EIL Associate Engineer Recruitment 2026 కోసం ఎదురు చూస్తున్న మన ఇంజనీరింగ్ యువతకు కేంద్ర ప్రభుత్వం నుండి ఒక అదిరిపోయే శుభవార్త వచ్చింది.
హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మన జాబ్ అప్డేట్స్ ఛానల్ కి స్వాగతం!
కేంద్ర ప్రభుత్వ రంగంలోని ప్రముఖ సంస్థ అయిన ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL) లో 12 అసోసియేట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు ఎలాంటి అనుమానం లేకుండా అప్లై చేసుకోవచ్చు.
కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసే ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మామా!
మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళకి వెంటనే ఈ ఆర్టికల్ వారికి షేర్ చేయండి.
Recruitment Overview:-
| వివరాలు (Details) | పూర్తి సమాచారం (Information) |
| Organization | Engineers India Limited (EIL) |
| Post Name | Associate Engineer Grade I |
| Total Vacancies | 12 Posts |
| Qualification | B.E / B.Tech / B.Sc (Engg) |
| Job Location | All Over India (NCR & Project Sites) |
| Apply Mode | Online |
| Starting Date | 25 ఆగస్టు 2026 |
| Last Date | 08 సెప్టెంబర్ 2026 (రాత్రి 11:59 PM వరకు) |
| Official Website | engineersindia.com |
Vacancy Details (పోస్టుల వివరాలు):-
EIL Associate Engineer నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులను విభాగాల వారీగా భర్తీ చేస్తున్నారు. వాటి వివరాలు క్రింది టేబుల్ లో ఇచ్చాను చూసుకోండి:
| పోస్ట్ పేరు (Post Name) | బ్రాంచ్ (Branch) | ఖాళీలు (Vacancies) | రిజర్వేషన్ వివరాలు (UR/SC/ST/OBC/EWS) |
| Pipeline/Piping Engineer (Code A) | Mechanical | 06 | UR-2, SC-1, ST-1, OBC-1, EWS-1 |
| Offshore Structural Engineer (Code B) | Civil / Ocean / Marine / Naval Architecture | 04 | UR-2, SC-1, ST-0, OBC-1, EWS-0 |
| Project Engineer (Code C) | Mechanical / Civil / Marine / Naval | 02 | UR-1, SC-0, ST-0, OBC-1, EWS-0 |
| మొత్తం ఖాళీలు | 12 పోస్టులు |
Education & Age Limit:-
EIL Associate Engineer పోస్టులు కి అప్లై చేయడానికి ముందు మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా అని ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్:
- విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, సివిల్, ఓషన్, మెరైన్ లేదా నావల్ ఆర్కిటెక్చర్ లో రెగ్యులర్ B.E / B.Tech / B.Sc (Engineering) పూర్తి చేసి ఉండాలి.
- కనీస మార్కులు: ఇంజనీరింగ్ డిగ్రీలో కనీసం 60% మార్కులు లేదా దానికి సమానమైన CGPI సాధించి ఉండాలి.
- వర్క్ ఎక్స్‌పీరియన్స్: 31 జూలై 2026 నాటికి పైప్‌లైన్, రిఫైనరీ, పెట్రోకెమికల్ లేదా ఆఫ్‌షోర్ ప్రాజెక్ట్స్ డిజైనింగ్ లో కనీసం 2 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. అనుభవం ఉంటేనే సెలెక్ట్ అవుతారు.
- వయో పరిమితి: 31.07.2026 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 32 సంవత్సరాల లోపు ఉండాలి.
- వయో సడలింపు: నిబంధనల ప్రకారం ఓబీసీ (OBC-NCL) వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ (SC/ST) వారికి 5 సంవత్సరాలు, మరియు దివ్యాంగులకు (PwD) 10 నుండి 15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Salary Details(జీతం వివరాలు):-
- EIL Associate Engineer నియామకం ప్రారంభంలో 2 సంవత్సరాల కాలపరిమితికి (Fixed Term Basis) జరుగుతుంది, అవసరాన్ని బట్టి 3 ఏళ్ల వరకు పొడిగిస్తారు.
- X-Category Cities (ఉదా: ఢిల్లీ లాంటి మెట్రో నగరాలు): నెలకు ₹64,000 కన్సాలిడేటెడ్ జీతం లభిస్తుంది.
- Y-Category Cities: నెలకు ₹60,800 కన్సాలిడేటెడ్ శాలరీ ఇస్తారు.
- Z-Category Cities: నెలకు ₹57,600 వేతనం అందుతుంది.
- ఈ జీతంలోనే HRA మరియు PF భత్యాలు కలిసి ఉంటాయి.
- వీటితో పాటు ఏడాదికి ₹2,00,000 వరకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం రీయింబర్స్‌మెంట్, ట్రావెలింగ్ అలవెన్సులు, మరియు నెలకు 2 రోజుల పెయిడ్ లీవ్స్ కూడా ఉంటాయి.
Selection Process(ఎంపిక విధానం):-
EIL Associate Engineer పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 4 స్టెప్స్ లో జరుగుతుంది:
- అప్లికేషన్ స్క్రీనింగ్: అభ్యర్థులు సమర్పించిన ఆన్‌లైన్ దరఖాస్తులు, మార్కులు మరియు వర్క్ అనుభవం ఆధారంగా ఎలిజిబుల్ కాండిడేట్స్‌ని షార్ట్ లిస్ట్ చేస్తారు.
- పర్సనల్ ఇంటర్వ్యూ (Walk-in Interview): షార్ట్ లిస్ట్ అయిన వారికి గురుగ్రామ్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, వడోదరలలో ఉదయం 08:00 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఖచ్చితమైన తేదీని మీ ఈమెయిల్‌కు పంపిస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఇంటర్వ్యూ సమయంలో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ ప్రింటౌట్‌లు (6 సెట్లు) మరియు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను తనిఖీ చేస్తారు.
- మెడికల్ ఫిట్‌నెస్: మెడికల్ టెస్ట్‌లో ఫిట్‌గా ఉన్నవారికి ఫైనల్ అపాయింట్‌మెంట్ ఇస్తారు.
Syllabus & Interview Preparation:-
EIL Associate Engineer పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు కాబట్టి బుక్స్ చదవాల్సిన పని లేదు మామా. కానీ ఇంటర్వ్యూలో మెయిన్ గా కింద ఇచ్చిన టాపిక్స్ పై పట్టు సాధించాలి:
- కోర్ ఇంజనీరింగ్: మీ మెకానికల్ లేదా సివిల్ బ్రాంచ్ బేసిక్స్, పైపింగ్ డిజైన్, ఆఫ్‌షోర్ స్ట్రక్చర్స్ మరియు మెటీరియల్స్ పై అవగాహన.
- ఇండస్ట్రియల్ కోడ్స్: ASME B 31.4, B 31.8, B 31.3, API, ISO, మరియు OISD / PNGRB స్టాండర్డ్స్ గురించి అడిగే అవకాశం ఉంది.
- గత పని అనుభవం: గత 2 ఏళ్లలో మీరు చేసిన ప్రాజెక్ట్‌లు, డ్యూటీలు మరియు ప్లాంట్‌లో పరిష్కరించిన ప్రాక్టికల్ సమస్యల గురించి క్లియర్‌గా వివరించాలి.
How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి):-
- EIL Associate Engineer పోస్టులకు అప్లై చేసుకోవడానికి ముందుగా Engineers India Limited అఫీషియల్ వెబ్‌సైట్ engineersindia.com ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలోని “Careers” ఆప్షన్‌లోకి వెళ్లి రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ పేరు, ఈమెయిల్ మరియు మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి.
- పర్సనల్, ఎడ్యుకేషన్ మరియు వర్క్ ఎక్స్‌పీరియన్స్ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయండి.
- మార్కుల శాతాన్ని రౌండ్ ఆఫ్ చేసి (ఉదాహరణకు 60.9% అయితే 60 గా) రాయాలి.
- తరువాత మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (75 KB లోపు) మరియు సంతకం (25 KB లోపు) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
- ఈ పోస్టులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, కాబట్టి ఫామ్‌ను డైరెక్ట్‌గా సబ్మిట్ చేయండి.
- సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్‌ను తప్పనిసరిగా 6 కాపీలు ప్రింట్ తీసుకుని, ఫోటోలు అంటించి ఇంటర్వ్యూకి తీసుకువెళ్లాలి గుర్తుపెట్టుకోండి.
Mandatory Links:-
- Official Notification PDF: Click Here
- Apply Online Link: Click Here
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు):-
- EIL Associate Engineer పోస్టులకు ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా?
ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు మామా! EIL అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థ కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు.
- EIL Associate Engineer పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?
ఆన్‌లైన్ అప్లికేషన్స్ 25 ఆగస్టు 2026 నుండి ప్రారంభమయ్యాయి, చివరి తేదీ 08 సెప్టెంబర్ 2026 రాత్రి 11:59 గంటల వరకు ఉంటుంది.
- ఇంటర్వ్యూ కి ఏమేమి డాక్యుమెంట్లు తీసుకువెళ్లాలి?
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ 6 సెట్లు, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్, 10వ తరగతి సర్టిఫికెట్, ఇంజనీరింగ్ డిగ్రీ మార్క్స్ మెమోలు, మరియు గత 2 ఏళ్ల ఒరిజినల్ సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు వెంట తీసుకువెళ్లాలి.





