PGCIL POWERGRID Non Executive Recruitment 2026 | ITI/Diploma/Degree వాళ్ళకి మంచి అవకాశం | Apply Online Now!

By Quick Job Updates

Published On:

PGCIL POWERGRID

Join WhatsApp

Join Now

Hello friends. PGCIL POWERGRID నుండి Non Executive Recruitment 2026 పోస్టులకు  సంబంధించి ఒక బెస్ట్ అప్డేట్ వచ్చేసింది mama. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్న చేస్తున్న వాళ్ళ అందరకి ఇది నిజంగా మంచి న్యూస్ అని చెప్పాలి.

పవర్ గ్రిడ్ (Power Grid Corporation of India Limited) నుండి మొత్తం 660 Junior Officer Trainee, Diploma Trainee, మరియు Junior Technician Trainee పోస్టులకు భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి జాబ్స్ కి కాంపిటీషన్ కొంచెం గట్టిగా ఉంటుంది, కానీ శాలరీ అండ్ జాబ్ సెక్యూరిటీ మాత్రం చాలా బాగుంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.

అసలు ఈ జాబ్స్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు? డిప్లొమా (కచ్చితంగా 70% మార్క్స్ ఉండాలి), మరియు ఐటీఐ లేదా బేసిక్ డిగ్రీ (BBA/BBM) కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి మంచి ఛాన్స్ ఉంది. అప్లికేషన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్ మరియు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న డీటెయిల్స్ అన్నీ కింద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జాగ్రత్తగా చదివి అప్లై చేసుకోండి ఈ ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇలాంటి టెక్నికల్ అండ్ నాన్-టెక్నికల్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్లకు వెంటనే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ అవ్వచ్చు.

📌 Recruitment Overview (సంక్షిప్త వివరాలు) :-

అంశం  వివరాలు
Organization Power Grid Corporation of India Limited (PGCIL)
Post Name Junior Officer Trainee, Diploma Trainee, Junior Technician Trainee
Total Vacancies 660 Posts
Qualification ITI / Diploma / Degree (సంబంధిత ట్రేడ్/బ్రాంచ్ లో)
Job Location All Over India (ఆల్ ఇండియా)
Apply Mode Online (ఆన్లైన్ విధానం)
Last Date 11 May 2026
Official Website powergrid.in

🎓 Education Qualification & Age Limit (అర్హతలు) :- 

PGCIL POWERGRID జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి కావలసిన అఫీషియల్ ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ డీటెయిల్స్ కింద ఇచ్చాను చూసుకోండి.

Junior Officer Trainee (HR & F&A): HR పోస్టులకు  BBA / BBM / BBS లో కనీసం 60% మార్కులతో డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, మరియు ఫైనాన్స్ (F&A) పోస్టులకు Inter CA లేదా Inter CMA కంప్లీట్ చేసి ఉండాలి.

  • Diploma Trainee (Electrical/Civil/Survey): ఎలక్ట్రికల్, సివిల్ లేదా సర్వే బ్రాంచ్ లో 3 సంవత్సరాలు రెగ్యులర్ డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి. కనీసం 70% మార్కులు కచ్చితంగా ఉండాలి(SC/ST వాళ్ళకి జస్ట్ పాస్ మార్క్ ఉంటే చాలు). వీటికి B.E/B.Tech చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు.
  • Junior Technician Trainee: 10th క్లాస్ తో పాటు ఐటీఐ (ITI – Surveyor trade) లో 2 ఏళ్ల సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి.
  • వయోపరిమితి (Age Limit): అభ్యర్థుల గరిష్ట వయసు మే 11, 2026 నాటికి 27 ఏళ్లు దాటకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం OBC వాళ్ళకి 3 ఏళ్లు, SC/ST వాళ్ళకి 5 ఏళ్లు ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉంది.

💰 జీతం వివరాలు (Salary Details) :-

  • ట్రైనింగ్ సమయంలో: PGCIL POWERGRID జాబ్స్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముందుగా 1 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తారు. ఈ టైమ్ లో టెక్నీషియన్ పోస్టులకి ₹21,500, మరియు డిప్లొమా/జూనియర్ ఆఫీసర్ పోస్టులకి నెలకు ₹27,500 వరకు స్టైపెండ్ పే చేస్తారు.
  • రెగ్యులర్ అయ్యాక: ట్రైనింగ్ ఫుల్ గా కంప్లీట్ అయిన తర్వాత , టెక్నీషియన్ కి ₹21,500 – ₹74,000 మధ్య పే స్కేల్ ఉంటుంది. అలాగే డిప్లొమా మరియు ఆఫీసర్ పోస్టులకు బేసిక్ పే ₹25,000 నుండి స్టార్ట్ అయ్యే, గరిష్టంగా ₹1,17,500 వరకు చేరుతుంది.
  • దీనికి తోడుగా DA, HRA, PF, మరియు ఇతర అలవెన్సులు కలుపుకుంటే ప్రతి నెలా చేతికి వచ్చే సాలరీ చాలా ఎక్కువ మామ.

📝 ఎంపిక విధానం ఎలా ఉంటుంది? (Selection Process) :-

PGCIL POWERGRID జాబ్స్ కి సెలక్షన్ ప్రాసెస్ చాలా బాగా జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో మొత్తం నాలుగు స్టేజెస్ ఉంటాయి:

  1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test – CBT): PGCIL POWERGRID  జాబ్స్ కి అప్లై చేసుకున్న వారికి ముందుగా ఒక ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు. ఈ ఎక్సమ్ లో మీ టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి.
  2. స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ (Skill Test/ Test): ఆన్లైన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి క్వాలిఫైయింగ్ నేచర్ లో కంప్యూటర్ స్కిల్ లేదా ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ ని నిర్వహిస్తారు .
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification): మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలిచి వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్లు అన్ని పక్కాగా  చెక్ చేస్తారు.
  4. మెడికల్ ఎగ్జామినేషన్ (Medical Examination): ఫైనల్ గా PGCIL POWERGRID రూల్స్ ప్రకారం అభ్యర్థి ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని మెడికల్ టెస్ట్ చేసి అన్ని ఓకే అనుకుంటే పోస్టింగ్ ఇస్తారు.

📚 సిలబస్ వివరాలు (Detailed Syllabus) :- 

PGCIL POWERGRID  ఎగ్జామ్ పేపర్ ని మెయిన్ గా రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసి ఇస్తారు.

  • Part-I (Professional Knowledge): ఈ ఎక్సమ్ లో మీ కోర్ సబ్జెక్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి (ఉదాహరణకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బేసిక్స్ లేదా HR అడ్మినిస్ట్రేషన్).
  • Part-II (Supervisory / Executive Aptitude): ఈ ఎక్సమ్ లో Vocabulary, Reading Comprehension, Quantitative Aptitude, Reasoning Ability లాంటి జనరల్ కాంపిటీటివ్ టాపిక్స్ మీద ఉంటుంది.

💻 ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply Online):-

PGCIL POWERGRID పోస్టులకు అప్లై చేయడం చాలా ఈజీ మామ. ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది:

  1. ముందుగా PGCIL యొక్క అఫీషియల్ వెబ్సైట్ ని(powergrid.in) ఓపెన్ చేయండి.
  2. ఆ వెబ్సైట్ హోమ్ పేజీలో ‘Careers’ అనే ఆప్షన్ లోకి వెళ్లి ‘Job Opportunities’ అని ఉంటుంది దానిమీద క్లిక్ చేయండి.
  3. అక్కడ “Recruitment of Non-Executive Posts 2026” కి సంబంధించిన అప్లికేషన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ని ఓపెన్ చేయండి.
  4. మీ మొబైల్ నెంబర్, మరియు ఈమెయిల్ ఐడీ తో ‘New Registration’ చేసుకోండి.
  5. అప్లికేషన్ ఫామ్ ని ఓపెన్ చేసి  మీ డీటెయిల్స్ అన్నీ పక్కాగా ఫిల్ చేసి, ఫోటో మరియు సర్టిఫికెట్స్ కరెక్ట్ గా అప్లోడ్ చేయండి.
  6. జనరల్/OBC అభ్యర్థులు డిప్లొమా/జూనియర్ ఆఫీసర్ పోస్టులకి అయితే  ₹300, టెక్నీషియన్ పోస్టులు అయితే  ₹200 ఫీజు ఆన్లైన్లో పే చేసి ఫైనల్ గా  సబ్మిట్ చేయండి (SC/ST వాళ్ళకి ఫీజు లేదు).అంటే మీ అప్లికేషన్ విజయవంతంగా కంప్లీట్ అయినట్టే.

నా నుంచి చిన్న  అడ్వైజ్ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ ప్రింట్ అవుట్ ని  కచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మే 11, 2026 లోపు అప్లై చేయడం మర్చిపోకండి!

📄 Official Notification PDF:- Click Here

✍️ Apply Online Link:- Click Here

🌐 Official Website:- Click Here

❓ FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు) :- 

Q1: PGCIL POWERGRID నోటిఫికేషన్ కి B.Tech చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా?

A: లేదు ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం B.E/B.Tech లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు డిప్లొమా ట్రైనీ పోస్టులకి ఎలిజిబుల్ కారు. కేవలం డిప్లొమా లేదా ఐటీఐ పాస్ అయిన వాళ్లు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.

Q2: PGCIL POWERGRID ఆన్లైన్ ఎగ్జామ్ లో నెగిటివ్ మర్క్స్ ఉంటాయా?

A: PGCIL CBT ఎగ్జామ్ లో ఖచ్చితంగా నెగెటివ్ మర్క్స్ ఉంటాయ్(ప్రతి తప్పు ఆన్సర్ కి 1/4 వంతు మార్క్ కట్ అవుతుంది). కాబట్టి పక్కాగా తెలిసిన ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి.

Q3:  PGCIL POWERGRID జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?

A: ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 11, 2026. సో టైమ్ తీసుకుని వెంటనే అప్లై చేసుకోండి.

🔴Related Post

Leave a Comment