Hello friends RBI JE Recruitment 2026 కి సంబంధించి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ మామ బ్యాంకులకే మహారాజు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే సివిల్ లేదా ఎలక్ట్రికల్ బ్రాంచ్ లో డిప్లొమా లేదా బి.టెక్ కంప్లీట్ చేసి వున్నారో వాళ్ళకి ఇది అసలు సిసలైన గోల్డెన్ ఛాన్స్. లేటెస్ట్ గా RBI JE Recruitment 2026 ద్వారా జూనియర్ ఇంజనీర్ (Junior Engineer) పోస్టుల భర్తీకి అఫీషియల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ RBI JE Recruitment 2026 నోటిఫికేషన్ లో మొత్తం 11 ఖాళీలు ఉన్నాయని అని అస్సలు తక్కువ అంచనా వెయ్యద్దు మామ. ఎందుకంటే RBI లో జాబ్ కొడితే సొసైటీలో వచ్చే రెస్పెక్ట్, లైఫ్ స్టైల్ వేరే లెవల్ లో ఉంటాయి. లాస్ట్ డేట్ మే 6, 2026 వరకే ఉంది కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఈ ఆర్టికల్ లో వయసు, అర్హతలు, జీతం, మరియు అప్లై విధానం లాంటి కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్ గా చెప్పాను. పక్కాగా చదివి అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్లకు కూడా ఈ పోస్ట్ షేర్ చేయండి, వాళ్ళకి కూడా కచ్చితంగా హెల్ప్ అవుతుంది.
📌 RBI JE Recruitment 2026 Overview (సంక్షిప్త వివరాలు) :-
| అంశం | వివరాలు |
| Organization | Reserve Bank of India (RBI) |
| Post Name | Junior Engineer (Civil & Electrical) |
| Total Vacancies | 11 Posts |
| Qualification | Diploma B.Tech (Civil, Electrical) |
| Job Location | All Over India |
| Apply Mode | Online Only |
| Last Date | May 6, 2026 |
| Official Website | https://www.rbi.org.in/ |
🎓 Education Qualification & Age Limit (అర్హతలు) :-
ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి క్వాలిఫికేషన్ చాలా క్లియర్ గా ఉంటాయ్ ఫ్రెండ్స్. బ్రాంచ్ ని బట్టి ఈ కింద డీటెయిల్స్ చెక్ చూసుకోండి. డిప్లొమా ఇన్ సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కనీసం 65% మార్కులతో (SCSTPwBD వాళ్ళకి 55%) పాస్ అయి ఉండాలి. ఒకవేళ మీరు బి.టెక్ (B.TechBE) చేసి ఉంటే, కనీసం 55% మార్కులతో (SCSTPwBD వాళ్ళకి 45%) పాస్ అవ్వాలి. ఈ జాబ్స్ కి ఎక్స్ పీరియన్స్ కూడా అడిగారు ఫ్రెండ్స్. డిప్లొమా వాళ్ళకి 2 ఏళ్ల ఎక్స్ పీరియన్స్, డిగ్రీ వాళ్ళకి 1 ఏడాది పని చేసిన ఎక్స్ పీరియన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి (Age Limit) :-
Minimum Age :- కనీసం 20 ఏళ్లు నిండి ఉండాలి. Maximum Age :- గరిష్టంగా 30 ఏళ్ల లోపు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ ని బట్టి OBC వాళ్ళకి 3 ఏళ్లు, SC/ST వాళ్ళకి 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది.
💰 RBI Junior Engineer Salary Details (జీతం వివరాలు) :-
జీతం విషయం గురించి మాట్లాడితే మాత్రం వేరే లెవల్ శాలరీ ఉంటుంది. ఇవి రిజర్వ్ బ్యాంక్ జాబ్స్ కాబట్టి , పే స్కేల్ ఎక్కువ ఉంటుంది. బేసిక్ పే స్టార్టింగ్ లోనే నెలకు ₹33,900 వరకు ఉంటుంది. దానికి తోడు Dearness Allowance (DA), HRA, Transport Allowance అన్నీ కలుపుకుంటే, మీరు జాబ్ లో చేరగానే చేతికి (Gross Salary) సుమారుగా ₹71,000+ పైనే శాలరీ వస్తుంది. ఈ జాబ్స్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మామ.
📋 RBI JE Selection Process (ఎంపిక విధానం ఎలా ఉంటుంది?) :-
RBI JE Recruitment 2026 సెలక్షన్ ప్రాసెస్ లో నాలుగు ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి.
- ఆన్లైన్ ఎగ్జామ్ (CBT) ముందుగా ఒక కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ పెడతారు (300 మార్కులకు).
- లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT) ఎగ్జామ్ పాస్ అయ్యాక, నువ్వు అప్లై చేసిన జోన్ కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ (మనకి తెలుగు) చదవడం, రాయడం వచ్చో లేదో అని టెస్ట్ ఉంటుంది.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) తర్వాత సర్టిఫికెట్స్ అన్నీ ఒరిజినల్ కాదా అని చెక్ చేస్తారు.
- మెడికల్ ఎగ్జామినేషన్ చివరగా గవర్నమెంట్ హాస్పిటల్ లో బేసిక్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది.
📚 Detailed Syllabus & Exam Pattern (సిలబస్ వివరాలు) :-
ఎగ్జామ్ లో ముఖ్యంగా మీ బ్రాంచ్ (సివిల్ఎలక్ట్రికల్) నుండే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి.
English Language (ఇంగ్లీష్) 50 క్వశ్చన్స్ 50 మార్కులు.
Engineering Discipline (నీ టెక్నికల్ సబ్జెక్ట్) 40 క్వశ్చన్స్ 100 మార్కులు.
General Intelligence & Reasoning (రీజనింగ్) 50 క్వశ్చన్స్ 50 మార్కులు.
General Awareness (జీకే) 50 క్వశ్చన్స్ 50 మార్కులు.
మొత్తం 190 క్వశ్చన్స్, 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి, గెస్ చేసి తప్పు ఆన్సర్స్ పెట్టేటప్పుడు జాగ్రత్త వుండండి.
📄 Official Notification PDF :- Click Here
✍️ Apply Online Link :- Apply
🌐 Official Website :- Click Here
👉 ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కట్ఆఫ్ మార్క్స్ మరియు స్టడీ మెటీరియల్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన WhatsApp Channel & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి.
WhatsApp Channel :- Click Here
Telegram Channel :- Click Here
❓ FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు) :-
1.ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ RBI JE Recruitment 2026 jobs కి అప్లై చేయొచ్చా? లేదనే చెప్పాలి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కి వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా అడిగారు కాబట్టి, చేతిలో సర్టిఫికెట్ ఉండి పైన చెప్పిన విధంగా పని చేసిన అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది.
2.RBI JE Recruitment 2026 అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? General, OBC మరియు EWS కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ₹450+GST ఉంటుంది. అదే SC, ST, PwBD మరియు ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్లకి కేవలం ₹50+GST ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే కట్టాలి.
3.RBI JE Recruitment 2026 ఎగ్జామ్ తెలుగులో రాసుకొనే ఆప్షన్ ఉందా? లేదు. టెక్నికల్ మరియు జనరల్ అవేర్నెస్ పేపర్లు సాధారణంగా ఇంగ్లీష్ మరియు హిందీ లోనే ఇస్తారు. కాబట్టి ఎగ్జామ్ ఇంగ్లీష్ లో రాయడానికి ప్రిపేర్ అవ్వండి. ఫైనల్ గా జరిగే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (LPT) మాత్రమే తెలుగులో రాయచ్చు.






1 thought on “🚀 RBI JE Recruitment 2026 Diploma B.Tech కి భారీ నోటిఫికేషన్ Apply Online Now”