Bank Of Baroda Sports Quota Recruitment 2026 | Any Degree| Apply Online Now!

By Quick Job Updates

Updated On:

Bank of Baroda

Join WhatsApp

Join Now

Bank of Baroda (BOB) sports quota నుంచి 30 Clerk (Customer Service Associate) పోస్టులకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రీల్స్ అయింది. బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా స్పోర్ట్స్ ఎక్కువగా ఆడే వాళ్ళకి ఒక సూపర్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ జాబ్స్ ఎటువంటి రాత పరీక్ష (Written Exam) ఉండదు కాబట్టి, స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి అవకాశం మామ.ఈ జాబ్స్ ని అస్సలు మిస్ అవ్వదు.ఈ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు అని కంప్లీట్ డీటెయిల్స్ కింద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా స్పోర్ట్స్ లో మంచి సర్టిఫికెట్స్ ఉండి  స్పోర్ట్స్ కోట లో జాబ్ కోసం చూస్తుంటే వెంటనే ఈ ఆర్టికల్ ని వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి మామ.

📌 Recruitment Overview (సంక్షిప్త వివరాలు) :- 

అంశం  వివరాలు
Organization Bank of Baroda (BOB)
Post Name Customer Service Associate (Clerk) – Sports Quota
Total Vacancies 30 Posts (24 Male, 6 Female)
Qualification Any Degree + Sports Certificate
Job Location Delhi, Mumbai, Chennai
Apply Mode Online (ఆన్లైన్ విధానం)
Last Date 12 May 2026
Official Website bankofbaroda.in

🎓 Education Qualification & Age Limit (అర్హతలు) :- 

Bank of Baroda (BOB) sports quota క్లర్క్ జాబ్స్ కి అప్లై చేయడానికి కావలసిన అర్హతలు కింద ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం డిగ్రీ (Graduation in any discipline) పాస్ అయ్యి ఉండాలి.

  • స్పోర్ట్స్ అర్హత: క్రికెట్ (Cricket), కబడ్డీ (Kabaddi), టేబుల్ టెన్నిస్ (Table Tennis) లేదా ఫుట్ బాల్ (Football) క్రీడల్లో రాష్ట్ లేదా జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి (State/National/International/University level) లో ఆడిన అఫీషియల్ సర్టిఫికెట్ కచ్చితంగా కలిగి ఉండాలి.
  • వయోపరిమితి (Age Limit): అభ్యర్థుల యొక్క గరిష్ట వయసు 28 ఏళ్లు దాటకూడదు(20 to 28 Years). ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్పోర్ట్స్ పర్సన్స్ కి, OBC వాళ్ళకి 3 ఏళ్లు, SC/ST వాళ్ళకి 5 ఏళ్లు ఏజ్ రిలాక్సేషన్ వుంది.

💰 జీతం వివరాలు (Salary Details) :- 

  • Bank of Baroda (BOB) sports quota జాబ్స్ కి సెలెక్ట్ అయిన కాండిడేట్స్ కి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి బేసిక్ పే ₹24,050 rs తో స్టార్ట్ అవుతుంది.
  • మొత్తం పే స్కేల్  చూసుకొంటే ₹24,050 – ₹64,480 వరకు ఉంటుంది.
  • దీనికి తోడు DA, HRA, మెడికల్ మరియు ఇతర బ్యాంక్ అలవెన్సులు అన్నీ కలుపుకుని, ప్రతి నెలా చేతికి సూపర్ శాలరీ వస్తుంది మామ. ఈ జాబ్ ప్రారంభంలో 6 నెలల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.

📚 సిలబస్ వివరాలు (Syllabus & Field Trials) :- 

ముందుగా చెప్పుకున్నట్లు ఈ Bank of Baroda (BOB) sports quota జాబ్స్ కి  ఎలాంటి రాత పరీక్ష (No Written Exam) ఉండదు. కాబట్టి పుస్తకాలు చదవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ, మిమ్మల్ని ఈ జాబ్ సెలెక్ట్ చేసుకోవడం కోసం గ్రౌండ్ లో కింది ఇచ్చిన  విషయాలపై టెస్ట్ ఉంటాయ్.

📝 ఎంపిక విధానం ఎలా ఉంటుంది? (Selection Process):-

Bank of Baroda (BOB) sports quota కి సంబంధించినవి కాబట్టి ఈ జాబ్స్ ఎలాంటి రాత పరీక్షా ఉండదు. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ గా మూడు స్టెప్స్ లో ఉంటుంది

  • క్రీడా నైపుణ్యాలు (Game Skills): మీరు ఏ గేమ్ (Cricket, Kabaddi, Table Tennis లేదా Football) కి అప్లై చేశారో, ఆ ఆటలో మీ టెక్నిక్, స్టామినా మరియు పర్ఫార్మెన్స్ ని ఫీల్డ్ ట్రయల్స్ లో డైరెక్ట్ గా టెస్ట్ చేస్తారు.
  • ఫిజికల్ ఫిట్నెస్ (Physical Fitness): స్పోర్ట్స్ పర్సన్ కి ఫిట్నెస్ చాలా ముఖ్యం కాబట్టి, గ్రౌండ్ లో మీ చురుకుదనం(Agility) మరియు బేసిక్ ఫిట్నెస్ లెవెల్స్ ని చెక్ చేస్తారు.
  • స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ వెయిటేజీ (Achievements Weightage): మీరు గేమ్స్ ఆడిన లెవెల్స్ ని బట్టి మార్క్స్ ఇస్తారు. (ఉదాహరణకి ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళకి ఒక మర్క్స్, నేషనల్/స్టేట్ ఆడిన వాళ్ళకి ఇంకో మర్క్స్ ఇస్తారు).
  • పర్సనాలిటీ అసెస్మెంట్ (Interview/Interaction):ఇది ముఖ్యమైన స్టెప్ మామ మీరు బ్యాంక్ లో కస్టమర్స్ తో ఎలా మాట్లాడతారు అనే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు మీ కాన్ఫిడెన్స్ ని చెక్ చేయడానికి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది.

కాబట్టి మామ, పుస్తకాలు చదవడం పక్కనపెట్టి, గ్రౌండ్ కి వెళ్లి మీ గేమ్ ఫై పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి.

💻 ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply Online):-

Bank of Baroda (BOB) sports quota పోస్టులకు అప్లై చేసుకోవడానికి మే 12 2026 వరకు అవకాశం వుంది. ఆ లోపు ఈ స్టెప్స్ ఫాలో అయిపోయి ఫాస్ట్ గా అప్లై చేసుకోండి.

  1. ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ముందుగా Bank of Baroda యొక్క అఫీషియల్ వెబ్సైట్ (bankofbaroda.in)ని  ఓపెన్ చేయండి.
  2. తర్వాత హోమ్ పేజీలో ‘Careers’ లేదా ‘Current Openings’ అనే సెక్షన్ లోకి వెళ్ళండి.
  3. అక్కడ “Recruitment of Meritorious Sportspersons 2026” కి సంబంధించిన లింక్ ఉంటుంది దాని  మీద క్లిక్ చేయండి.
  4. కొత్తగా అప్లై చేసిన వాళ్ళు అయితే మీ బేసిక్ డీటెయిల్స్ తో ‘New Registration’ చేసుకోండి.
  5. ఆ తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి మీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ లెవెల్ వివరాలు కరెక్ట్ గా ఫిల్ చేయండి.
  6. చివరిగా పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, మరియు మీ స్పోర్ట్స్ అచీవ్మెంట్ సర్టిఫికెట్స్ ని స్కాన్ చేసి కరెక్ట్ గా అప్లోడ్ చేయండి.
  7. ఆన్లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించి, 12 May 2026 కంటే ముందే సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోకండి.

📄 Official Notification PDF:- Click Here

✍️ Apply Online Link:- Click Here

🌐 Official Website:- Click Here

❓ FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు) :- 

Q1: Bank of Baroda (BOB) sports quota  జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా?

A: అవును మామ అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ ఆల్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ నోటిఫికేషన్. కాకపోతే పోస్టింగ్స్ మాత్రం ఢిల్లీ, ముంబై, చెన్నై లో మాత్రమే ఉంటాయి. మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటే ఇండియా లో ఎక్కడినుండైనా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

Q2: Bank of Baroda (BOB) sports quota రిక్రూట్మెంట్ లో రాత పరీక్ష (Written Exam) ఉందా?

A: లేదు ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ కి ఎలాంటి రాత పరీక్షఅయితే  ఉండదు. కానీ మీ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, తర్వాత ఫీల్డ్ ట్రయల్స్ (Field Trials) ద్వారా ఎంపిక చేస్తారు.

Q3: Bank of Baroda (BOB) sports quota జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?

A: ఈ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 12 మే 2026. సో అస్సలు లేట్ చేయకండి. మామ అల్ ది బెస్ట్ .

🔴Related Post

Leave a Comment