PNB LBO Recruitment 2026 కోసం ఎదురుచూస్తున్న యువతకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది మామ. హలో ఫ్రెండ్స్,ఎలా ఉన్నారు? మీ అందరూ కోసం బ్యాంకింగ్ సెక్టార్ నుండి అదిరిపోయే నోటిఫికేషన్ తీసుకొచ్చాను మామా. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లో మొత్తం 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు గడువును ఆగస్టు 16, 2026 వరకు పెంచుతూ అధికారికంగా ప్రకటించారు. ఈ న్యూస్ ఇంకా అప్లై చేయని వాళ్లకు ఒక గొప్ప అవకాశం మామ.
డిగ్రీ పాస్ అయ్యే, ఏదైనా బ్యాంకులో ఒక్క సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లు ఈ PNB LBO పోస్టులకు అప్లై చేసుకోవడానికి వంద శాతం అర్హులు. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలకు (తెలంగాణలో 41, ఏపీకి 4) కూడా ఇందులో పోస్టులు కేటాయించారు. అసలు ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ ఏంటి, శాలరీ ఎంత వస్తుంది, సిలబస్ ఏంటి లాంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ పోస్ట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ పోస్ట్ ని చివరి వరకు చదివి, వెంటనే అప్లై చేసుకోండి. అలాగే ఈ పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ యొక్క వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
Recruitment Overview :-
| Organization | Punjab National Bank (PNB) |
| Post Name | Local Bank Officer (LBO) |
| Total Vacancies | 545 Posts |
| Qualification | Any Degree + 1 Year Bank Experience |
| Job Location | AP, Telangana & All India |
| Apply Mode | Online |
| Last Date | 16 August 2026 (Extended) |
| Official Website | pnbindia.in |
Education & Age Limit (విద్యార్హతలు & వయోపరిమితి):-
PNB LBO పోస్టులకి ఆన్‌లైన్ లో అప్లై చేయాలంటే కింది ఇచ్చిన అర్హతలు కచ్చితంగా ఉండాలి మామ:
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ (డిగ్రీ/బీటెక్ ఏదైనా పర్వాలేదు) కంప్లీట్ చేసి ఉండాలి.
- ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజినల్ రూరల్ బ్యాంకులో (RRB) క్లర్క్ లేదా ఆఫీసర్ గా కనీసం 1 సంవత్సరం పాటు పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఇది మాత్రం కచ్చితంగా ఉండాలి.
- మీరు ఏపీ లేదా తెలంగాణ కి అప్లై చేస్తే, తెలుగు భాష చదవడం, రాయడం మరియు మాట్లాడటం రావాలి.
- జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ (OBC) అభ్యర్థులకు 3 ఏళ్లు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
Salary Details (జీతం వివరాలు):-
- బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్ అంటే శాలరీ మామూలుగా ఉండదు మామ.
- PNB LBO పోస్టులకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-I (JMGS-I) కింద పక్కా సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లభిస్తుంది.
- పే స్కేల్ రేంజ్ ₹36,000 తో మొదలై ₹63,840 వరకు పెరుగుతూ వెళుతుంది.
- బేసిక్ పే కి అదనంగా డియర్‌నెస్ అలవెన్స్ (DA), హెచ్‌ఆర్‌ఏ (HRA), సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ (CCA) లాంటివి కలుపుకుంటే చేతికి నెలకు సుమారుగా ₹65,000 కు పైగానే వస్తుంది.
Selection Process (ఎంపిక విధానం):-
PNB LBO పోస్టుల కి సెలక్షన్ ప్రాసెస్ చాలా పారదర్శకంగా జరుగుతుంది,వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కింద ఇచ్చాను చెక్ చేసుకోండి:
- ముందుగా దేశవ్యాప్తంగా కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ రాత పరీక్ష పెడతారు. ఇందులో ఆబ్జెక్టివ్ తో పాటు డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది.
- రాత పరీక్షలో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి 50 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
- ఇంటర్వ్యూ కూడా పాస్ అయితే, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ వెరిఫై చేస్తారు (డాక్యుమెంట్ వెరిఫికేషన్).
- చివరగా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (LLPT) ఉంటుంది. మీరు 10వ లేదా 12వ తరగతిలో తెలుగు ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే మీకు ఈ టెస్ట్ మీకు ఉండదు.
Exam Syllabus (పరీక్షా సిలబస్) :-
PNB LBO పోస్టుల కి సంబంధించి ఆన్‌లైన్ ఎగ్జామ్ కోసం సిలబస్ ప్యాట్రన్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి:
- రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (45 ప్రశ్నలు, 60 మార్కులు).
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ (35 ప్రశ్నలు, 40 మార్కులు).
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 ప్రశ్నలు, 60 మార్కులు).
- జనరల్ / బ్యాంకింగ్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు, 40 మార్కులు).
- డిస్క్రిప్టివ్ పేపర్ (ఇంగ్లీష్ లో ఒక లెటర్ మరియు ఎస్సే రాయాలి).
How to Apply (ఎలా అప్లై చేసుకోవాలి):-
- ఫస్ట్ మీరు PNB అఫీషియల్ వెబ్‌సైట్ pnbindia.in ఓపెన్ చేయండి.
- తర్వాత పైన మెనూ లో ఉన్న “Recruitments” ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- అక్కడ “Local Bank Officers 2026 Apply Online” అనే లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే IBPS పోర్టల్ ఓపెన్ అవుతుంది.
- అక్కడ వున్నా “Click Here for New Registration” బటన్ మీద నొక్కి, మీ బేసిక్ డీటెయిల్స్ తో రిజిస్టర్ అవ్వండి.
- ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ తప్పులు లేకుండా ఫిల్ చేసి, ఫోటో, సిగ్నేచర్, మరియు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్ జాగ్రత్తగా అప్‌లోడ్ చేయండి.
- చివరిగా అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ లో పే చేసి సబ్మిట్ కొట్టేయండి. చివర్లో అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవడం మారిపోవద్దు మామ.
Mandatory Links (ముఖ్యమైన లింక్స్):-
- Official Notification PDF: Click Here
- Extended Notification PDF: Click Here
- Apply Online Link: Click Here
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
FAQs (పదే పదే అడిగే ప్రశ్నలు):-
1. PNB LBO అప్లికేషన్ కి కొత్తగా వచ్చిన లాస్ట్ డేట్ ఎప్పుడు?
ముందుగా ఆగస్టు 9 లాస్ట్ డేట్ అని చెప్పారు, కానీ ఇప్పుడు దాన్ని ఆగష్టు 16, 2026 వరకు పొడిగించారు. కాబట్టి టైమ్ వేస్ట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి.
2.బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ లేని ఫ్రెషర్స్ ఈ PNB LBO పోస్టులకు అప్లై చేసుకోవచ్చా?
లేదు మామ, PNB LBO నోటిఫికేషన్ కు ఫ్రెషర్స్ అర్హులు కారు. కచ్చితంగా ఏదైనా బ్యాంక్ లేదా గ్రామీణ బ్యాంకులో కనీసం 1 సంవత్సరం పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
3.ఏపీ వాళ్ళు తెలంగాణ పోస్టులకు అప్లై చేసుకోవచ్చా?
చేసుకోవచ్చు! తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి వారైనా ఏపీ లేదా తెలంగాణ లో మీకు ఇష్టం వచ్చిన ఒకే ఒక్క రాష్ట్రానికి అప్లై చేసుకోవచ్చు. కానీ తెలుగు భాష మాత్రం కచ్చితంగా వచ్చి ఉండాలి గుర్తుపెట్టుకోండి.





