బెంగళూరు లోని ISTRAC సెంటర్ లో ఒక సంవత్సరం పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ కి ఎలాంటి రాత పరీక్ష ఉండదు మామ! కేవలం మీరు చదువుకున్న మార్కుల ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు కాబట్టి అస్సలు భయపడాల్సిన పని లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. అలాగే, ఈ జాబ్ నోటిఫికేషన్ ని మీ వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి, ఎవరికో ఒకరికి ఈ నోటిఫికేషన్ కచ్చితంగా యూస్ అవ్వచ్చు. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం!

Recruitment Overview :- 

Organization ISRO Telemetry, Tracking and Command Network (ISTRAC)
Post Name Graduate, Diploma & Trade (ITI) Apprentices
Total Vacancies 95 Posts
Qualification B.E/B.Tech, Diploma, ITI
Job Location Bengaluru
Apply Mode Online / Email Submission
Last Date 31-July-2026
Official Website www.istrac.gov.in

పోస్టుల వివరాలు (Vacancy Details) :- 

అసలు ISRO ISTRAC Apprentices నోటిఫికేషన్ లో ఏయే ఏయే పోస్టులు ఉన్నాయి అని చాలామంది అడుగుతున్నారు. మీ కోసం ఆ వివరాలు ఇక్కడ టేబుల్ రూపంలో రాసాను ఒకసారి చెక్ చేసుకోండి:

అప్రెంటిస్ కేటగిరీ అర్హత ఉన్న విభాగాలు (Trades/Branches)
Graduate Apprentices ఇంజనీరింగ్ డిగ్రీ (B.E/B.Tech) – ECE, CSE, Mechanical, EEE, Civil తదితర బ్రాంచీలు.
Diploma Apprentices పాలిటెక్నిక్ డిప్లొమా (Diploma) – ECE, CSE, Mechanical, EEE, కమర్షియల్ ప్రాక్టీస్ మొదలైనవి.
Trade (ITI) Apprentices ఐటీఐ (ITI) – Fitter, Electrician, Electronic Mechanic, Turner, Machinist, COPA తదితర ట్రేడ్స్.

Education & Age :- 

 ISRO ISTRAC Apprentices జాబ్స్ కి కావాల్సిన ఎడ్యుకేషన్ మరియు ఏజ్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ ఇచ్చాను చెక్ చేసుకోండిఫ్రెండ్స్:

  • Graduate Apprentices: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్ లో బి.టెక్ (B.E/B.Tech) కనీసం 60% మార్కులతో (First Class) పాస్ అయి ఉండాలి.
  • Diploma Apprentices: ఇంజనీరింగ్ లేదా కమర్షియల్ ప్రాక్టీస్ లో మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో కంప్లీట్ చేయాలి.
  • Trade (ITI) Apprentices: పదవ తరగతి (SSLC) తో పాటుగా సంబంధిత ట్రేడ్ లో NCVT/SCVT గుర్తింపు పొందిన ITI సర్టిఫికెట్ మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి.
  • పాసింగ్ ఇయర్ రూల్: కేవలం 2024, 2025, లేదా 2026 సంవత్సరాల్లో కోర్సు పూర్తి చేసి పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. 2023 లేదా అంతకంటే ముందు పాస్ అయిన వాళ్ళకి అప్లై చేసే ఛాన్స్ లేదు.
  • వయోపరిమితి (Age Limit): అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం అభ్యర్థులకు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 35 ఏళ్లు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST వాళ్ళకి 5 ఏళ్లు, OBC వాళ్ళకి 3 ఏళ్లు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మామా.

Salary Details(జీతం వివరాలు) :- 

ISRO ISTRAC Apprentices జాబ్ ఒక సంవత్సరం పాటు ఉండే అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం. కాబట్టి డైరెక్ట్ పర్మనెంట్ శాలరీ ఉండదు కానీ, ఒక బేసిక్ స్టైపెండ్ (Stipend) ప్రతి నెలా ఇస్తారు:

  • Graduate Apprentices: సెలెక్ట్ అయిన బి.టెక్ అభ్యర్థులకు నెలకు కచ్చితంగా ₹9,000 స్టైపెండ్ మీ అకౌంట్ లో పడుతుంది.
  • Diploma Apprentices: డిప్లొమా పూర్తి చేసి సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకు ₹8,000 ఇస్తారు.
  • ITI Apprentices: ఐటీఐ వాళ్లకు వాళ్ళ ట్రేడ్ ని బట్టి (అంటే వన్ ఇయర్ కోర్స్ లేక టు ఇయర్స్ కోర్స్ అనేదాన్ని బట్టి) ₹7,700 నుంచి ₹8,050 దాకా స్టైపెండ్ పే చేస్తారు.
  • NOTE : ఇది కేవలం స్టైపెండ్ మాత్రమే. మీకు HRA, DA లాంటి ఎక్స్ట్రా అలవెన్సులు ఏమీ ఉండవు.

Selection Process(ఎంపిక విధానం) :- 

ISRO ISTRAC Apprentices జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కాబట్టి సెలెక్షన్స్ ప్రాసెస్  చాలా పారదర్శకంగా ఉంటుంది . దీని ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కింద ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి:

  1. మెరిట్ లిస్ట్ తయారీ (Shortlisting): ముందుగా మీరు అప్లికేషన్ లో పెట్టిన మీ ఎడ్యుకేషన్ (డిగ్రీ/డిప్లొమా/ఐటీఐ) పర్సంటేజ్ మార్కుల ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తీస్తారు. మార్కులు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్!
  2. డాక్యుమెంట్ వెరిఫికేషన్: షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇమెయిల్ ద్వారా ఇన్ఫార్మ్ చేసి, ఒరిజినల్ సర్టిఫికెట్లు అన్ని చెక్ చేస్తారు. (దీనికి మీరు సొంత ఖర్చులతోనే బెంగళూరు వెళ్ళాలి, ఎలాంటి ట్రావెల్ ఛార్జెస్ వాళ్ళు ఇవ్వరు).
  3. పర్సనల్ ఇంటర్వ్యూ: డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే ఒక చిన్న బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా ఉంది అని టెస్ట్ చేస్తారు.
  4. ఫైనల్ సెలక్షన్: చివరగా మీ అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ లో మీ పెర్ఫార్మన్స్ మరియు మెడికల్ ఫిట్నెస్ అన్నీ చూసి జాబ్ కన్ఫర్మ్ చేస్తే ఫైనల్ లిస్ట్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారు.

Syllabus(సిలబస్) :- 

ఇందాక చెప్పుకున్నట్టు ISRO ISTRAC Apprentices జాబ్ కి ఎలాంటి రాత పరీక్ష (Written Exam) లేదు కాబట్టి, బుక్స్ పట్టుకుని చదవాల్సిన సిలబస్ ఏమీ లేదు. కానీ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఈ టాపిక్స్ వెళ్లే ముందు చూసుకోండి:

  • మీ కోర్ బ్రాంచ్ బేసిక్స్ (ఉదాహరణకు మీరు ECE అయితే బేసిక్ ఎలక్ట్రానిక్స్, Mechanical అయితే థర్మోడైనమిక్స్, ITI ఎలక్ట్రీషియన్ అయితే వైరింగ్ బేసిక్స్) కచ్చితంగా రివిజన్ చేసుకోండి.
  • ఇస్రో (ISRO) గురించి, వాళ్ళ రీసెంట్ మిషన్స్ (చంద్రయాన్-3, ఆదిత్య L1) గురించి జనరల్ నాలెడ్జ్ పెంచుకునే వెళ్ళండి. కచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు.
  • మీరు ఫైనల్ ఇయర్ లో చేసిన ప్రాజెక్టు గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోండి.

How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి) :- 

ISRO ISTRAC Apprentices జాబ్స్ కి ఆన్లైన్ లో అప్లై చేయడానికి ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా ఈ కింద ఉన్న స్టెప్స్ ఫాలో అయిపోండి:

  • ముందుగా డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులు NATS పోర్టల్ (nats.education.gov.in) లో అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి 16 డిజిట్ల ఎన్రోల్మెంట్ నెంబర్ తెచ్చుకోవాలి. ITI వాళ్ళైతే Apprenticeship India (apprenticeshipindia.org) పోర్టల్ లో ప్రొఫైల్ 100% పూర్తి చేయాలి.
  • తర్వాత ISTRAC అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, అందులో డీటెయిల్స్ అన్నీ పెన్ తో తప్పులు లేకుండా ఫిల్ చేసి, మీ ఫోటో అంటించి సంతకం చేయాలి.
  • తర్వాత ఆ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ తో పాటు… మీ 10th క్లాస్ మెమో, డిగ్రీ/డిప్లొమా/ఐటిఐ మార్క్స్ మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం (Caste Certificate), ఆధార్ కార్డు మరియు అప్రెంటిస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ పేజీ అన్నీ కలిపి ఒకటే సింగిల్ పిడిఎఫ్ (PDF) ఫైల్ లాగా స్కాన్ చేసుకోండి.
  • రెడీ చేసుకున్న ఆ ఫైల్ ని అఫీషియల్ గా ఇచ్చిన ఇమెయిల్ ఐడి కి (ఉదాహరణకు: apprmt_blr@istrac.gov.in) 31 జూలై 2026 లోపు సెండ్ చేయాలి. సబ్జెక్ట్ లో “Application for Apprenticeship Training – 2026” అని రాయడం మర్చిపోకండి.

Important Links :- 

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు) :-

  1. ISRO ISTRAC Apprentices నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?

ISRO ISTRAC Apprentices అప్లై చేసుకోవడానికి జులై 31, 2026 అనేది ఆఖరి తేదీ మామ. సర్వర్ ఇష్యూస్ రాకముందే మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుని ఫాస్ట్ గా ఇమెయిల్ చేయండి.

  1. నేను 2022 లో డిగ్రీ పాస్ అయ్యాను, నేను ఈ ISRO ISTRAC Apprentices నోటిఫికేషన్ కి అప్లై చేయొచ్చా?

లేదు బ్రదర్. అఫీషియల్ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం కేవలం 2024, 2025 మరియు 2026 సంవత్సరాల్లో పాస్ అయిన ఫ్రెషర్స్ కి మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చారు. పాత బ్యాచ్ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు.

  1. అసలు ఈ ISRO ISTRAC Apprentices నోటిఫికేషన్ కి నిజంగా ఎలాంటి ఎగ్జామ్ ఉండదా?

అవును మామా, నిజంగానే ఎలాంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ గానీ, రాత పరీక్ష గానీ అస్సలు ఉండదు. మీ ఎడ్యుకేషన్ లో వచ్చిన మార్కుల పర్సంటేజ్ ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు అంతే. ఇంటర్వ్యూలో కూడా మీ సబ్జెక్ట్ బేసిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి.So Don’t Miss It.

🔴Related Post

Leave a Comment