POWERGRID Apprentice Recruitment 2026 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. Hello friends, ఎలా ఉన్నారు? మీకోసం నేను ఒక సూపర్ జాబ్ అప్‌డేట్ ని తీసుకొచ్చాను. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పవర్‌గ్రిడ్ (Power Grid Corporation of India Limited) దేశవ్యాప్తంగా ఉన్న తమ వివిధ రీజినల్ ఆఫీసుల్లో 270 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీఐ, డిప్లొమా, లేదా ఇంజనీరింగ్ (B.Tech/B.E) పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ తమ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది బెస్ట్ ఛాన్స్ మామా.
అసలు ఎలాంటి రాత పరీక్ష కానీ, ఎలాంటి ఇంటర్వ్యూ కానీ లేకుండా, అప్లికేషన్‌కి రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా కేవలం మార్కుల యొక్క మెరిట్ ఆధారంగా ఈ POWERGRID Apprentice పోస్టులను భర్తీ చేస్తున్నారు. పవర్‌గ్రిడ్ లాంటి కంపెనీలో అప్రెంటిస్ పూర్తి చేస్తే ఫ్యూచర్‌లో వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌లో మీకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు, దయచేసి మీ ఫ్రెండ్స్, &ఫ్యామిలీ సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్‌లో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఎవరికో ఒకరికి కచ్చితంగా ఉపయోగపడుతుంది.
Recruitment Overview:-
| Organization | Power Grid Corporation of India Limited (POWERGRID) |
| Post Name | ITI, Diploma, Graduate (B.Tech) Apprentice |
| Total Vacancies | 270 Posts |
| Qualification | ITI / Diploma / Degree |
| Job Location | Across India (Various Regions) |
| Apply Mode | Online |
| Apply Starting Date | 25 August 2026 |
| Last Date to Apply | 10 September 2026 |
| Official Website | www.powergrid.in |
Vacancy Details (ఏయే పోస్టులు ఉన్నాయంటే):-
POWERGRID Apprentice నోటిఫికేషన్ కి సంబంధించి ఏ క్వాలిఫికేషన్ వాళ్లకు ఏయే పోస్టులు ఉన్నాయో అని కింద క్లియర్‌గా టేబుల్‌లో ఇచ్చాను చూసుకోండి:
| పోస్టు పేరు (Post Name) | అర్హత గల విభాగాలు (Disciplines) |
| ITI Apprentice | ఎలక్ట్రీషియన్ (Electrician) |
| Diploma Apprentice | ఎలక్ట్రికల్ (Electrical), సివిల్ (Civil) |
| Graduate Apprentice | ఎలక్ట్రికల్ (Electrical), సివిల్ (Civil) |
Education & Age:-
POWERGRID Apprentice పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఈ కింది ఎక్సప్లయిన్ చేసిన ఎడ్యుకేషన్ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి:
- వయోపరిమితి (Age Limit): దరఖాస్తు చేసుకునే సమయానికి (అంటే నోటిఫికేషన్ డేట్ నాటికి) అభ్యర్థులకు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.
- ITI Electrician: గుర్తింపు పొందిన ఐటీఐ సంస్థ నుండి ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఫుల్ టైమ్ కోర్సు పాస్ అయి ఉండాలి.
- Diploma Apprentice: AICTE లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి ఎలక్ట్రికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో 3 ఏళ్ల ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా చేసి ఉండాలి.
- Graduate Apprentice: ఎలక్ట్రికల్ లేదా సివిల్ విభాగంలో 4 ఏళ్ల ఫుల్ టైమ్ B.E / B.Tech / B.Sc (Engg) పూర్తి చేయాలి.
- ముఖ్యమైన గమనిక: 11 సెప్టెంబర్ 2024 నుండి 10 సెప్టెంబర్ 2026 మధ్యలో తమ ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఇంకా ఎగ్జామ్స్ రాసి ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు లేదా అంతకంటే ముందు పాస్ అయిన వాళ్ళు అప్లై చేయడానికి వీల్లేదు.
Salary (Stipend Details):-
POWERGRID Apprentice పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి వన్ ఇయర్ పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు మంచి స్టైఫండ్ (జీతం లాంటిది) అందుతుంది:
- ITI అప్రెంటిస్‌లకు: వీరికి నెలకు ₹13,500/- స్టైఫండ్ గా అందిస్తారు.
- డిప్లొమా అప్రెంటిస్‌లకు: ఎలక్ట్రికల్/సివిల్ డిప్లొమా వారికి నెలకు ₹15,000/- స్టైఫండ్ లభిస్తుంది.
- గ్రాడ్యుయేట్ (Degree) అప్రెంటిస్‌లకు: ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తయిన వారికి నెలకు అత్యధికంగా ₹17,500/- వరకు స్టైఫండ్ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది.
Selection Process(ఎంపిక విధానం):-
POWERGRID Apprentice పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ చాలా క్లియర్ గా, సింపుల్ గా జరుగుతుంది ఫ్రెండ్స్:
- ఆన్‌లైన్ స్క్రూటినీ: ముందుగా అభ్యర్థులు అఫీషియల్ వెబ్‌సైట్‌లో సబ్మిట్ చేసిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ ని వాళ్ళు చెక్ చేస్తారు.
- మెరిట్ లిస్ట్ తయారీ: మీరు మీ అకడమిక్ క్వాలిఫికేషన్ (ITI/Diploma/Degree) లో సాధించిన మార్కుల పర్సంటేజ్ ఆధారంగా ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లకు ముందు ప్రిఫరెన్స్ ఉంటుంది.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: మెరిట్ లిస్ట్‌లో పేరున్న వాళ్లకు వాళ్ళ ఈమెయిల్ కి మెసేజ్ పంపి, ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు.
- ఫైనల్ పోస్టింగ్: డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండి, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేసిన వారికి ఏ రీజియన్‌లో ఖాళీ ఉంటే అక్కడ ఫైనల్ గా ట్రైనింగ్ పోస్టింగ్ ఇస్తారు.
Syllabus Details(సిలబస్ వివరాలు):-
- చాలామంది డౌట్ ఉంటుంది POWERGRID Apprentice పోస్టులకు సిలబస్ ఏంటి అని, కానీ ఈ పోస్టులకు అసలు ఎలాంటి రాత పరీక్ష (Written Exam) మరియు ఇంటర్వ్యూ ఉండదు.
- కాబట్టి, ఎటువంటి బుక్స్ గానీ, పాత క్వశ్చన్ పేపర్స్ గానీ, సిలబస్ కానీ ప్రిపేర్ అవ్వాల్సిన పని అస్సలు లేదు.
- కేవలం మీ చదువులో ఇప్పటిదాకా వచ్చిన మార్కుల ఆధారంగానే డైరెక్ట్ సెలెక్షన్ జరుగుతుంది కాబట్టి బుక్స్ పక్కనపెట్టి ప్రశాంతంగా అప్లై చేసుకోండి.
How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి):-
అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్‌లైన్ ద్వారానే చేయాలి. మిస్టేక్స్ లేకుండా అప్లై చేయడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
- POWERGRID Apprentice పోస్టులకు ముందుగా ఐటీఐ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే డిప్లొమా/గ్రాడ్యుయేట్ వాళ్లు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ప్రొఫైల్ 100% కంప్లీట్ చేయాలి.
- ఆ తర్వాత వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ని కాపీ చేసుకుని, పవర్‌గ్రిడ్ అఫీషియల్ వెబ్‌సైట్ (www.powergrid.in) లోని “Careers > Engagement of Apprentices” సెక్షన్ కి వెళ్ళండి.
- అక్కడ ఉన్న “Apply Online” లింక్ ఓపెన్ చేసి, మీరు అప్లై చేయాలనుకుంటున్న రీజియన్, మరియు మీ ట్రేడ్ ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. (ఒక్క కాండిడేట్ ఒకే ట్రేడ్‌కి అప్లై చేయాలి సుమా!).
- మీ NAPS/NATS రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి, మీ ఫోటో, సిగ్నేచర్, మార్క్స్ మెమోలు, ఆధార్, మరియు కుల ధృవీకరణ పత్రం (రిజర్వేషన్ ఉంటే) లాంటి డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు ఒక్క రూపాయి కూడా లేదు కాబట్టి, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో లాస్ట్ లో ఒకసారి చెక్ చేసుకుని ఫార్మ్ “Submit” చేయండి. ఫార్మ్ ప్రింట్ తీసి జాగ్రత్తగా పెట్టుకోండి.
Mandatory Links:-
| Northern Region-I, Faridabad | Click Here |
| Northern Region-II, Jammu | Click Here |
| Northern Region-III, Lucknow | Click Here |
| Eastern Region-I, Patna | Click Here |
| Eastern Region-II, Kolkata | Click Here |
| North Eastern Region, Shillong | Click Here |
| Western Region-I, Nagpur | Click Here |
| Western Region-II, Vadodara | Click Here |
| Southern Region-I, Secunderabad | Click Here |
| Southern Region-II, Bengaluru | Click Here |
- Official Notification PDF: Click Here
- Apply Online Link: Click Here
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి.
FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు):-
- POWERGRID Apprentice నోటిఫికేషన్‌కి అప్లికేషన్ ఫీజు ఎంత కట్టాలి?
ఈ రిక్రూట్‌మెంట్‌కి అప్లికేషన్ ప్రాసెస్ అందరికీ పూర్తిగా ఉచితం మామా. మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ.. ఇలా ఏ కేటగిరీకి చెందిన వారైనా సరే ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.
- నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నేను ఈ POWERGRID Apprentice పోస్టులకు అప్లై చేసుకోవచ్చా ?
లేదు బ్రో, POWERGRID Apprentice అప్లై చేయాలంటే 10 సెప్టెంబర్ 2026 లోపు మీరు మీ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తి చేసి పాస్ అయి ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు లేదా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు అప్లై చేయడానికి అనర్హులు.
- అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తయ్యాక పవర్‌గ్రిడ్ లో పర్మినెంట్ జాబ్ ఇస్తారా?
అప్రెంటిస్ అనేది కేవలం ఒక సంవత్సరం పాటు ఇచ్చే స్కిల్ ట్రైనింగ్ మాత్రమే. ఇది పూర్తయ్యాక పవర్‌గ్రిడ్ డైరెక్ట్‌గా పర్మినెంట్ జాబ్ ఇవ్వదు. కానీ, ఫ్యూచర్‌లో వచ్చే ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌లో అప్రెంటిస్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లకు ప్రత్యేక వెయిటేజ్ లేదా ప్రిఫరెన్స్ ఇస్తారు.





