RRB Technician Recruitment 2026 అఫీషియల్ అప్లై డేట్స్ కూడా రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. హలో మామ,అందరూ ఎలా ఉన్నారు? మీకోసం RRB Technician Recruitment నోటిఫికేషన్ కి సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ ని క్లియర్ కట్ గా, చాలా వివరంగా తీసుకువచ్చాను. మన ఇండియన్ రైల్వేస్ ఏకంగా 6,565 టెక్నీషియన్ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అది రైల్వేలో సెటిల్ అవ్వాలి అనుకునేవారు ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు.
RRB Technician Recruitment పోస్టులకు సంబంధించి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా బీటెక్ చదివిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఈ జాబ్స్ కి కాంపిటీషన్ చాలా హెవీ గా ఉంటుంది. ఈ జాబ్ కి సంబందించిన ఎడ్యుకేషన్, ఏజ్, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, సిలబస్ మరియు ఎంపిక విధానం లాంటి వివరాలన్నీ చాలా డీటెయిల్డ్ గా క్రింద రాసాను, సో జాగ్రత్తగా చదివి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో కూడా తప్పకుండా ఈ ఆర్టికల్ ని షేర్ చేయడం మర్చిపోకండి.
Recruitment Overview :-
| వివరాలు | సమాచారం |
| Organization | Indian Railways (Railway Recruitment Board – RRB) |
| Post Name | RRB Technician (Grade I Signal & Grade III) |
| Total Vacancies | 6,565 Posts |
| Qualification | 10th + ITI / Diploma / Degree (B.Sc/B.Tech) |
| Job Location | Across India |
| Apply Mode | Online |
| Apply Start Date | 30 June 2026 |
| Last Date | 29 july 2026 |
| Official Website | rrbcdg.gov.in |
Vacancy Breakdown :-
| పోస్టు పేరు (Post Name) | ఖాళీల సంఖ్య (Vacancies) |
| RRB Technician Grade I Signal | 1,092 పోస్టులు |
| RRB Technician Grade III | 5,473 పోస్టులు |
| మొత్తం ఖాళీలు (Total) | 6,565 పోస్టులు |
Education & Age – Full Details :-
మామా, RRB Technician Recruitment జాబ్స్ కి క్వాలిఫికేషన్స్ మరియు ఏజ్ లిమిట్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళ కోసం క్లియర్ గా పోస్టుల వారీగా పూర్తి వివరాలు రాసాను చెక్ చేసుకోండి:
1. Technician Grade I Signal
- విద్యార్హత (Education): గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఫిజిక్స్ (Physics), ఎలక్ట్రానిక్స్ (Electronics), కంప్యూటర్ సైన్స్ (Computer Science), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లో బీఎస్సీ (B.Sc) కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి.
- లేదా పైన పేర్కొన్న సబ్జెక్టులలో ఏవైనా కాంబినేషన్స్ తో 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా (Diploma) లేదా 4 సంవత్సరాల బీటెక్ (B.Tech) పూర్తి చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు.
- వయోపరిమితి (Age Limit): కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, గరిష్టంగా 36 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.
2. Technician Grade III
- విద్యార్హత (Education): పదో తరగతి (Matriculation/10th) పాస్ అయి ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్ లో ఖచ్చితంగా ITI (NCVT/SCVT) సర్టిఫికెట్ లేదా Apprenticeship (NAC) కోర్సు పూర్తి చేసి ఉండాలి.
- NOTE: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, టర్నర్, వైర్ మాన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి వేర్వేరు ట్రేడ్ లకు వేర్వేరుగా వేకెన్సీ లు ఉంటాయి. మీ ఐటిఐ ట్రేడ్ ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు.
- వయోపరిమితి (Age Limit): కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, గరిష్టంగా 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.
💡 వయోపరిమితి సడలింపు (Age Relaxation): ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది. ఓబీసీ (OBC) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ మరియు ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు (Salary Structure) :-
RRB Technician Recruitment జాబ్స్ కి బేసిక్ పే తో పాటు కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు కూడా ఉంటాయి.
Technician Grade I Signal (Level 5)
- బేసిక్ పే (Basic Pay): ₹29,200/-RS
- అలవెన్సులు: డియర్నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ (TA) మరియు రైల్వే మెడికల్ ఫెసిలిటీస్.
- గ్రాస్ శాలరీ (Gross Salary): అన్ని అలవెన్సులు కలుపుకుంటే జాయిన్ అయిన కొత్త లోనే నెలకు దాదాపు ₹45,000 నుండి ₹48,000 వరకు చేతికి వస్తుందిగ్రాస్ శాలరీ వస్తుంది.
Technician Grade III (Level 2)
- బేసిక్ పే (Basic Pay): ₹19,900
- అలవెన్సులు: ఈ పోస్టులకు కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం DA, HRA, TA మరియు నైట్ డ్యూటీ అలవెన్స్ (వర్తించే పోస్టులకు) లభిస్తాయి.
- గ్రాస్ శాలరీ (Gross Salary): స్టార్టింగ్ లోనే అన్ని రకాల అలవెన్సులు యాడ్ అయి నెలకు దాదాపు ₹28,000 నుండి ₹32,000 వరకు మంచి శాలరీ వస్తుంది.
ఎంపిక ప్రక్రియ (Selection Process) :-
RRB Technician Recruitment జాబ్ సాధించాలంటే మనం కచ్చితంగా మూడు ముఖ్యమైన స్టేజెస్ దాటాల్సి ఉంటుంది మామ. పక్కా ప్లానింగ్ సెట్ చేసుకుంటే సింగిల్ అటెంప్ట్ లోనే ఈ జాబ్ కొట్టేయొచ్చు!
[కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)] ➔ [డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)] ➔ [మెడికల్ ఎగ్జామినేషన్]
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): ఈ స్టెప్ ఆన్లైన్ లో జరిగే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. ఇందులో వచ్చే మార్కులే మనకి ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తాయి. గ్రేడ్ 1 కి మరియు గ్రేడ్ 3 కి వేర్వేరుగా సింగిల్ సీబీటీ ఎగ్జామ్ జరుగుతుంది.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV): సీబీటీ ఎగ్జామ్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా 1:1 రేషియో లో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు. మీ ఎడ్యుకేషన్, క్యాస్ట్, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ అన్ని ఇక్కడ కరెక్ట్ గా చెక్ చేస్తారు.
- మెడికల్ ఎగ్జామినేషన్ (Medical Test): డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ అయిన వాళ్ళకి రైల్వే హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. టెక్నీషియన్ పోస్టులకి కంటి చూపు (Visual Acuity/Color Blindness) టెస్ట్ చాలా క్షుణ్ణంగా చేస్తారు. ఎందుకంటే రైల్వే సేఫ్టీ కేటగిరీ కింద ఈ ఫిట్నెస్ చాలా అవసరం.
⚠️ నెగెటివ్ మార్కింగ్: గుర్తుంచుకోండి మామా, ఈ సీబీటీ ఎగ్జామ్ లో నెగిటివ్ మర్క్స్ ఉంటాయ్. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు (0.33) మార్కులు కట్ చేస్తారు. కాబట్టి ఆన్సర్స్ పెట్టేటప్పుడు పక్కాగా తెలిస్తేనే ఆన్సర్స్ పెట్టండి.
సిలబస్ వివరాలు (Syllabus Details) :-
RRB Technician Recruitment గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 పోస్టులకు ఎగ్జామ్ పాటర్న్ మరియు సిలబస్ లో కొంచెం మార్పులు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, మొత్తం 90 నిమిషాలు ఎక్సమ్ ఉంటుంది.
📌 Technician Grade I Signal (సిలబస్)
- General Awareness (10 మార్కులు): కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ పరిణామాలు.
- General Intelligence & Reasoning (15 మార్కులు): అనాలజీస్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రమ్స్, సిలాజిజం, డైరెక్షన్స్, సీటింగ్ అరేంజ్మెంట్.
- Basics of Computers & Applications (20 మార్కులు): కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్స్ (Windows/Unix), ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ & ఈమెయిల్, నెట్వర్కింగ్ బేసిక్స్, సైబర్ సెక్యూరిటీ.
- Mathematics (20 మార్కులు): నంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ.
- Basic Science & Engineering (35 మార్కులు): ఫిజిక్స్ ఫండమెంటల్స్ (యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్, ఎనర్జీ, స్పీడ్, వెలాసిటీ, హీట్ & టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ & మాగ్నెటిజం).
📌 Technician Grade III (సిలబస్)
- Mathematics (25 మార్కులు): నంబర్ సిస్టమ్, బాడ్మాస్ (BODMAS), డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సీఎం & హెచ్సీఎఫ్, రేషియో, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైం & వర్క్, టైం & డిస్టెన్స్, సింపుల్ & కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ & లాస్.
- General Intelligence & Reasoning (25 మార్కులు): అనాలజీస్, ఆల్ఫాబెటికల్ & నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్ షిప్స్, సిలాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్.
- General Science (40 మార్కులు): దీనికి అత్యధిక వెయిటేజ్ ఉంది మామా! 10వ తరగతి స్టాండర్డ్ లో ఉండే ఫిజిక్స్ (Physics), కెమిస్ట్రీ (Chemistry), మరియు లైఫ్ సైన్సెస్ (Biology) సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వస్తాయి.
- General Awareness (10 మార్కులు): కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్ మరియు పాలిటిక్స్.
How to Apply(అప్లై చేయడం ఎలా?) :-
రైల్వే బోర్డు RRB Technician Recruitment జాబ్స్ కి సంబంధించిన అప్లై డేట్స్ అనౌన్స్ చేసింది కదా మామా (జూన్ 30, 2026 నుండి జూలై 29, 2026 వరకు). ఎక్కడ తప్పులు లేకుండా కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయి అప్లై చేసుకోండి:
1.అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి: మొదటగా rrbcdg.gov.in లేదా మీ రీజినల్ RRB సైట్ కి వెళ్ళండి.
ముందుగా ఏదైనా ఒక అఫీషియల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. అక్కడ మీకు “CEN 2026 Technician Recruitment – Apply Online” అనే లింక్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
2.అకౌంట్ క్రియేట్ చేసుకోండి (Registration): తర్వాత మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి అవసరం.
మొదటిసారి అప్లై చేస్తున్నట్లయితే “Create an Account” పై క్లిక్ చేయాలి. మీ పేరు, తండ్రి పేరు, డేట్ అఫ్ బర్త్, యాక్టివ్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీ (OTP) వెరిఫికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. మీకు ఒక లాగిన్ ఐడి, పాస్ వర్డ్ జనరేట్ అవుతాయి.
3.అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి:పర్సనల్ మరియు ఎడ్యుకేషన్ వివరాలు తప్పుల్లేకుండా ఇవ్వండి మామ.
ఇప్పుడు మీ ఐడి, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి. మీరు ఏ పోస్టుకి అప్లై చేయాలనుకుంటున్నారో (Grade I లేదా Grade III) సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ కమ్యూనిటీ (OC/OBC/SC/ST), అడ్రస్ మరియు టెన్త్/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ మార్కుల వివరాలను కరెక్ట్ గా ఎంటర్ చేయండి.
4.ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయండి: గుర్తుంచుకోండి రైల్వే రూల్స్ ప్రకారం వైట్ బ్యాక్ గ్రౌండ్ ఫోటో మాత్రమే ఉండాలి.
ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ మామా, చాలా మంది ఫోటో సరిగ్గా లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వుధి. మీ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో (వైట్ బ్యాక్ గ్రౌండ్ తో) మరియు మీ సిగ్నేచర్ ని నిర్దేశిత కేబీ (KB) సైజు లో క్లియర్ గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
5.అప్లికేషన్ ఫీజు చెల్లించండి: చివరిగా నెట్ బ్యాంకింగ్/యూపీఐ/కార్డ్స్ ద్వారా పే చేయవచ్చు.
మామా మీ కేటగిరీ ని బట్టి ఎగ్జామ్ ఫీజు (జనరల్/ఓబీసీ వాళ్లకు ₹500, ఎస్సీ/ఎస్టీ/మహిళలకు ₹250 ఉంటుంది, ఇందులో ఎగ్జామ్ రాశాక కొంత అమౌంట్ రిఫండ్ అవుతుంది) ఆన్లైన్ లో నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా పే చేయండి. చివరగా అప్లికేషన్ ని సబ్మిట్ చేసి, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఒక ప్రింట్ అవుట్ లేదా పిడిఎఫ్ సేవ్ చేసి పెట్టుకోవడం మర్చిపోకండి.
ముఖ్యమైన లింకులు (Mandatory Links) :-
- Official Notification PDF: Click Here
- Apply Online Link: Click Here (Link Active on June 30)
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs) :-
1. మామ, ఒకే అభ్యర్థి RRB Technician Recruitment గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 రెండు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ?
అవును మామా! ఒకవేళ మీకు బీఎస్సీ/డిప్లొమా/బీటెక్ తో పాటు ఐటిఐ క్వాలిఫికేషన్ కూడా ఉంటే, మీరు రెండు పోస్టులకు విడివిడిగా అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. రెండింటికీ వేర్వేరుగా ఎగ్జామ్స్ జరుగుతాయి.
2. RRB Technician Recruitment నోటిఫికేషన్ కి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది?
సాధారణంగా జనరల్, ఈడబ్ల్యూఎస్ (EWS) మరియు ఓబీసీ అభ్యర్థులకు ₹500 ఫీజు ఉంటుంది (మీరు సీబీటీ ఎగ్జామ్ కి హాజరైతే ₹400 రీఫండ్ అవుతుంది). అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మరియు మహిళా అభ్యర్థులకు ₹250 ఫీజు ఉంటుంది (వీరికి ఎగ్జామ్ రాశాక ₹250 మొత్తం రీఫండ్ అవుతుంది).
3. ఐటిఐ సింగిల్ ఇయర్ కోర్స్ చేసిన వాళ్ళు RRB Technician Recruitment గ్రేడ్ 3 పోస్టులకు ఎలిజిబుల్ అవుతారా?
రైల్వే బోర్డు సూచించిన ట్రేడ్స్ లో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ (NCVT/SCVT) నుండి అది ఒక సంవత్సరం కోర్సు అయినా లేదా రెండు సంవత్సరాల కోర్సు అయినా సరే, మీ దగ్గర పూర్తి సర్టిఫికెట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు మామా.





