ఈ రోజు మనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న NTPC Deputy Manager Recruitment 2026 గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన జాబ్ అప్డేట్స్ బ్లాగ్‌కి మీకందరికీ స్వాగతం మామ. ఈసారి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నుంచి సీనియర్ ఇంజనీర్స్ కోసం ఒక మైండ్ బ్లోయింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎప్పటినుంచో పవర్ సెక్టార్ లో మంచి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్ మామ.ఇది మాత్రం మిస్ అవ్వద్దు.
ఇందులో మొత్తంగా 135 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. బి.టెక్ తో పాటు పదేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అండ్ ఆగస్టు 26 లాస్ట్ డేట్ కాబట్టి అస్సలు టైమ్ వేస్ట్ చేయకండి. అలాగే, ఈ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో కచ్చితంగా షేర్ చేయండి, ఎవరికైనా ఇలా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది.
Recruitment Overview:-
| Organization | National Thermal Power Corporation (NTPC) Limited |
| Post Name | Deputy Manager (E4 Grade) |
| Total Vacancies | 135 Posts |
| Qualification | B.E. / B.Tech + 10 Years Experience |
| Job Location | All Over India |
| Apply Starting Date | 12 August 2026 |
| Apply Last Date | 26 August 2026 |
| Apply Mode | Online Only |
| Official Website | careers.ntpc.co.in |
Vacancy Details (ఏయే పోస్టులు ఉన్నాయంటే):-
NTPC Deputy Manager పోస్టులకు సంబంధించి ఏ బ్రాంచ్ వాళ్లకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని ఒకసారి క్లియర్ గా ఈ టేబుల్ లో ఇచ్చాను చూసుకోండి ఫ్రెండ్స్:
| Department / Branch | Post Name | Total Vacancies |
| Electrical | Deputy Manager (Electrical) | 45 |
| Mechanical | Deputy Manager (Mechanical) | 50 |
| C & I | Deputy Manager (Control & Instrumentation) | 40 |
| Total | 135 Posts |
Education & Age Limit:-
NTPC Deputy Manager పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఈ కింది ఎక్సప్లయిన్ చేసిన ఎడ్యుకేషన్ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి:
- ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా కంట్రోల్ & ఇన్స్ట్రుమెంటేషన్ (C&I) బ్రాంచ్ లలో ఫుల్-టైమ్ B.E. లేదా B.Tech డిగ్రీ చేసి ఉండాలి. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి మినిమం 60% మార్కులు వచ్చి ఉండాలి. SC/ST/PwBD వాళ్లకు జస్ట్ పాస్ మార్కులు ఉన్నా సరిపోతుంది.
- ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్: ఊరికే డిగ్రీ ఉంటే సరిపోదు ఫ్రెండ్స్, కచ్చితంగా పవర్ ప్లాంట్ ఎరెక్షన్, కమిషనింగ్, ఆపరేషన్స్ లేదా మెయింటెనెన్స్ విభాగాల్లో 10 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. ఇది సీనియర్ లెవెల్ పోస్ట్ కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ.
- వయోపరిమితి (Age Limit): అప్లికేషన్ పెట్టుకునే నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు దాటకూడదు. ఎప్పటిలాగే మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ వాళ్లకి 3 ఏళ్లు, SC/ST వాళ్లకి 5 ఏళ్లు మరియు PwBD అభ్యర్థులకు 10 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉంటుంది.
Salary Details( జీతం వివరాలు):-
NTPC Deputy Manager జాబ్ లో జాయిన్ అవ్వగానే మీకు వచ్చే జీతం మరియు బెనిఫిట్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి ఫ్రెండ్స్:
- బేసిక్ పే: ఈ డిప్యూటీ మేనేజర్ (E4 గ్రేడ్) జాబ్ కి ఎంపికైతే బేసిక్ పే నెలకు ₹70,000 తో స్టార్ట్ అవుతుంది. గరిష్టంగా ₹2,00,000 వరకు వెళ్తుంది. ఇది చూస్తుంటేనే మైండ్ పోతోంది కదా మామ!
- అలవెన్సులు: కేవలం బేసిక్ పే మాత్రమే కాదు, దీనికి అదనంగా ఇండస్ట్రియల్ డియర్నెస్ అలవెన్స్ (IDA), కంపెనీ రూల్స్ ప్రకారం హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) లేదా కంపెనీ క్వార్టర్స్ ఇస్తారు.
- ఇతర బెనిఫిట్స్: వీటితో పాటు పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (PRP), మీ అండ్ మీ ఫ్యామిలీకి బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్, ప్రావిడెంట్ ఫండ్ (PF), గ్రాట్యుటీ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి ఉండే ప్రతి ఒక్క బెనిఫిట్ మీకు అందుతుంది మామ.
Selection Process(ఎంపిక విధానం):-
NTPC Deputy Manager పోస్టులకి కాంపిటీషన్ ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, అది చెప్పాను చూసుకోండి ఒకసారి:
- అప్లికేషన్ల షార్ట్‌లిస్టింగ్ (Shortlisting): మనం అప్లై చేసిన తర్వాత మన క్వాలిఫికేషన్స్ మరియు 10 ఏళ్ల అనుభవ ధృవీకరణ పత్రాలను బేస్ చేసుకుని, సరైన కాండిడేట్స్ ని పర్ఫెక్ట్ గా స్క్రూటినీ చేసి నెక్స్ట్ రౌండ్ కి షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ (CBT): ఒకవేళ పోస్టులకి అప్లై చేసిన వాళ్ళ సంఖ్య భారీగా ఉంటే, NTPC వాళ్ళు ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) కండక్ట్ చేస్తారు. ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- పర్సనల్ ఇంటర్వ్యూ (Interview): టెస్ట్ లేదా షార్ట్‌లిస్టింగ్ లో సెలెక్ట్ అయిన వారిని ఫేస్-టు-ఫేస్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులో మీ టెక్నికల్ నాలెడ్జ్ మరియు లీడర్షిప్ స్కిల్స్ ని గట్టిగా టెస్ట్ చేస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్: ఫైనల్ గా ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి, NTPC మెడికల్ బోర్డు ద్వారా పూర్తి ఆరోగ్య పరీక్షలు (Medical Fitness) నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు.
Syllabus Details(సిలబస్ వివరాలు):-
NTPC Deputy Manager పోస్టులకు సంబంధించిన సిలబస్ కింద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి :
- కోర్ సబ్జెక్ట్స్: ఒకవేళ రాత పరీక్ష పెడితే, అందులో 70% వరకు ప్రశ్నలు మీ ఇంజనీరింగ్ బ్రాంచ్ (ఎలక్ట్రికల్, మెకానికల్, లేదా C&I) కి సంబంధించిన కోర్ కాన్సెప్ట్స్ నుంచే వస్తాయి. ముఖ్యంగా పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్ పై మంచి గ్రిప్ ఉండాలి.
- జనరల్ ఆప్టిట్యూడ్: మిగిలిన 30% పేపర్ లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (మ్యాథ్స్), లాజికల్ రీజనింగ్ మరియు జనరల్ ఇంగ్లీష్ మీద బేసిక్ లెవెల్ ప్రశ్నలు అడుగుతారు.
- లేటెస్ట్ అవేర్నెస్: పవర్ సెక్టార్ లో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీలు, గవర్నమెంట్ స్కీమ్స్ మీద కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి టెక్నికల్ తో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా డైలీ కవర్ చేయండి.
How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి):-
- NTPC Deputy Manager పోస్టులకు అప్లై చేసుకోవడానికి ముందుగా కింద నేను ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ (careers.ntpc.co.in) మీద క్లిక్ చేయండి. లేదా డైరెక్ట్ గా ‘Apply Online’ లింక్ ఓపెన్ చేయండి.
- అక్కడ “Current Openings” సెక్షన్ లోకి వెళ్లి Advt. No. 10/26 నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి, మీ వాలిడ్ ఇమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి.
- మీ లాగిన్ ఐడీ తో పోర్టల్ లోకి వెళ్లి, అప్లికేషన్ ఫామ్ లో మీ పేరు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ముఖ్యంగా 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ తప్పులు లేకుండా ఫిల్ చేయండి.
- తర్వాత అడిగిన సైజులో మీ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ మరియు మీ బీటెక్, ఎక్స్పీరియన్స్, కాస్ట్ సర్టిఫికెట్లను క్లియర్ గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
- జనరల్, OBC, మరియు EWS కేటగిరీ అభ్యర్థులు ₹500 రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా (క్రెడిట్/డెబిట్/నెట్ బ్యాంకింగ్) పే చేయాలి. SC/ST/PwBD మరియు మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు!
- అన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఫామ్ సబ్మిట్ కొట్టండి. భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం ఆ అప్లికేషన్ ని ఒక ప్రింటవుట్ తీసి జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి మామా.
Mandatory Links:-
- Official Notification PDF: Click Here
- Apply Online Link: Click Here
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
- Join Our WhatsApp Channel: Click Here
- Join Our Telegram Channel: Click Here
FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు):-
Q1: NTPC Deputy Manager Recruitment 2026 కి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటినుంచి స్టార్ట్ అయ్యాయి?
ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ అప్లికేషన్స్ 12 ఆగస్టు 2026 నుంచే స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ 26 ఆగస్టు 2026. సో టైమ్ చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి.
Q2: NTPC Deputy Manager పోస్టులకి ఫుల్ టైమ్ బీటెక్ కాకుండా కరస్పాండెన్స్ లో డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులేనా?
లేదండి, నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కేవలం ఫుల్-టైమ్ (రెగ్యులర్) B.E. లేదా B.Tech చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
Q3: 10 ఏళ్ల అనుభవం కచ్చితంగా పవర్ సెక్టార్ లోనే ఉండాలా?
అవును మామా, మీ 10 ఏళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కచ్చితంగా పవర్ ప్లాంట్ ఎరెక్షన్, కమిషనింగ్, ఆపరేషన్స్ లేదా మెయింటెనెన్స్ విభాగాలకు సంబంధించే ఉండాలి. అప్పుడే మీరు ఈ NTPC Deputy Manager పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులు.





