🚀 APCOB Apprentice Recruitment 2026 | Degree కి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Published On:

APCOB Apprentice

Join WhatsApp

Join Now

ఏపీలో డిగ్రీ క్వాలిఫికేషన్ తో మంచి బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్న వారికి APCOB Apprentice Recruitment 2026 అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ మామ. హలో ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB), విజయవాడ హెడ్ క్వార్టర్స్ లో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ కోసం అదిరిపోయే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏపీలో వున్నా ఏ జిల్లా వారైనా సరే అర్హత ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం 25 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక్కడ హైలైట్ ఏమిటంటే, ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు మామా! కేవలం మీ ఎడ్యుకేషనల్ మెరిట్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ ని అస్సలు మిస్ అవ్వొద్దు. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ లో ఎవరైనా బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తుంటే కచ్చితంగా ఈ ఆర్టికల్ ని వారికి షేర్ చేయడం మర్చిపోకండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది.

Recruitment Overview:- 

వివరాలు సమాచారం
Organization Andhra Pradesh State Cooperative Bank Ltd (APCOB)
Post Name Apprentice (అప్రెంటిస్)
Total Vacancies 25
Qualification Bachelor’s Degree (సంబంధిత విభాగంలో)
Job Location Vijayawada, Andhra Pradesh
Apply Mode Online
Apply Start Date 02 August 2026
Last Date 11 August 2026
Official Website apcob.bank.in

ఏయే ఏయే విభాగాల్లో పోస్టులు ఉన్నాయంటే? :- 

APCOB Apprentice జాబ్స్ కి సంబంధించి ఏయే ఏయే పోస్టులు ఎన్ని ఉన్నాయో క్లియర్ గా కింద టేబుల్ లో ఇచ్చాను చూసుకోండి:

పోస్టు పేరు (విభాగం) ఖాళీల సంఖ్య
జనరల్ (General) 18
అగ్రికల్చర్ (Agriculture) 03
ఐటీ (IT) 03
లీగల్ (Legal) 01
మొత్తం (Total) 25

Education & Age Details :- 

  • విద్యార్హతలు (Education): APCOB Apprentice పోస్టులకు అప్లై చేయాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి.
  • స్పెషలైజేషన్స్: జనరల్ పోస్టులకు Banking/Commerce/Accounting లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అగ్రికల్చర్ పోస్టులకైతే Agriculture/Horticulture/Veterinary చదివి ఉండాలి. ఐటీ పోస్టులకు CS/IT/ECE బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. లీగల్ పోస్టులకు లా (Law) చదివిన వారు అప్లై చేసుకోవచ్చు.
  • భాషా నైపుణ్యం: అభ్యర్థులకు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అయిన తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలు బాగా చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
  • వయస్సు (Age Limit): అభ్యర్థుల వయస్సు 01 ఆగస్టు 2026 నాటికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. (అంటే 01.08.1998 – 01.08.2004 మధ్య జన్మించి ఉండాలి).
  • వయో సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ (SC/ST) లకు 5 ఏళ్లు, ఓబీసీ (OBC) లకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు అప్పర్ ఏజ్ లిమిట్ లో సడలింపు ఉంటుంది.

Salary (స్టైపెండ్) :-

  • APCOB Apprentice జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు విజయవాడలో ఒక సంవత్సరం (1 Year) పాటు అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ ఇస్తారు.
  • ఈ ట్రైనింగ్ పీరియడ్ లో ప్రతి నెలా ₹15,000 స్టైపెండ్ (జీతం) గా అందిస్తారు.
  • ఈ మొత్తం 15 వేలలో రూ.10,500 బ్యాంకు వాళ్లు ఇస్తారు. మిగిలిన రూ.4,500 కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న DBT (Direct Benefit Transfer) సిస్టమ్ ద్వారా డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతాయ్.
  • ఈ స్టైపెండ్ కాకుండా వేరే ఇతర అలవెన్సులు (HRA, DA లాంటివి) ఏమీ ఉండవు గుర్తుపెట్టుకోండి.

Selection Process (ఎంపిక విధానం)

  1. APCOB Apprentice పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉండదు. ఇది పూర్తిగా మీ మార్కుల ఆధారంగా జరిగే ఎంపిక ప్రక్రియ.
  2. పదో తరగతి (10th Class): టెన్త్ మార్కులకు 10 పాయింట్ల వెయిటేజీ ఇస్తారు.
  3. ఇంటర్మీడియట్ (12th Class): ఇంటర్ మార్కులకు మరో 10 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.
  4. గ్రాడ్యుయేషన్ (Degree): డిగ్రీ మార్కులకు కూడా 10 పాయింట్ల వెయిటేజీ ఇస్తారు.
  5. ఈ మూడింటిలో మీరు తెచ్చుకున్న పర్సంటేజ్ బట్టి ఈ 30 పాయింట్లకు మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కౌంట్ చేసి మెరిట్ లిస్ట్ రీలీజ్ చేస్తారు. (ఉదాహరణకు మీకు 90% వస్తే 9 మార్కులు యాడ్ అవుతాయి).
  6. అలా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు విజయవాడ హెడ్ ఆఫీస్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి జాయిన్ చేసుకుంటారు.

Syllabus (సిలబస్) :- 

  • APCOB Apprentice జాబ్స్ కి చాలా మంది సిలబస్ ఏంటి అని అడుగుతారు. పైన చెప్పుకున్నట్లుగా దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి ఎలాంటి సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సిన పనిలేదు.
  • జస్ట్ మీ దగ్గర ఉన్న టెన్త్, ఇంటర్, డిగ్రీ ఒరిజినల్ మార్క్స్ మెమోలు అన్ని రెడీగా పెట్టుకుంటే చాలు.

How to Apply Online(ఎలా అప్లై చేసుకోవాలి) :- 

  • APCOB Apprentice జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ముందుగా మీరు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్ (nats.education.gov.in) ఓపెన్ చేసి, అందులో మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ 100% కంప్లీట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కింద ఇవ్వబడిన APCOB అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ క్లిక్ ఓపెన్ చేయండి.
  • ఆందులో వున్నా కెరీర్స్ (Careers) సెక్షన్ లో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి.
  • తర్వాత మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ మార్కులు ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా నింపండి.
  • మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, మరియు అవసరమైన సర్టిఫికెట్లు అన్నీ అడిగిన సైజులో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
  • అప్లికేషన్ కి ఎలాంటి ఫీజు లేదు కాబట్టి, వివరాలు చెక్ చేసుకొని 11 ఆగస్టు 2026 లోపు ఫైనల్ సబ్మిట్ కొట్టండి. అప్లికేషన్ కాపీని ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు.

Mandatory Links :- 

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు) :- 

Q1: APCOB Apprentice నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి ఎంత ఫీజు కట్టాలి?

A: లేదు మామా! దీనికి అప్లై చేయడానికి రూపాయి కూడా ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఫ్రీ అప్లికేషన్.

Q2: APCOB Apprentice షిప్ పూర్తయిన తర్వాత పర్మినెంట్ జాబ్ ఇస్తారా?

A: ఇది కేవలం ఒక సంవత్సరం పాటు ఉండే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే. ట్రైనింగ్ తర్వాత బ్యాంక్ పర్మినెంట్ ఉద్యోగం ఇస్తుందని ఎలాంటి గ్యారెంటీ లేదు. కానీ బ్యాంకింగ్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ మీ ఫ్యూచర్ జాబ్స్ కి చాలా ప్లస్ అవుతుంది.

Q3: APCOB Apprentice జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు ముగుస్తుంది?

A: ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 02, 2026 న మొదలయ్యాయి. అప్లై చేయడానికి ఆగస్టు 11, 2026 చివరి తేదీ. కాబట్టి సర్వర్ ప్రాబ్లమ్స్ రాకముందే ఇప్పుడే అప్లై చేసుకోండి.

🔴Related Post

Leave a Comment