SBI Clerk (Junior Associate) Recruitment 2026 నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు ఇది నిజంగా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ మామ. Hello friends, ఎలా ఉన్నారు అందరూ? డిగ్రీ అర్హతతో బ్యాంక్ జాబ్ కొట్టాలనే అనుకునేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. SC, ST మరియు OBC కేటగిరీల అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా 1538 బ్యాక్లాగ్ పోస్టులతో జూనియర్ అసోసియేట్ (క్లర్క్) నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు మామ! ఎందుకంటే ఈ జాబ్ కి మంచి జీతం, సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ లాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.
కేవలం ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ లేదా సెమిస్టర్ చదువుతున్న స్టూడెంట్స్ కి కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఈ సారి ప్రిపరేషన్ గట్టిగా ఉంటే ఈ బ్యాంక్ జాబ్ మీదే అవచ్చు. ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ తో కచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి, వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది!
Recruitment Overview:-
| Organization | State Bank of India (SBI) |
| Post Name | Junior Associate (Customer Support & Sales) |
| Total Vacancies | 1538 (Backlog) |
| Qualification | Graduation |
| Job Location | Across India (State-wise) |
| Apply Mode | Online |
| Apply Start Date | 7 August 2026 |
| Last Date | 27 August 2026 |
| Official Website | https://sbi.bank.in/ |
కేటగిరీల వారీగా ఖాళీలు :-
SBI Clerk Recruitment కి సంబంధించి ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో కింద క్లియర్ గా రాసాను చెక్ చేసుకోండి:
| Category | Vacancies |
| ST | 1219 |
| SC | 207 |
| OBC | 112 |
| Total | 1538 |
Education & Age Eligibility :-
SBI Clerk Recruitment కి సంబంధించి ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ డీటెయిల్స్ కింద క్లియర్ గా ఇచ్చాను చెక్ చేసుకోండి:
- విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (B.A, B.Com, B.Sc, B.Tech లాంటివి) పాస్ అయి ఉండాలి.
- ఫైనల్ ఇయర్ వాళ్ళు: డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. కానీ 31 డిసెంబర్ 2026 నాటికి డిగ్రీ కంప్లీట్ అయినట్లు ప్రూఫ్ ఉండాలి.
- వయోపరిమితి: 1 ఏప్రిల్ 2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి (అంటే 2 ఏప్రిల్ 1998 మరియు 1 ఏప్రిల్ 2006 మధ్య పుట్టి ఉండాలి).
- వయో సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
Salary Details(జీతం వివరాలు):-
- బేసిక్ పే: SBI Clerk జాబ్స్ కి ఎంపిక అయిన వారికి బేసిక్ పే ₹26,730 తో స్టార్ట్ అవుతుంది (దీనిలో డిగ్రీ వాళ్లకు వచ్చే రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ కూడా కలిపి ఉంటాయి).
- పే స్కేల్: ₹24,050 నుండి మొదలై ₹64,480 వరకు పే స్కేల్ ఉంటుంది.
- మొత్తం శాలరీ: DA, HRA, ఇతర అలవెన్సులు అన్నీ కలుపుకుని మెట్రో సిటీల్లో నెలకు దాదాపు ₹46,000 వరకు జీతం వస్తుంది. బ్యాంక్ జాబ్స్ లో ప్రమోషన్స్, శాలరీ గ్రోత్ చాలా బాగుంటుంది మామ!
Selection Process(ఎంపిక విధానం):-
SBI Clerk Recruitment కి ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది:
- Preliminary Examination (ప్రిలిమ్స్): ఇది మొదటి దశ. ఆన్లైన్ లో 100 మార్కులకు 1 గంట పాటు ఎగ్జామ్ జరుగుతుంది.
- Main Examination (మెయిన్స్): ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి 200 మార్కులకు 2 గంటల 40 నిమిషాల పాటు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీనిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
- Local Language Proficiency Test (LLPT): మీరు అప్లై చేసిన రాష్ట్ర స్థానిక భాష (ఉదాహరణకు ఏపీ/తెలంగాణ కి తెలుగు) రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. 10వ లేదా 12వ తరగతిలో ఆ భాషను చదివి ఉంటే ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు.
Syllabus Details(సిలబస్ వివరాలు):-
RRB Junior Engineer జాబ్స్ కి సంబంధించిన సిలబస్ ను సేకరించి కింద ఇచ్చాను చెక్ చేసుకోండి:
- ప్రిలిమ్స్ సిలబస్ (100 Marks):
- English Language – 30 Questions
- Numerical Ability – 35 Questions
- Reasoning Ability – 35 Questions
- మెయిన్స్ సిలబస్ (200 Marks):
- General/Financial Awareness – 50 Questions
- General English – 40 Questions
- Quantitative Aptitude – 50 Questions
- Reasoning Ability & Computer Aptitude – 50 Questions (60 Marks)
- నెగెటివ్ మార్కింగ్: రెండు ఎగ్జామ్స్ లోనూ తప్పు సమాధానానికి 1/4 (0.25) మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. సో, తెలియని వాటికి ఆన్సర్ చేయకండి!
How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి):-
- SBI Clerk Recruitment కి అప్లై చేసుకోవడానికి ముందుగా SBI అఫీషియల్ వెబ్సైట్ (https://sbi.bank.in/web/careers) ని ఓపెన్ చేయండి.
- “Current Openings” లో “SBI Clerk 2026 Special Recruitment Drive” వెతికి “Apply Online” పైన క్లిక్ చేయండి.
- తర్వాత “New Registration” పైన క్లిక్ చేసి మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి.
- లాగిన్ అయ్యాక, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి, మీ ఫోటో, సిగ్నేచర్, మరియు అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- చివరగా అప్లికేషన్ ఫీజు (OBC లకు ₹750, SC/ST/PwBD లకు ఫీజు లేదు) పే చేసి, ఫామ్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ ప్రింట్ తీసి జాగ్రత్తగా పెట్టుకోండి.
Mandatory Links:-
- Official Notification PDF: Click Here
- Apply Online Link: Click Here
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి.
FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు):-
1. SBI Clerk బ్యాక్లాగ్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ మరియు లాస్ట్ డేట్స్ ఏంటి?
ఆన్లైన్ లో అప్లై చేయడానికి 7 ఆగస్టు 2026 న ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అప్లై చేయడానికి చివరి తేదీ 27 ఆగస్టు 2026. సర్వర్ బిజీ రాకముందే త్వరగా అప్లై చేసుకోండి మామ.
2. ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఈ SBI Clerk పోస్టులకు ఎలిజిబుల్ అవుతారా?
కచ్చితంగా అవుతారు! డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ లో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 31 డిసెంబర్ 2026 నాటికి మీ రిజల్ట్స్ వచ్చి ఉండాలి గుర్తుపెట్టుకోండి.
3. జనరల్ కేటగిరీ వాళ్లు ఈ SBI Clerk నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చా?
లేదు మామ, ఇది స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్. ఇందులో ఉన్న 1538 ఖాళీలు కేవలం ST, SC, మరియు OBC కేటగిరీల వారి కోసం రిజర్వ్ చేయబడినవి. త్వరలోనే జనరల్ వాళ్ళకి కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ వస్తుంది, అప్పటివరకు వెయిట్ చేయండి!





