APMSRB Staff Nurse & Pharmacist Recruitment 2026 | B.Sc Nursing, B.Pharmacy చదివినవారికి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Published On:

APMSRB Staff Nurse

Join WhatsApp

Join Now

APMSRB Staff Nurse & Pharmacist జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఒక అద్భుతమైన అవకాశం మామ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక సూపర్ జాబ్ అప్‌డేట్ ని తీసుకొచ్చాను మామా. మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) నుండి ఈ సారి భారీ స్థాయిలో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ మరియు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ రీలీజ్ అయింది.

సొంత రాష్టంలో అది కూడా మెడికల్ ఫీల్డ్‌లో మంచి జాబ్ కొట్టాలి, సెటిల్ అవ్వాలి అని కలలు కనే వారికి ఈ నోటిఫికేషన్ ఒక మంచి ఛాన్స్ అని చెప్పాలి. ఈ నోటిఫికేషన్ లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 529 ఖాళీలు ఉన్నాయి, సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మామ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్‌లో ఎవరైనా నర్సింగ్, ఫార్మసీ లేదా ఫిజియోథెరపీ చదివిన వాళ్లు ఉంటే వాళ్ళకి వెంటనే ఈ ఆర్టికల్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈ ఆర్టికల్ వాళ్లకు కూడా ఉపయోగపడవచ్చు.

Recruitment Overview :- 

Organization Andhra Pradesh Medical Services Recruitment Board (APMSRB)
Post Name Staff Nurse, Pharmacist, MRW
Total Vacancies 529
Qualification GNM, B.Sc Nursing, D.Pharm, B.Pharm, BPT
Job Location Andhra Pradesh
Apply Mode Online
Last Date 30 June 2026
Official Website apmsrb.ap.gov.in

 

Education( విద్యా అర్హతలు) :- 

మొత్తం 529 APMSRB Staff Nurse & Pharmacist జాబ్స్ రిలీజ్ అయ్యాయి.వాటి వివరాలు కింద ఇచ్చాను చెక్ చేసుకోండి.

  • స్టాఫ్ నర్స్ (419 పోస్టులు): ఈ పోస్టులకు అభ్యర్థులు కచ్చితంగా GNM లేదా B.Sc (Nursing) పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా, ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో విధిగా రిజిస్టర్ అయి ఉండాలి.
  • ఫార్మసిస్ట్ (24 పోస్టులు): ఈ పోస్టులకు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి D.Pharmacy లేదా B.Pharmacy పూర్తి చేసి, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి మామ.
  • మల్టీ-రిహాబిలిటేషన్ వర్కర్ (86 పోస్టులు): బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ (BPT) ఉత్తీర్ణులై ఉండాలి.

Age( వయోపరిమితి) :- 

APMSRB Staff Nurse & Pharmacist పోస్టులకు అప్లై చేయాలంటే కింద ఇచ్చిన age limits కచ్చితంగా ఉండాలి:

  • వయోపరిమితి: APMSRB Staff Nurse & Pharmacist జాబ్స్ కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 42 సంవత్సరాల మధ్య కచ్చితంగా ఉండాలి. రిజర్వేషన్ ఉన్న SC/ST/BC కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

Salary Details (జీతం వివరాలు) :-  

  • APMSRB ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులన్నీ నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిన తీసుకుంటున్నారు. కాబట్టి వీటికి ప్రతి నెలా ఒక ఫిక్స్‌డ్ జీతం (Consolidated Pay) ఉంటుంది.
  • స్టాఫ్ నర్స్ (Staff Nurse): నెలకు ₹27,675/-
  • మల్టీ-రిహాబిలిటేషన్ వర్కర్ (MRW): నెలకు ₹23,494/-
  • ఫార్మసిస్ట్ (Pharmacist): నెలకు ₹23,393/-
  • ఈ కాంట్రాక్టు ఉద్యోగులకు DA, HRA లాంటి అదనపు ప్రయోజనాలు ఉండవు, పైన చెప్పిన ఫిక్స్‌డ్ అమౌంట్ మాత్రమే ఇస్తారు గుర్తుపెట్టుకోండి.
  • ముఖ్య గమనిక: బేసిక్ జీతం చూసి తక్కువని వదిలేయద్దు మామా! రేపు ఎప్పుడైనా గవర్నమెంట్ పర్మినెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ పడినప్పుడు, మీరు ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో చేసిన సర్వీస్‌కి గరిష్టంగా 15 మార్కుల వరకు వెయిటేజ్ (Weightage) కలుపుతారు. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కోసం కచ్చితంగా అప్లై చేసుకోండి.

Selection Process (ఎంపిక విధానం) :- 

APMSRB Staff Nurse & Pharmacist రిక్రూట్మెంట్ లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో ఎలాంటి కాంపిటేటివ్ రాత పరీక్ష ఉండదు ఫ్రెండ్స్!

  1. అకడమిక్ మెరిట్: ముందుగా మీ డిగ్రీ లేదా డిప్లొమా ఎడ్యుకేషన్ లో వచ్చిన మార్కుల ఆధారంగా అత్యధిక వెయిటేజ్ (సుమారు 75%) ఇస్తారు.
  2. పని అనుభవం (Experience): తర్వాత ఇదివరకు ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ విధానంలో, లేదా ముఖ్యంగా కోవిడ్ సమయంలో పని చేసిన అనుభవానికి స్పెషల్ గా మార్కులు కలుపుతారు (గరిష్టంగా 15% వరకు కలవచ్చు గుర్తుపెట్టుకోండి).
  3. సీనియారిటీ: మీ కోర్సు పూర్తయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచింది అనే దాని ఆధారంగా మరో 10% వెయిటేజ్ ఇస్తారు.

Syllabus(సిలబస్) :- 

  • ముందే చెప్పుకున్నట్లు, APMSRB Staff Nurse & Pharmacist నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష (Written Exam) గానీ, ఇంటర్వ్యూ గానీ కండక్ట్ చేయరు.
  • కాబట్టి అభ్యర్థులు కష్టపడి ఎలాంటి సిలబస్ చదవాల్సిన అవసరం లేదు.
  • కేవలం మెరిట్ మరియు ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్లు పర్ఫెక్ట్ గా ఉంటే చాలు, డైరెక్ట్ గా జాబ్ వస్తుంది.

How to Apply(ఎలా అప్లై చేయాలి):-

  • ముందుగా మీ మొబైల్ లేదా సిస్టం లో apmsrb.ap.gov.in అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో మీకు కనిపించే “APMSRB Staff Nurse & Pharmacist Notification 10/2026 – Apply Online” అనే లింక్ పైన క్లిక్ చేయండి.
  • తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ తో వన్-టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేయండి.
  • అవసరమైన అన్ని ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ (మార్క్స్ మెమోలు), క్యాస్ట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మరియు మీ సిగ్నేచర్ ని క్లియర్ గా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
  • చివరగా ఆన్‌లైన్ లో అప్లికేషన్ ఫీజు పే చేసి, ఆ ఫామ్ ని ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోకండి.

Mandatory Links:-

 

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

 

FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు) :-

Q1. APMSRB Staff Nurse & Pharmacist ఉద్యోగాలకు రాత పరీక్ష ఉంటుందా?

ఉండదు మామా, ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు. కేవలం మీ చదువులో వచ్చిన మార్కులు, అకడమిక్ మెరిట్ మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా మాత్రమే ఫైనల్ లిస్ట్ తీసి సెలెక్ట్ చేస్తారు.

Q2. APMSRB Staff Nurse & Pharmacist ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ ఎప్పుడు?

ఈ జాబ్స్ కి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి 30 జూన్ 2026 అనేది లాస్ట్ డేట్. సర్వర్ ప్రాబ్లమ్స్ రాకముందే, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోవడం మంచిది.

Q3.APMSRB Staff Nurse & Pharmacist ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కదా, అప్లై చేయడం కరెక్టేనా?

ప్రస్తుతానికి ఇవి NHM కింద కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినప్పటికీ, కచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే నేను పైన చెప్పినట్టు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసిన ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ రేపు ఫ్యూచర్ లో పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్ పడినప్పుడు మీకు వెయిటేజ్ రూపంలో చాలా పెద్ద ప్లస్ అవుతుంది. మిస్ చేసుకోకండి అర్ధం అయ్యిందా మామ.

🔴Related Post

Leave a Comment