తెలంగాణలో నుండి అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు Telangana Anganwadi Recruitment 2026 ద్వారా తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ సొంత ఊర్లోనే, ఎటువంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ప్రభుత్వ జాబ్ కొట్టే ఛాన్స్ ఈ నోటిఫికేషన్. Telangana Anganwadi నోటిఫికేషన్ ని మాత్రం మిస్ అవ్వొద్దు, ఎందుకంటే చాలా మంది సరైన సమాచారం లేక ఇలాంటి మంచి ఉద్యోగాలకు అప్లై చేయరు. కేవలం 10వ తరగతి పాస్ అయిన మహిళలు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి అర్హులు. మీ గ్రామ పంచాయతీలో ఖాళీ ఉంటే చాలు, ఈ జాబ్ దాదాపుగా మీకు వచ్చినట్లే.
ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్… ఈ పోస్ట్ చదువుతున్న ప్రతి ఒక్కరు దయచేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో, మీ బంధువుల్లో వున్నా మహిళలకు ఈ పోస్ట్ ను తప్పకుండా షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల ఎవరిదో ఒకరి లైఫ్ సెటిల్ అయ్యే అవకాశంఉంటుంది, కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి.
Recruitment Overview :-
| Organization | తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ (WDCW) |
| Post Name | అంగన్‌వాడీ టీచర్, మినీ టీచర్, హెల్పర్ |
| Total Vacancies | జిల్లాల వారీగా భర్తీ |
| Qualification | 10వ తరగతి (SSC Pass) |
| Job Location | తెలంగాణ (మీ సొంత ఊరు) |
| Apply Mode | ఆన్‌లైన్ |
| Last Date | 15 ఆగస్టు 2026 నుంచి 22 ఆగస్టు 2026 వరకు (జిల్లాల వారీగా) |
| Official Website | mis.tgwdcw.in |
జిల్లాల వారీగా ఖాళీలు & దరఖాస్తు తేదీలు :-
ప్రస్తుతం ఆన్‌లైన్ అప్లికేషన్లు నడుస్తున్న జిల్లాల వివరాలు, ఖాళీలు, తేదీలు మీకోసం ఒకే టేబుల్ లో రూపంలో ఇచ్చాను చెక్ చేస్కోండి:
| జిల్లా పేరు | అంచనా ఖాళీలు | దరఖాస్తు ప్రారంభ తేదీ | చివరి తేదీ (Last Date) |
| హైదరాబాద్ | 250+ | 05 ఆగస్టు 2026 | 22 ఆగస్టు 2026 |
| జగిత్యాల | 120+ | 06 ఆగస్టు 2026 | 21 ఆగస్టు 2026 |
| కరీంనగర్ | 180+ | 01 ఆగస్టు 2026 | 15 ఆగస్టు 2026 |
| సిద్దిపేట | 150+ | 01 ఆగస్టు 2026 | 15 ఆగస్టు 2026 |
(నోట్: ఇప్పటికే ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల గడువు ముగిసింది. మిగిలిన జిల్లాల వివరాలు త్వరలో విడుదల చేస్తారు.)
Education & Age :-
Telangana Anganwadi ఉద్యోగాలకు అర్హతలు పట్ల చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా, అందుకే ఇక్కడ పూర్తి డీటెయిల్స్ క్లియర్ గా రాసాను చెక్ చేసుకోండి:
- కచ్చితంగా 10వ తరగతి (SSC) పాస్ అయ్యే ఉండాలి.
- అప్లై చేసే మహిళలు వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు కనీస వయసు 21 ఏళ్లు ఉన్న అప్లై చేసుకోవచ్చు.
- స్థానికత: ఏ అంగన్‌వాడీ సెంటర్ కి అప్లై చేస్తున్నారో, కచ్చితంగా ఆ గ్రామ పంచాయతీ లేదా వార్డుకు చెందిన స్థానిక మహిళలు అయితే మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- Telangana Anganwadi ఉద్యోగాలకు వివాహిత మహిళలకు (Married Women) మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వితంతువులు, అనాథలకు ప్రత్యేక రిజర్వేషన్ కూడా ఉంటుంది.
Salary Details(జీతం వివరాలు) :-
Telangana Anganwadi పోస్టులకు ఎంపికైన వారికి ప్రభుత్వం గౌరవ వేతనం రూపంలో ప్రతి నెలా మంచి జీతం ఇస్తుంది:
- మెయిన్ అంగన్‌వాడీ టీచర్ కు : నెలకు సుమారుగా ₹13,650/- పే చేస్తారు.
- మినీ అంగన్‌వాడీ టీచర్ కు: నెలకు ₹7,800/- వరకు.
- అంగన్‌వాడీ హెల్పర్ (ఆయా)కు : నెలకు ₹7,800/- వరకు.
- భవిష్యత్తులో ప్రభుత్వ నిర్ణయాలను బట్టి ఈ జీతాలు ఇంకా పెరిగే అవకాశం ఉండచ్చు.
Selection Process(ఎంపిక విధానం) :-
Telangana Anganwadi పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో ఎటువంటి తేడాలు ఉండవు, అంతా పారదర్శకంగా జరుగుతుంది:
- ముందుగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన అప్లికేషన్లను అధికారులు పరిశీలిస్తారు.
- తర్వాత మీ 10వ తరగతిలో వచ్చిన మార్కుల శాతాన్ని ఆధారం చేసుకుని ఆటోమేటిక్ గా మెరిట్ లిస్ట్ ఇస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు కలెక్టర్ ఆఫీస్ లేదా RDO ఆఫీస్ లో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు.
- అన్ని ధృవీకరణ పత్రాలు కరెక్ట్ గా ఉంటే, ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ద్వారా నేరుగా జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తారు.
Syllabus(సిలబస్) :-
- Telangana Anganwadi ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష (No Written Exam) లేదా ఇంటర్వ్యూలు ఉండవు.
- కాబట్టి మీరు ఎలాంటి సిలబస్ చదవాల్సిన పని లేదు, ఏ బుక్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు.
- కేవలం మీ 10వ తరగతి మార్కులు, కుల ధృవీకరణ, మరియు స్థానికత ఆధారంగా మాత్రమే జాబ్ ఇస్తారు.
How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి) :-
Telangana Anganwadi ఉద్యోగాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లై చేయడం చాలా ఈజీ, మీ మొబైల్ లేదా దగ్గర్లోని ఇంటర్నెట్ సెంటర్ లో కింద ఇచిన స్టెప్స్ ఆధారంగా అప్లై చేసుకోండి:
- ముందుగా WDCW అఫీషియల్ వెబ్‌సైట్ mis.tgwdcw.in ని ఓపెన్ చేయండి.
- “Vacancy Details” లో మీ జిల్లాలో, మీ ఊరిలో పోస్టులు ఖాళీగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
- తర్వాత మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, 10th మెమో, క్యాస్ట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు రెడీగా స్కాన్ చేసి పెట్టుకోండి.
- చివరిగా “Apply Online” ఆప్షన్ పై క్లిక్ చేసి, అక్కడ అడిగిన మీ వివరాలు ఏ తప్పులు లేకుండా ఫిల్ చేయండి. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ నొక్కేయండి.
Mandatory Links:-
- JAGITYAL Notification PDF: Click Here
- KARIMNAGAR Notification PDF: Click Here
- SIDDIPET Notification PDF: Click Here
- HYDERABAD Notification PDF: Click Here
- Apply Online Link: Click Here
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు):-
1. Telangana Anganwadi పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది?
లేదు ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఉచితంగా మీ మొబైల్ ద్వారా లేదా నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
2. నేను టెన్త్ క్లాస్ ఓపెన్ స్కూల్ లో పాస్ అయ్యాను,Telangana Anganwadi పోస్టులకు అప్లై చేసుకోవచ్చు?
కచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ గా చదివిన వారితో పాటు ఓపెన్ టెన్త్ (TOSS/NIOS) పాస్ అయిన మహిళలు కూడా ఈ ఉద్యోగాలకు 100% అర్హులే.
3. పక్క ఊరిలో ఉన్న ఖాళీ కి నేను అప్లై చేయొచ్చా?
అస్సలు కుదరదు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ లో ఎక్కడైతే ఖాళీ ఉందో, కచ్చితంగా ఆ వార్డు లేదా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న స్థానిక మహిళలు మాత్రమే ఆ పోస్టులకు అప్లై చేయాలి. వేరే ఊరి వాళ్లకు ఛాన్స్ ఉండదు.





