Hiii friends! ఏంటి మామ అందరూ ఎలా ఉన్నారు? మీరు గనక CRPF Constable Tradesman Recruitment 2026 కోసం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్! సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుంచి భారీ స్థాయిలో Constable (Technical & Tradesman) పోస్టుల భర్తీకి ఏకంగా 9195 ఖాళీలతో ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే కేవలం 10th క్లాస్ లేదా ITI పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దీనికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. డిఫెన్స్ రంగం వైపు సెటిల్ అవ్వాలని అనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్.
ఈ CRPF Constable Tradesman Recruitment 2026 కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎప్పుడు అప్లై చేయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది కింద క్లియర్ గా మీకోసం వివరించాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చదవండి. అలాగే, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా టెన్త్ పాస్ అయి జాబ్స్ కోసం వెతుకుతుంటే వెంటనే వాళ్ళకి కూడా ఈ ఆర్టికల్ షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది.
📌CRPF Constable Tradesman Recruitment 2026 Recruitment Overview :-
ఈ టేబుల్ ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఒకేసారి ఈజీగా అర్థం అయిపోతాయి ఫ్రెండ్స్.
| వివరాలు (Details) | సమాచారం (Information) |
| Organization | Central Reserve Police Force (CRPF) |
| Post Name | Constable (Technical & Tradesman) |
| Total Vacancies | 9195 Posts |
| Qualification | 10th Class , ITI |
| Salary (జీతం) | Rs. 21,700 Rs. 69,100 (Pay Level3) |
| Apply Starting Date | 20 April 2026 |
| Last Date | 19 May 2026 |
| Job Location | All Over India |
| Apply Mode | Online |
| Official Website | rect.crpf.gov.in |
🎓 Education Qualification & Age Limit (అర్హతలు) :-
CRPF Constable Tradesman Recruitment 2026 పోస్టులకి అప్లై చేయాలంటే పెద్ద పెద్ద డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు, బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది
విద్యా అర్హతలు కనీసం 10th క్లాస్ (Matriculation) పాస్ అయి ఉండాలి. మెకానిక్ మోటార్ వెహికల్ లాంటి కొన్ని టెక్నికల్ పోస్టులకి సంబంధిత ట్రేడ్లో ITI సర్టిఫికెట్ అడుగుతారు. డ్రైవర్ పోస్టులకి అప్లై చేసే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ (HMV) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
CRPF Constable Tradesman Recruitment 2026 వయో పరిమితి (Age Limit) :-
కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకి 21 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
మిగతా అన్ని ట్రేడ్స్ (కోబ్లర్, కార్పెంటర్, టైలర్, కుక్ మొదలైనవి) కి 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి.
ఏజ్ రిలాక్సేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయ్. SC/ST కాండిడేట్స్ కి 5 ఏళ్లు, OBC కాండిడేట్స్ కి 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది.
💰 Salary Details (జీతం వివరాలు) :-
CRPF Constable Tradesman Recruitment 2026 శాలరీ డీటెయిల్స్ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి.
ఎంపికైన అభ్యర్థులకు 7th Pay Commission ప్రకారం Pay Level3 లో కళ్లు చెదిరే జీతం ఉంటుంది.
బేసిక్ పే నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఉంటుంది.
ఇది మాత్రమే కాకుండా డియర్నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లాంటి ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి.
అన్నీ కలుపుకుని స్టార్టింగ్ లోనే చేతికి నెలకు దాదాపు రూ. 30,000 పైనే వస్తుంది.
📝 Selection Process (ఎంపిక విధానం ఎలా ఉంటుంది?) :-
CRPF Constable Tradesman Recruitment 2026 రిక్రూట్మెంట్ లో సెలెక్షన్ ప్రాసెస్ చాలా గట్టిగా జరుగుతుంది. కానీ అస్సలు టెన్షన్ పడకండి, మొత్తం 5 స్టేజెస్ లో ఈ ప్రాసెస్ ఉంటుంది.
- Computer Based Test (CBT) ముందుగా ఆన్లైన్ లో ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష ఉంటుంది.
- Physical Standard Test (PST) & Physical Efficiency Test (PET) ఇందులో మీ హైట్, చెస్ట్ కొలతలు చెక్ చేస్తారు మరియు రన్నింగ్ లాంటి ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు.
- Trade Test (ట్రేడ్ టెస్ట్) మీరు ఏ ట్రేడ్ (ఉదాహరణకు కుక్, డ్రైవర్, కార్పెంటర్) కి అప్లై చేశారో, ఆ పనిలో మీకు ఎంత స్కిల్ ఉందో ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి చెక్ చేస్తారు.
- Document Verification మీ సర్టిఫికెట్స్ అన్నీ ఒరిజినల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు.
- Detailed Medical Examination (DME) ఫైనల్ గా మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ చేసి, ఫిట్ గా ఉన్నవాళ్ళ మాత్రమే జాబ్ కి సెలెక్ట్ అవుతారు.
📚 Detailed Syllabus (సిలబస్ వివరాలు) :-
CRPF Constable Tradesman Recruitment 2026 జాబ్ కి CBT ఎగ్జామ్ లో మంచి మార్కులు స్కోర్ చేయాలంటే ముందుగా సిలబస్ ఏంటో అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి. పరీక్షలో ఈ క్రింది సబ్జెక్ట్స్ నుంచి 100 ప్రశ్నలు వస్తాయ్.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (General Intelligence and Reasoning).
జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ (General Knowledge and General Awareness)
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (Elementary Mathematics)
బేసిక్ ఇంగ్లీష్ లేదా హిందీ (English Hindi)
📄 Official Notification PDF :- Click Here
✍️ Apply Online Link :- Click Here
🌐 Official Website :- Click Here
👉 మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కట్ ఆఫ్ మార్క్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp Channel & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
Join Our WhatsApp Channel :- Whatsapp Channel
Join Our Telegram Channel :-Telegram Channel
❓ FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు) :-
1. ఏప్రిల్ 20 నే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందా మామా?
అవును ఫ్రెండ్స్, ఏప్రిల్ 20 నుంచి అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అవుతుంది. నా పర్సనల్ అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ రెండు మూడు రోజుల్లోనే అప్లై చేసేయండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే కచ్చితంగా సర్వర్ ఇష్యూస్ వస్తాయి.
2. CRPF Constable Tradesman Recruitment 2026 జాబ్స్ కి ఆడవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చా?
అవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా! ఇందులో మేల్ అండ్ ఫీమేల్ కాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకునే పోస్టులు ఉన్నాయి. ఫీమేల్ కాండిడేట్స్ కి సపరేట్ గా ఖాళీలు రిజర్వ్ చేయబడి ఉంటాయి
3. ఎగ్జామ్ తెలుగులో రాసుకోవచ్చా?
లేదబ్బా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT) పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం కొంచెం ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయాల్సిందే.





