🚀 AP Job Calendar 2026: 10,060 ప్రభుత్వ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ | ఏపీ నిరుద్యోగులకు అసలైన పండుగ!

By Quick Job Updates

Published On:

AP Job Calendar

Join WhatsApp

Join Now

AP Job Calendar 2026 గురించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఫైనల్ గా AP గవర్నమెంట్ నుంచి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. Hello friends, ఎలా ఉన్నారు? మామా, ఏపీలో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ప్రతి ఒక్కరికీ ఉంటుంది అలాంటి వాళ్ళ అందరికి ఈ అప్డేట్ ఒక పెద్ద బూస్ట్ లాంటిది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్ గా G.O.Ms.No.81 విడుదల చేసింది, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఏకంగా 10,060 పోస్టులను భర్తీ చేయడానికి అఫీషియల్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్నేళ్లుగా ఇలాంటి నోటిఫికెషన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్,ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వదు!

అసలు AP Job Calendar లో వున్నా ఈ 10,060 పోస్టుల కథ ఏంటి? ఏయే డిపార్ట్‌మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ ఆర్టికల్ లో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చదవండి, ఎందుకంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు పూర్తి క్లారిటీ తో ఉండటం చాలా ముఖ్యం.

అసలు ఈ G.O.Ms.No.81 ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటి?

మనం చాలాసార్లు వింటూ ఉంటాం, “క్యాలెండర్ అన్నారు, ఇంకా రాలేదు” అని. కానీ ఈసారి ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టకుండా, అధికారికంగా జీవో (Government Order) పాస్ చేసింది. అంటే AP Job Calendar లో వున్నా 10,060 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ (Finance Department) ఆమోదం లభించింది అన్నమాట. ఇక మిగిలింది ఆయా బోర్డులు (APPSC, DSC, Police Recruitment Board) నోటిఫికేషన్లు ఇవ్వడమే. గత కొన్ని సంవత్సరాలుగా సరైన నోటిఫికేషన్లు లేక వయోపరిమితి దాటిపోతుందేమో అని భయపడుతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఈ జీవో ఒక పెద్ద ఊరటనిచ్చింది.

ఏయే డిపార్ట్‌మెంట్‌లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? (Detailed Breakdown)

AP Job Calendar లో ఒకే రకమైన ఉద్యోగాలు కాకుండా, అన్ని రకాల క్వాలిఫికేషన్స్ వాళ్లకి సరిపోయేలా పోస్టులు డివైడ్ చేశారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం:

  1. విద్యాశాఖ (DSC & Teacher Posts – 2,991 ఖాళీలు):

చాలా మంది ఎదురు చూసేది టీచర్ జాబ్స్ కోసం. ఈసారి సుమారు 2,991 టీచర్ పోస్టులకు ఆమోదం లభించింది. ఇందులో SGT (Secondary Grade Teacher) మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. B.Ed లేదా D.Ed పూర్తి చేసి, టెట్ (TET) క్వాలిఫై అయిన అభ్యర్థులు దీనికి అర్హులు.

  1. పోలీస్ డిపార్ట్‌మెంట్ (Police Recruitment – 2,800+ ఖాళీలు):

ఖాకీ బట్టలు వేసుకోవాలి, పవర్ ఫుల్ జాబ్ చేయాలి అని కలలు కనే వాళ్ళకి ఇది బెస్ట్ టైం. కానిస్టేబుల్స్ (Civil/AR/APSP) తో పాటు, సబ్-ఇన్స్పెక్టర్ (SI) పోస్టులు కలుపుకొని దాదాపు 2,800 పైగా పోస్టులు ఈ క్యాలెండర్ లో ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కానిస్టేబుల్ కి, డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు SI పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే రాత పరీక్ష తో పాటు ఫిజికల్ ఈవెంట్స్ (పరుగు, లాంగ్ జంప్ లాంటివి) చాలా కీలకం.

  1. గ్రూప్-1 & గ్రూప్-2 (APPSC Groups – 1,500+ ఖాళీలు):

రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి పోస్టులు ఇవే. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, తహశీల్దార్, సబ్-రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ లాంటి పవర్ ఫుల్ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇందులో ఉంటాయి. డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరూ గ్రూప్స్ కి పోటీ పడొచ్చు. కాంపిటీషన్ చాలా హెవీ గా ఉంటుంది, కాబట్టి సిలబస్ మీద పట్టు సాధించడం చాలా అవసరం.

  1. ఇతర శాఖలు (మెడికల్, ఇంజనీరింగ్, ఫారెస్ట్ – 2,700+ ఖాళీలు):

సాధారణ డిగ్రీలు కాకుండా టెక్నికల్ మరియు మెడికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. నర్సింగ్, పారామెడికల్ స్టాఫ్, అసిస్టెంట్ ఇంజనీర్లు (AE/AEE), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు లాంటి పోస్టులన్నీ ఈ కేటగిరీ కింద భర్తీ చేస్తారు.

నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? 4 ఫేజుల ప్లాన్ ఏంటి?

AP Job Calendar లో వున్నా 10,060 పోస్టులన్నీ ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తే, నిరుద్యోగులకు ప్రిపేర్ అవ్వడానికి కన్ఫ్యూజన్ వస్తుందని ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అదే “4-Phase Recruitment”. దీని ప్రకారం:

  • Phase 1 (ఫేజ్ 1): ముందుగా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుండి SI మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది.
  • Phase 2 (ఫేజ్ 2): ఆ తర్వాత విద్యా శాఖకు సంబంధించిన ఏపీ డీఎస్సీ (AP DSC) నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారు.
  • Phase 3 (ఫేజ్ 3): గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ల కోసం APPSC ద్వారా గ్రూప్-1 మరియు గ్రూప్-2 తో పాటు ఇతర డిపార్ట్‌మెంటల్ నోటిఫికేషన్లు ఇస్తారు.
  • Phase 4 (ఫేజ్ 4): చివరగా, మెడికల్ బోర్డు మరియు ఇతర సాంకేతిక విభాగాలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.

ఇలా విడివిడిగా రావడం వల్ల అభ్యర్థులు ఒకేసారి నాలుగైదు ఎగ్జామ్స్ కి క్లాష్ అవ్వకుండా, ప్రశాంతంగా ఒక్కో దానికి ఫోకస్ చేసుకోవచ్చు.

ఎంపిక విధానం (Selection Process) ఎలా ఉంటుంది?:-

మామ, AP Job Calendar లో వున్నా 10,060 పోస్టులకు ఎంపిక విధానం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. పోస్టును బట్టి ఇది మారుతుంది.

  • గ్రూప్స్ & అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్: ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ (స్క్రీనింగ్ టెస్ట్) ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు. మెయిన్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఇంటర్వ్యూలు చాలా వరకు రద్దు చేశారు.
  • పోలీస్ జాబ్స్: ముందుగా ఒక ప్రిలిమినరీ రాత పరీక్ష పెడతారు. అది పాస్ అయ్యాక PMT & PET (ఫిజికల్ టెస్టులు) ఉంటాయి. వాటిలో కూడా పాస్ అయితే అప్పుడు ఫైనల్ రాత పరీక్ష (Mains) ఉంటుంది.
  • డీఎస్సీ: టెట్ (TET) లో వచ్చిన వెయిటేజీ మార్కులు, మరియు డీఎస్సీ రాత పరీక్షలో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ లిస్ట్ తీస్తారు.

నిరుద్యోగులు ఇప్పటి నుంచే తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్:-

AP Job Calendar లో వున్నా ప్రతి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటే మాత్రం ఈసారి జాబ్ కొట్టడం చాలా కష్టం. కాంపిటీషన్ లక్షల్లో ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి.

  1. డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోండి: ముందుగా మీ క్యాస్ట్ సర్టిఫికెట్, నాన్-క్రీమీలేయర్, EWS సర్టిఫికెట్లు, మరియు స్టడీ కండక్ట్ సర్టిఫికెట్లు అన్ని రెడీగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి.
  2. OTPR చెక్ చేసుకోండి: APPSC వెబ్‌సైట్‌లో ‘One Time Profile Registration’ వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా, ఫోన్ నెంబర్ వర్కింగ్ లో ఉందా అని లాగిన్ అయి చెక్ చేసుకోండి.
  3. సిలబస్ ప్రింట్ అవుట్: మీరు AP Job Calendar లో వున్నా ఏ జాబ్ కి టార్గెట్ చేస్తున్నారో ఆ జాబ్ పాత సిలబస్ ని ప్రింట్ తీసుకుని మీ టేబుల్ మీద పెట్టుకోండి. జనరల్ స్టడీస్ (హిస్టరీ, పాలిటి, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్) అన్నింటికీ కామన్ గా ఉంటుంది కాబట్టి దాని మీద ముందు పట్టు సాధించండి.
  4. ప్రాక్టీస్ & రివిజన్: రోజుకి కనీసం 8-10 గంటలు చదవడానికి ప్లాన్ చేసుకోండి. చదవడం ఎంత ముఖ్యమో, పాత ప్రశ్నాపత్రాలు (Previous Papers) మరియు మాక్ టెస్టులు రాయడం కూడా అంతే ముఖ్యం.

ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే… ఇన్ని వేల ఉద్యోగాలతో AP Job Calendar రావడం అనేది ఒక పండగ లాంటి వార్త మామ. సో అసలు టైం వేస్ట్ చేయకండి. సోషల్ మీడియాకి కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చి ఈ AP Job Calendar లో వున్నా పోస్టులకు ప్రిపేర్ అవ్వండి. మీరు గట్టిగా కష్టపడితే ఈసారి ఆ 10,060 పోస్టుల్లో ఒక సీట్ కచ్చితంగా మీదే అవ్వుతుంది 

ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్! ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నా. మీ తోటి ఆస్పిరెంట్స్ కి కూడా ఈ ఆర్టికల్ ని  షేర్ చేసి వాళ్ళకి కూడా అప్డేట్ ఇవ్వండి.

Mandatory Links:-

Official detailed Notification PDF :-Click Here

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి.

Frequently Asked Questions (FAQs):-

1. AP Job Calendar ద్వారా మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు?

 AP Job Calendar ద్వారా ఏపీ ప్రభుత్వం G.O.Ms.No.81 ద్వారా మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేస్తోంది. ఇందులో పోలీస్ (2,800+), డీఎస్సీ (2,991), మరియు గ్రూప్స్ (1,500+) తో పాటు ఇతర శాఖల పోస్టులు ఉన్నాయి.

2. AP Job Calendar వున్నా ఉద్యోగాలకు ఇతర రాష్ట్రాల వారు (తెలంగాణ) అప్లై చేసుకోవచ్చా ?

అవును, అప్లై చేయవచ్చు. కానీ ఇతర రాష్ట్రాల అభ్యర్థులను నాన్-లోకల్ (Non-Local) కేటగిరీ కింద పరిగణిస్తారు (సాధారణంగా 15% లేదా 20% ఓపెన్ కోటా). వీరికి ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు మరియు ఓపెన్ కాంపిటీషన్ (OC) మెరిట్ లోనే సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది.

3.AP Job Calendar వున్నా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఒకేసారి వస్తాయా? లేక వేర్వేరుగా వస్తాయా?

AP Job Calendar వున్నా ఈ 10,060 పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ రాదు. అభ్యర్థుల ప్రిపరేషన్ కు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం 4 ఫేజుల్లో (దశల వారీగా) నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా పోలీస్ ఆ తర్వాత డీఎస్సీ, ఆ తర్వాత గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

🔴Related Post

Leave a Comment