mama మనం ఈ రోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) రిలీజ్ చేసిన Union Bank of India Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం రండి. Hello friends, అందరూ ఎలా ఉన్నారు? మీ కోసం ఒక సూపర్ జాబ్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను mama. ఎవరైతే బ్యాంక్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పచు. ఆంధ్రా (AP), మరియు తెలంగాణ (TG) వాళ్ళు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు! మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వేకెన్సీ ఉన్నాయి, కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ ఆర్టికల్ ని చదివి అప్లై చేసుకోండి.
డిగ్రీ పూర్తి చేసి బ్యాంకింగ్ కెరీర్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఛాన్స్ మామ. దేశవ్యాప్తంగా మొత్తం 1865 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ వన్-ఇయర్ అప్రెంటిస్ షిప్ తో మీకు మంచి ట్రైనింగ్, బ్యాంకింగ్ ఆపరేషన్స్ మీద మంచి అవగాహన మరియు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఈ అవకాశం మాత్రం అస్సలు మిస్ అవ్వదు, ఎందుకంటే ఫ్యూచర్ లో బ్యాంకింగ్ సెక్టార్ లో పర్మినెంట్ జాబ్స్ కొట్టడానికి ఈ సర్టిఫికెట్ చాలా మంచి ఉపయోగపడుతుంది.దయచేసి ఈ ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడచ్చు.
Recruitment Overview (సంక్షిప్త వివరాలు) :-
| అంశం | వివరాలు |
| Organization | Union Bank of India (UBI) |
| Post Name | Apprentice |
| Total Vacancies | 1865 |
| Qualification | Degree (Graduation) |
| Job Location | All Over India (AP & TG తో సహా) |
| Apply Mode | Online |
| Last Date | 19th May 2026 |
| Official Website | unionbankofindia.co.in |
Education (విద్యార్హతలు) :-
Union Bank of India Apprentice Recruitment పోస్టులకు అప్లై చేయడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ వివరాలు కింద క్లియర్ గా ఇచ్చా చెక్ చేసుకోండి.
- Education: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (Graduation) కంప్లీట్ చేసి ఉండాలి. (ముఖ్య గమనిక: 01 ఏప్రిల్ 2022 లేదా ఆ తర్వాత డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు).
Age Limit (వయోపరిమితి) :-
- Age Limit: Union Bank of India Apprentice Recruitment అభ్యర్థులు వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి (01/04/2026 నాటికి లెక్కలోకి తీసుకుంటారు).
- Age Relaxation: SC/ST వాళ్లకి 5 ఏళ్లు, OBC వాళ్లకి 3 ఏళ్లు మరియు PwBD కాండిడేట్స్ కి 10 ఏళ్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
Salary Details (జీతం వివరాలు) :-
Union Bank of India Apprentice Recruitment జీతం విషయంలో చాలా మందికి డౌట్ ఉంటుంది కదా! మామ అప్రెంటిస్ పీరియడ్ (1 సంవత్సరం) లో మీకు ప్రతి నెలా ఫిక్స్డ్ స్టైపెండ్ పే చేస్తారు. మీకు జాబ్ వచ్చే లొకేషన్ ని బట్టి ఈ అమౌంట్ మారుతుంది, కింద ఇచ్చాను ఒకసారి డీటెయిల్ గా చెక్ చేసుకోండి:
- Rural/Semi-Urban బ్రాంచెస్: నెలకు ₹15,000/- వరకు స్టైపెండ్ వస్తుంది. పల్లెటూరు లేదా చిన్న పట్టణాల్లోని బ్యాంకుల్లో మీకు పోస్టింగ్ వస్తే మాత్రం ఈ జీతం వస్తుంది.
- Urban బ్రాంచెస్: నెలకు ₹18,000/- వరకు స్టైపెండ్ వస్తుంది. కాస్త పెద్ద నగరాలు, టౌన్స్ లో పోస్టింగ్ వస్తే ఈ అమౌంట్ మీ అకౌంట్లో పే చేస్తారు.
- Metro బ్రాంచెస్: నెలకు ₹20,000/- వరకు స్టైపెండ్ వస్తుంది. హైదరాబాద్ లాంటి పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ లో పోస్టింగ్ వస్తే మీకు ఈ హైయెస్ట్ స్టైపెండ్ పే చేస్తారు.
- NOTE: దీంతో పాటు బ్యాంకు పని దినాల్లో మిగతా స్టాఫ్ కి ఉన్నట్లు సాధారణ సెలవులు కూడా మీకు ఉంటాయి. కానీ PF, HRA లాంటి అదనపు అలవెన్సులు ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టులకు వర్తించవు అన్న విషయం మర్చిపోకండి ఫ్రెండ్స్.
Selection Process (ఎంపిక విధానం) :-
Union Bank of India Apprentice Recruitment జాబ్స్ కి కాండిడేట్స్ ని కింద ఇచ్చిన 4 దశల్లో ఎంపిక చేస్తారు:
- Online Written Exam: ముందుగా ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT) రాయాలి. ఈ ఎగ్జామ్ లో వంద మార్కులకు ఉంటుంది. ఈ ఎక్సమ్ లో వచ్చిన మెరిట్ ఆధారంగానే మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్ కి ఎంపిక చేస్తారు.
- Local Language Test: మన తెలుగు రాష్ట్రాలకు అప్లై చేస్తే, మన ప్రాంతీయ భాష (తెలుగు) రాయడం, చదవడం మరియు మాట్లాడటం కచ్చితంగా వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు 10th లేదా 12th క్లాస్ లో తెలుగు ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే మీకు ఈ టెస్ట్ ఉండదు. వేరే రాష్ట్రాల వాళ్ళు మన దగ్గర అప్లై చేస్తే వాళ్లకు మాత్రమే ఈ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది.
- Document Verification: ఎగ్జామ్ మరియు లాంగ్వేజ్ టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు. మీ యొక్క 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఒరిజినల్ మార్క్స్ మెమోలు, ఆధార్ కార్డు, మరియు కుల ధృవీకరణ పత్రాలు అధికారులు చెక్ చేస్తారు.
- Medical Examination: డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే, చివరగా బ్యాంక్ వాళ్ళు చెప్పిన హాస్పిటల్ లో బేసిక్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ చేయించుకోవాలి. అందులో ఫిట్ గా ఉంటే ఇక నేరుగా మీరు జాబ్ లో జాయిన్ అయ్యేపోవచ్చు.
Syllabus (Online Exam) :-
Union Bank of India Apprentice Recruitment జాబ్స్ కి ఆన్లైన్ ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ లో ఉండే సబ్జెక్ట్స్ మరియు వాటి వివరాలు కింద క్లియర్ గా ఇచ్చాను చెక్ చేసుకోండి. (మొత్తం 100 మార్కులకు, 1 గంట సమయం ఉంటుంది):
- General / Financial Awareness (25 Questions – 25 Marks): ఈ సబ్జెక్ట్ లో ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం బేసిక్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఎకానమీ, మరియు స్టాటిక్ జికె నుంచి ప్రశ్నలు ఉంటాయి. రోజు న్యూస్ పేపర్ చదివితే ఈ సెక్షన్ ఈజీగా స్కోర్ చేయవచ్చు.
- General English (25 Questions – 25 Marks): బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, స్పెల్లింగ్ మిస్టేక్స్ గుర్తించడం, మరియు వొకాబులరీ (Synonyms/Antonyms) లాంటి వాటి మీద ఫోకస్ చేయండి.
- Quantitative & Reasoning Aptitude (25 Questions – 25 Marks): మ్యాథ్స్ లో పర్సంటేజెస్, సింప్లిఫికేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్ (DI) ఉంటాయి. రీజనింగ్ లో పజిల్స్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ లాంటి వాటిపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు.
- Computer Knowledge (25 Questions – 25 Marks): కంప్యూటర్ బేసిక్స్, షార్ట్కట్ కీస్, MS Office (Word, Excel), మరియు ఇంటర్నెట్ గురించి సాధారణ ప్రశ్నలు ఉంటాయి.
- గమనిక: ప్రతి తప్పు సమాధానానికి (1/4th) నెగటివ్ మర్క్స్ ఉంటాయ్, కాబట్టి జాగ్రత్తగా తెలిసిన వాటికే మాత్రమే ఆన్సర్ చేయండి మామ.
How to Apply (ఎలా అప్లై చేసుకోవాలి) :-
Union Bank of India Apprentice Recruitment జాబ్స్ కి అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి. కింద స్టెప్స్ ని ఫాలో అయిపోండి:
- ముందుగా భారత ప్రభుత్వానికి చెందిన NATS (National Apprenticeship Training Scheme) పోర్టల్ లో మీ వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకంటూ ఒక ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకోండి.
- ఆ తర్వాత బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ (unionbankofindia.co.in) ఓపెన్ చేయాలి.
- వెబ్సైట్ లోని రిక్రూట్మెంట్ (Recruitment) సెక్షన్ లోకి వెళ్లి ‘Apprentice Recruitment 2026 లో వున్నా Apply Online’ అనే లింక్ మీద క్లిక్ చేయండి.
- తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ తో లాగిన్ అయి, అప్లికేషన్ ఫామ్ ఎటువంటి తప్పులు లేకుండా ఫిల్ చేయండి.
- మీ రీసెంట్ కలర్ ఫోటో, సిగ్నేచర్ మరియు అవసరమైన ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ కరెక్ట్ సైజు లో అప్లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు (General/OBC కి ₹800+GST, SC/ST/PwBD వాళ్లకి ₹200+GST) ఆన్లైన్ లో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు లేదా UPI ద్వారా పే చేసి, అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి.
Mandatory Links :-
Union Bank of India Apprentice Recruitment కింద ఉన్న లింక్స్ యూజ్ చేసి ఫుల్ డీటెయిల్స్ చెక్ చేసుకుని వెంటనే అప్లై చేసుకోండి మామ:
- Official Notification PDF:- Click Here
- Apply Online (BFSI SSC Portal) :- Click Here
- Apply Online(UBI Portal) :- Click Here
- Official Website Link:- Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు) :-
- AP మరియు తెలంగాణ (TG) వాళ్ళు Union Bank of India Apprentice Recruitment జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చా?
అవును mama, కచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు! ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మంచి వేకెన్సీ (TG కి సుమారు 164 పోస్టులు) ఉన్నాయి.కాబట్టి హ్యాపీ గా అప్లై చేసుకోవచ్చు.
- Union Bank of India Apprentice Recruitment జాబ్ పర్మినెంట్ అవుతుందా?
లేదు ఫ్రెండ్స్, ఇది కేవలం 1 సంవత్సరం పాటు ఉండే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే. కానీ ఈ వన్ ఇయర్ అప్రెంటిస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఫ్యూచర్ లో మీరు అప్లై చేసే పర్మినెంట్ బ్యాంక్ లేదా ప్రైవేట్ ఫైనాన్స్ జాబ్స్ కి ఎంతో ప్లస్ అవుతుంది.
- Union Bank of India Apprentice Recruitment ఆన్లైన్ ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా లేదా ఇంగ్లీష్ లో ఉంటుందా?
ఆన్లైన్ రాత పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ రెండు భాషల్లో మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు పక్కాగా ఇంగ్లీష్ మీడియం ఎంచుకుని ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఇంగ్లీష్ బేసిక్స్ తెలిస్తే ఈ ఎక్సమ్ పెద్ద కష్టమేమీ కాదు.





