Indian Overseas Bank LBO Recruitment 2026 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది నిజంగా పెద్ద న్యూస్ మామ. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనకు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) నుంచి 250 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులకు నోటిఫికేషన్ అయింది. అయితే ఏపీ, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అనే డౌట్ చాలామందికి ఉంది కదా! ఈ జాబ్స్ కేవలం నాలుగు రాష్ట్రాలకు పడ్డాయి కాబట్టి, ఆ రాష్ట్రాల లోకల్ లాంగ్వేజ్ వస్తే మాత్రమే మీకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.మీకు ఆ స్టేట్స్ లాంగ్వేజెస్ వస్తే మాత్రం ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ అవకండి ఎందుకంటే కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉండే నోటిఫికేషన్ ఇది.
Indian Overseas Bank LBO నోటిఫికేషన్ కి సంబంధించి ఈ ఆర్టికల్ లో ఏ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, శాలరీ, అప్లై ప్రాసెస్ లాంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇన్-డెప్త్ గా కవర్ చేశాను. మీ సర్కిల్ లో ఎవరికైనా కన్నడ, తమిళం, మరాఠీ లేదా గుజరాతీ భాషలు చదవడం, రాయడం వస్తే మాత్రం కచ్చితంగా ఈ పోస్ట్ వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి, వాళ్ళకి ఈ నోటిఫికేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది!
Recruitment Overview :-
| Organization | Indian Overseas Bank (IOB) |
| Post Name | Local Bank Officer (LBO) |
| Total Vacancies | 250 |
| Qualification | Any Degree |
| Job Location | Tamil Nadu, Karnataka, Maharashtra, Gujarat |
| Apply Mode | Online |
| Starting Date | 15 August 2026 |
| Last Date | 31 August 2026 |
| Official Website | www.iob.in |
State-wise Vacancies Details :-
మామ,Indian Overseas Bank LBO నోటిఫికేషన్ లో మొత్తం 250 ఖాళీలు ఉన్నాయి అయితే ఏయే ఏయే రాష్ట్రాలకు ఎన్ని పోస్టులు ఇచ్చారు మరియు ఆ రాష్ట్రానికి ఏ భాష వచ్చి ఉండాలో అని కింద టేబుల్ లో క్లియర్ గా రాసాను చెక్ చేసుకోండి:
| రాష్ట్రం పేరు (State) | స్థానిక భాష (Local Language) | ఖాళీలు (Vacancies) |
| తమిళనాడు (Tamil Nadu) | తమిళం (Tamil) | 100 |
| కర్ణాటక (Karnataka) | కన్నడ (Kannada) | 60 |
| మహారాష్ట్ర (Maharashtra) | మరాఠీ (Marathi) | 50 |
| గుజరాత్ (Gujarat) | గుజరాతీ (Gujarati) | 40 |
NOTE:- AP & తెలంగాణ అభ్యర్థులకు ముఖ్య గమనిక
- మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఈ నోటిఫికేషన్ లో ఎలాంటి పోస్టులు కేటాయించలేదు.
- కానీ, పైన చెప్పిన నాలుగు రాష్ట్రాల్లో (తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్) దేనికో ఒకదానికి మీరు కచ్చితంగా అప్లై చేసుకోవచ్చు.
- దానికి ఒకటే కండిషన్: ఆ రాష్ట్రం తాలూకు స్థానిక భాష (అంటే తమిళం, కన్నడ, మరాఠీ లేదా గుజరాతీ) చదవడం, రాయడం, మాట్లాడటం పక్కాగా వచ్చి ఉండాలి.
- ఒకవేళ జాబ్ వస్తే పోస్టింగ్ కూడా మీరు అప్లై చేసిన రాష్ట్రంలోనే ఉంటుంది. లైఫ్ టైం ట్రాన్స్ఫర్ పెట్టుకుని మన ఊరు వచ్చే అవకాశం ఉండదు గుర్తుపెట్టుకోండి.
Education & Age Limit :-
Indian Overseas Bank LBO కి సంబంధించి ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ డీటెయిల్స్ కింద క్లియర్ గా ఇచ్చాను చెక్ చేసుకోండి:
- విద్యార్హతలు (Education): గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతో డిగ్రీ (Graduation) పాస్ అయి ఉండాలి (SC/ST/PwBD వాళ్లకు 55% మార్కులు ఉన్నా సరిపోతుంది). ఫైనల్ ఇయర్ రాస్తున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్, అప్లై చేసే నాటికి మీ రిజల్ట్స్ పక్కాగా వచ్చి ఉండాలి.
- స్థానిక భాష (Local Language): మీరు పైనున్న నాలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్రం యొక్క లోకల్ లాంగ్వేజ్ (ఉదాహరణకు కర్ణాటక కి అప్లై చేస్తే కన్నడ) చదవడం, రాయడం, మాట్లాడటం కచ్చితంగా వచ్చి ఉండాలి. ఒకవేళ 10వ తరగతి లేదా ఇంటర్ లో ఆ భాష చదివి ఉండకపోతే, మెయిన్స్ అయ్యాక వాళ్ళు పెట్టే LPT (Language Proficiency Test) పక్కాగా పాస్ అవ్వాలి.
- వయోపరిమితి (Age Limit): నోటిఫికేషన్ కట్-ఆఫ్ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు ఖచ్చితంగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
- వయో సడలింపు (Age Relaxation): గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST వాళ్లకు 5 ఏళ్లు, OBC (Non-Creamy Layer) అభ్యర్థులకు 3 ఏళ్లు, అలాగే వికలాంగులకు (PwBD) 10 ఏళ్లు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
Salary Details(జీతం వివరాలు):-
- Indian Overseas Bank LBO జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) రేంజ్ లో అదిరిపోయే జీతం ఉంటుంది మామ.
- బేసిక్ పే ₹36,000 తో స్టార్ట్ అయ్యి, స్కేల్-1 ఆఫీసర్ కేడర్ లో ఇంక్రిమెంట్స్ తో కలుపుకుని ₹63,840 వరకు పెరుగుతుంది.
- ఈ బేసిక్ పే కు అదనంగా Dearness Allowance (DA), House Rent Allowance (HRA), City Compensatory Allowance (CCA), మరియు మెడికల్ అలవెన్సులు అన్ని కలుపుకుంటే మీరు డ్యూటీ ఎక్కగానే మొదటి నెల నుంచే చేతికి (In-hand) ₹55,000 నుండి ₹60,000 వరకు శాలరీ అందుతుంది.
- దీంతో పాటు బ్యాంక్ వాళ్ళ లీవ్ ఫేర్ కన్సెషన్ (LFC), పెన్షన్ స్కీమ్ కూడా వర్తిస్తాయి.
Selection Process(ఎంపిక విధానం) :-
ఈ Indian Overseas Bank LBO పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ చాలా పారదర్శకంగా మొత్తం మూడు దశల్లో ఉంటుంది:
- Online Written Examination (ఆన్లైన్ పరీక్ష): ముందుగా ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ పద్ధతిలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతారు. ఇందులో మంచి స్కోర్ సాధించడం చాలా కీలకం.
- Personal Interview (ఇంటర్వ్యూ): ఆన్లైన్ ఎగ్జామ్స్ లో కట్-ఆఫ్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళని 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. మీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా ఇక్కడే జరుగుతుంది.
- Language Proficiency Test – LPT: ఫైనల్ గా మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేశారో ఆ లోకల్ లాంగ్వేజ్ మీద స్కిల్ టెస్ట్ ఉంటుంది. (10th/12th లో ఆ లాంగ్వేజ్ చదివినట్లు మార్క్ షీట్ ఉంటే ఈ టెస్ట్ రాయాల్సిన పనిలేదు).
Syllabus(సిలబస్):-
Indian Overseas Bank LBO ఆన్లైన్ ఎగ్జామ్ కి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ ప్యాట్రన్ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ కింది సెక్షన్స్ ఉంటాయి:
- Reasoning and Computer Aptitude: పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, కోడింగ్-డీకోడింగ్ మరియు బేసిక్ కంప్యూటర్ అవేర్నెస్.
- General/Economy/Banking Awareness: రీసెంట్ కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ స్కీమ్స్, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు.
- English Language: రీడింగ్ కాంప్రహెన్షన్, స్పాటింగ్ ఎర్రర్స్, గ్రామర్ మరియు వొకాబులరీ.
- Data Analysis and Interpretation: డిఐ (DI), పై చార్ట్స్, డేటా సఫిషియెన్సీ లాంటి ప్యూర్ క్వాంట్ మరియు మ్యాథ్స్ టాపిక్స్.
- గమనిక: ఎగ్జామ్ లో 1/4th నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కాబట్టి ఏది పడితే అది గెస్ చేసి ఆన్సర్స్ పెట్టకండి.
How to Apply Online(ఎలా అప్లై చేసుకోవాలి) :-
మామా,Indian Overseas Bank LBO పోస్టులకు అప్లై చేసేటప్పుడు ఎలాంటి తప్పులు జరగకుండా ఈ కింద స్టెప్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వండి:
- ముందుగా అఫీషియల్ వెబ్సైట్ www.iob.in ఓపెన్ చేసి, పైనున్న ‘Careers’ ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
- అక్కడ “Indian Overseas Bank LBO Recruitment 2026” ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి ఇచ్చి “New Registration” చేసుకోండి. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తాయి.
- వాటితో లాగిన్ అయ్యాక, మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ సెంటర్ లాంటివి అన్నీ తప్పులు లేకుండా ఫిల్ చేయండి.
- వాళ్ళు అడిగిన డైమెన్షన్స్ లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం (Signature), ఎడమ చేతి బొటనవేలు ముద్ర (Left Thumb Impression), మరియు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ని అప్లోడ్ చేయాలి.
- చివరగా అప్లికేషన్ ఫీజు జనరల్/OBC అభ్యర్థులు ₹850, SC/ST/PwBD అభ్యర్థులు ₹175 ఆన్లైన్ లో పే చేసి ఫామ్ సబ్మిట్ కొట్టండి. మీ అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు.
Mandatory Links :-
- Official Notification PDF: Click Here
- Apply Online Link: Click Here
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
- Join Our WhatsApp Channel: Click Here
- Join Our Telegram Channel: Click Here
Frequently Asked Questions (FAQs) :-
Q1: Indian Overseas Bank LBO పోస్టులకు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా?
లేదు మామా. ఆన్లైన్ అప్లికేషన్ కి ఇచ్చిన చివరి తేదీ నాటికి మీ డిగ్రీ రిజల్ట్స్ కచ్చితంగా డిక్లేర్ అయి ఉండాలి, చేతిలో సర్టిఫికెట్ ఉండాలి.
Q2: నేను కర్ణాటక కి అప్లై చేసి, ఆన్లైన్ ఎగ్జామ్ మన ఏపీ/తెలంగాణలో రాయొచ్చా?
అవును ఫ్రెండ్స్! ఎగ్జామ్ సెంటర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి సిటీలలో) ఉంటాయి. మీరు ఎగ్జామ్ ఇక్కడే రాయొచ్చు, కానీ సెలెక్ట్ అయితే పోస్టింగ్ మాత్రం కర్ణాటకలోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి.
Q3: Indian Overseas Bank LBO పోస్టులకు సంబంధించి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT) కచ్చితంగా పాస్ అవ్వాలా?
100% పాస్ అవ్వాలి. మీరు ఎగ్జామ్, ఇంటర్వ్యూలో ఎంత టాప్ స్కోర్ తెచ్చుకున్నా సరే, ఒకవేళ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ లో ఫెయిల్ అయితే జాబ్ ఇవ్వరు, రిజెక్ట్ చేస్తారు. అందుకే భాష వస్తేనే అప్లై చేయండి!





