ICF Act Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు మరియు రైల్వేలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది నిజంగా ఒక మంచి అవకాశం మామ. Hello friends… మీరంతా ఎలా ఉన్నారు? మన రైల్వే శాఖకు చెందిన చెన్నైలో వున్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) నుండి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ లాంటి పలు ట్రేడ్లలో 1010 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల కోసం ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. టెన్త్ క్లాస్, ఐటీఐ పాసైన వాళ్లకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా రైల్వే లో జాబ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ మామా.
ICF Act Apprentice నోటిఫికేషన్‌లో ఫ్రెషర్స్ మరియు ఐటీఐ (Ex-ITI) పూర్తి చేసిన అభ్యర్థులకు వేర్వేరుగా పోస్టులు కేటాయించారు. అసలు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏయే ట్రేడ్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయి,ఎంత వయస్సు ఉండాలి, స్టైపెండ్ ఎంత ఉంటుంది లాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చాలా క్లియర్‌గా వివరించాను.ఇలాంటి పోస్ట్లు అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే రైల్వేలో అప్రెంటిస్ చేస్తే భవిష్యత్తులో వచ్చే లెవెల్-1 (గ్రూప్-డి) జాబ్స్‌లోకు 20% రిజర్వేషన్ పక్కాగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్‌లో షేర్ చేయడం మర్చిపోకండి.
Recruitment Overview:-
| Organization | Integral Coach Factory (ICF), Chennai |
| Post Name | Act Apprentice (Freshers & Ex-ITI) |
| Total Vacancies | 1,010 Posts |
| Qualification | 10th Pass / 12th Pass / ITI |
| Job Location | Chennai, Tamil Nadu |
| Apply Mode | Online |
| Apply Start Date | 07 August 2026 |
| Last Date | 07 September 2026 |
| Official Website | pb.icf.gov.in |
Vacancy Details (పోస్టుల వివరాలు):-
ICF Act Apprentice నోటిఫికేషన్ కి సంబంధించి ఏయే ట్రేడ్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అని కింద టేబుల్‌లో చాలా క్లియర్‌గా ఇచ్చాను చూసుకోండి ఒకసారి:
| Trade Name | Freshers (ఖాళీలు) | Ex-ITI (ఖాళీలు) | Total Posts |
| Fitter (ఫిట్టర్) | 80 | 230 | 310 |
| Electrician (ఎలక్ట్రీషియన్) | 40 | 120 | 160 |
| Welder (వెల్డర్) | 70 | 190 | 260 |
| Machinist (మెషినిస్ట్) | 40 | 60 | 100 |
| Carpenter (కార్పెంటర్) | 40 | 40 | 80 |
| Painter (పెయింటర్) | 40 | 40 | 80 |
| MLT (పాథాలజీ/రేడియాలజీ) | 20 | 0 | 20 |
| Total (మొత్తం) | 330 | 680 | 1010 |
Education & Age Limit:-
ICF Act Apprentice పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధించిన అర్హతలు మరియు వయస్సు యొక్క పూర్తి డీటెయిల్స్ కింద క్లియర్ గా ఇచ్చాను చూసుకోండి:
- Freshers (నాన్-ఐటీఐ): కనీసం 50% మార్కులతో 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. (సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉంటే మంచిది). MLT పోస్టులకు అప్లై చేయాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో ఇంటర్ (12th) పాస్ అవ్వాలి.
- Ex-ITI Candidates: 50% మార్కులతో 10వ తరగతి పాస్ అవ్వడంతో పాటు, మీరు అప్లై చేస్తున్న సంబంధిత ట్రేడ్‌లో NCVT లేదా SCVT గుర్తింపు పొందిన ITI సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి.
- Age Limit: అభ్యర్థుల వయస్సు 07 సెప్టెంబర్ 2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. (ఫ్రెషర్స్‌కి గరిష్ట వయస్సు 22 ఏళ్లు మాత్రమే).
- Age Relaxation: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు మరియు వికలాంగులకు (PwBD) 10 ఏళ్లు వయో సడలింపు వర్తిస్తుంది.
Salary (Stipend) Details:-
ICF Act Apprentice పోస్టులు పర్మనెంట్ జాబ్స్ కాదు కాబట్టి రెగ్యులర్ శాలరీ రాదు, కానీ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు ప్రతి నెలా మంచి స్టైపెండ్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ క్లియర్ గా కింద ఇచ్చాను:
- Freshers (10th Pass): టెన్త్ క్లాస్ అర్హతతో అప్రెంటిస్‌గా జాయిన్ అయ్యే ఫ్రెషర్స్‌కి నెలకు ₹6,000 చొప్పున స్టైపెండ్ లభిస్తుంది.
- Freshers (12th Pass): ఇంటర్మీడియట్ అర్హతతో జాయిన్ అయ్యే వారికి (MLT లాంటివి) నెలకు ₹7,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.
- Ex-ITI Candidates: ఐటీఐ పూర్తి చేసి అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹7,000 స్టైపెండ్ లభిస్తుంది.
- Note: రెండవ సంవత్సరం ట్రైనింగ్ ఉంటే ఈ స్టైపెండ్ అమౌంట్‌లో 10% నుండి 15% వరకు పెరుగుదల ఉంటుంది.
Selection Process(ఎంపిక విధానం) :-
ICF Act Apprentice పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు కాబట్టి కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు:
- Merit List Preparation: మీరు 10వ తరగతిలో మరియు ఐటీఐలో సాధించిన మార్కుల శాతాన్ని సగానికి (50-50%) తీసుకొని మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఫ్రెషర్స్‌కి కేవలం టెన్త్ మార్కుల ఆధారంగానే లిస్ట్ తీస్తారు.
- Document Verification (DV): మెరిట్ లిస్ట్‌లో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను చెన్నైకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అక్కడ మీ ఒరిజినల్ మార్క్స్ మెమోలు, కుల ధృవీకరణ పత్రాలు చెక్ చేస్తారు.
- Medical Examination: ఫైనల్‌గా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే, బేసిక్ మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ చేసి జాబ్ కి పిలుస్తారు.
Syllabus(సిలబస్) :-
- ఫ్రెండ్స్, నేను పైన సెలెక్షన్ ప్రాసెస్‌లో చెప్పినట్టుగా, ICF Act Apprentice రిక్రూట్‌మెంట్‌కి ఎటువంటి ఎగ్జామ్ (రాత పరీక్ష లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఉండదు.
- ఎగ్జామ్ లేదు కాబట్టి మీరు ఎలాంటి సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సిన పనిలేదు. కేవలం మీ టెన్త్, ఐటిఐ మార్కుల ఆధారంగానే ఈ అప్రెంటిస్ షిప్ ఇస్తారు.
- కాబట్టి హ్యాపీగా అప్లై చేసి మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయడమే మీ పని.
How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి):-
మీ మొబైల్ లేదా కంప్యూటర్ నుండి సింపుల్‌గా ICF Act Apprentice పోస్టులకు అప్లై చేసుకోవడానికి కింద స్టెప్స్ ఫాలో అవ్వండి మామ :
- ముందుగా ICF అఫీషియల్ వెబ్‌సైట్ pb.icf.gov.in ఓపెన్ చేయండి.
- అక్కడ వున్నా హోమ్ పేజీలో “Apply Online – Act Apprentice” అనే లింక్ పైన క్లిక్ చేయండి.
- తర్వాత ఫ్రెషర్ లేదా Ex-ITI అనే ఆప్షన్ ఎంచుకొని, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ తదితర డీటెయిల్స్ తో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
- తర్వాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి, మీ ఫోటో మరియు సిగ్నేచర్ ని అప్‌లోడ్ చేయండి.
- జనరల్ మరియు ఓబీసీ (Male) అభ్యర్థులు ₹100 అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో పే చేయాలి. (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు మరియు మహిళలకు ఎలాంటి ఫీజు లేదు).
- చివరిగా అంతా కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కచ్చితంగా అప్లికేషన్ ని ప్రింట్ ఔట్ తీసి పెట్టుకోండి.
Important Links :-
- Official Notification PDF: Click Here to Download
- Apply Online Link: Click Here to Apply
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
- WhatsApp Channel: Join Our Channel
- Telegram Channel: Join Our Channel
FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు):-
1.ICF Act Apprentice నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?
ICF Act Apprentice పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 07 సెప్టెంబర్ 2026 అనేది ఆఖరి తేదీ మామ. సర్వర్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి
2.ఐటీఐ చేయకుండా డైరెక్ట్ గా 10th క్లాస్ తో అప్లై చేయొచ్చా?
కచ్చితంగా మామ! ఫ్రెషర్స్ కేటగిరీ కింద 330 ఖాళీలు ఉన్నాయి. మీరు కనీసం 50% మార్కులతో 10వ తరగతి పాస్ అయితే ఐటీఐ లేకపోయినా ప్రెషర్ కోటాలో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
3.ICF Act Apprentice పోస్టులకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయ్? సెలక్షన్ ఎలా ఉంటుంది?
అసలు ఈ పోస్టులకు రాత పరీక్షే ఉండదు కాబట్టి ఎగ్జామ్ సెంటర్ అనే ముచ్చటే అవసరం లేదు. మీరు టెన్త్ మరియు ఐటీఐ లో సాధించిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ తీసి అప్రెంటిస్ జాబ్ ఇస్తారు మామ.





