🚀 South Indian Bank Junior Officer Recruitment 2026 | Any Degree కి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Published On:

South Indian Bank Junior Officer

Join WhatsApp

Join Now

మామ South Indian Bank Junior Officer Recruitment 2026 కోసం ఎదురుచూస్తున్న బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కి ఇది ఒక బంపర్ ఛాన్స్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకు సౌత్ ఇండియన్ బ్యాంక్ (SIB) నుంచి జూనియర్ ఆఫీసర్ (Business Promotion Officer) పోస్టుల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ రీలీజ్ అయింది మామ. డిగ్రీ కంప్లీట్ చేసి ప్రైవేట్ సెక్టార్ లో మంచి కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా జాబ్ కొట్టాలనుకునే వారికి ఈ జాబ్ ఒక గోల్డెన్ ఛాన్స్. ఎగ్జామ్ లేదు, అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్లై చేసుకోండి.

South Indian Bank Junior Officer పోస్టుకి సెలెక్ట్ అయితే స్టార్టింగ్ లోనే సంవత్సరానికి ఏకంగా రూ. 7.85 లక్షల వరకు భారీ ప్యాకేజీ వస్తుంది. సో, ఇంత మంచి సాలరీ ఉన్న ఈ ఛాన్స్ ని వదులుకోకండి. మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి కావలసిన క్వాలిఫికేషన్స్, డీటెయిల్స్ సెలెక్షన్ ప్రాసెస్, మరియు ఎలా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు కింద స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఆర్టికల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి కూడా బాగా యూజ్ అవుతుంది, కాబట్టి వాళ్ళకి తప్పకుండా దీన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్.

Recruitment Overview:-

South Indian Bank Junior Officer రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు మరియు బేసిక్ డీటెయిల్స్ తో కూడిన ఓవర్ వ్యూ కింద టేబుల్ లో ఇచ్చాను చూసుకోండి ఒకసారి:

Organization South Indian Bank (SIB)
Post Name Junior Officer (Business Promotion Officer)
Total Vacancies Not Specified (అవసరాన్ని బట్టి భర్తీ చేస్తారు)
Qualification Any Degree + 2 Years Experience
Job Location Delhi, Mumbai, Pune, Ahmedabad
Apply Mode Online
Apply Starting Date 19 August 2026
Last Date 31 August 2026
Official Website www.southindianbank.bank.in

ఏయే పోస్టులు ఉన్నాయంటే? (Post Details):-

South Indian Bank Junior Officer రిక్రూట్మెంట్ కు సంబంధించిన పోస్టుల వివరాలు క్లియర్ గా కింద టేబుల్ లో ఇచ్చాను చెక్ చేసుకోండి:

Post Category Job Role Employment Type
Junior Officer Business Promotion Officer (Target-based sales role) Contract (Initially 3 years, renewable)

Education & Age Details:-

South Indian Bank Junior Officer పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు మరియు ఏజ్ లిమిట్ వివరాలు కింద ఎక్స్ప్లెయిన్ చేశాను చూసుకోండి:

  • విద్యా అర్హత (Qualification): గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి కనీసం డిగ్రీ (Graduation in any stream) పూర్తి చేసి ఉండాలి.
  • వర్క్ ఎక్స్పీరియన్స్: బ్యాంక్ లేదా NBFC (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) లో రిటైల్ అసెట్స్ / లయబిలిటీ ప్రొడక్ట్స్ విభాగంలో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఖచ్చితంగా ఉండాలి.
  • వయోపరిమితి (Age Limit): అభ్యర్థుల వయస్సు 31.07.2026 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. అంటే 01.08.1996 న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి.
  • వయో సడలింపు (Age Relaxation): ఎస్సీ, ఎస్టీ (SC/ST) కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయస్సులో 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
  • గమనిక: గతంలో SIB జూనియర్ ఆఫీసర్ పోస్టుల కోసం ఇంటర్వ్యూ కి వెళ్లి సెలెక్ట్ అవ్వని వారు ఇప్పుడు మళ్లీ అప్లై చేయడానికి అనర్హులు.

Salary Details(జీతం వివరాలు):-

ఈ జాబ్ లో జాయిన్ అవ్వగానే మీకు వచ్చే జీతం మరియు బెనిఫిట్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి ఫ్రెండ్స్:

  • South Indian Bank Junior Officer పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి ఏకంగా రూ. 7.85 లక్షల వరకు (CTC) ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నారు.
  • ఈ ప్యాకేజీలో రూ. 4.49 లక్షలు ఫిక్స్డ్ పే (NPS తో సహా) కాగా, మిగిలిన రూ. 2.88 లక్షలు మీ పనితీరు (Performance) ఆధారంగా వేరియబుల్ పే కింద ఇస్తారు.
  • బ్యాంక్ తరపున పూర్తి ఉచితంగా రూ. 5.25 లక్షల కవరేజ్ తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ (ప్రీమియం రూ. 48,000) సౌకర్యం కూడా ఉంది.
  • ఢిల్లీ, ముంబై, పూణే రీజియన్స్ లో పోస్టింగ్ వస్తే ప్రతి నెలా రూ. 10,000, మరియు అహ్మదాబాద్ లో పోస్టింగ్ వస్తే నెలకు రూ. 5,000 ప్రత్యేక అలవెన్స్ (3 నెలల తర్వాత) అదనంగా చెల్లిస్తారు.
  • అఫీషియల్ ట్రావెల్స్ కి లాడ్జింగ్, హాల్టింగ్ మరియు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా బ్యాంక్ నిబంధనల ప్రకారం వారే భరిస్తారు.

Selection Process(ఎంపిక విధానం):-

South Indian Bank Junior Officer పోస్టులకు ఎలాంటి కష్టమైన రాత పరీక్ష ఉండదు. కాండిడేట్స్ ని పక్కాగా క్రింది ఇచ్చిన 3 దశల్లో ఎంపిక చేస్తారు:

  1. Shortlisting of Applications: ముందుగా మీరు అప్లై చేసిన విధానం, మీ డిగ్రీ మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా అప్లికేషన్స్ ను ఫిల్టర్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు.
  2. Group Discussion (GD): షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. ఇది ఎలిమినేషన్ రౌండ్, ఇందులో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటేనే ఇంటర్వ్యూకి ప్రమోట్ చేస్తారు.
  3. Personal Interview & Psychometric Assessment: ఫైనల్ గా గ్రూప్ డిస్కషన్ లో సెలెక్ట్ అయిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ తో పాటు మీ బిహేవియర్ అంచనా వేసే సైకోమెట్రిక్ టెస్ట్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు.

Syllabus & Preparation Tips:-

South Indian Bank Junior Officer పోస్టులకి సెపరేట్ గా రాత పరీక్ష సిలబస్ అంటూ ఏమీ లేదు, కానీ ఇంటర్వ్యూ మరియు GD క్రాక్ చేయడానికి ఈ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి:

  • బ్యాంకింగ్ రంగానికి సంబంధించి బేసిక్ నాలెడ్జ్, రీసెంట్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్.
  • కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు లీడర్షిప్ క్వాలిటీస్ (ఇది GD లో చాలా ముఖ్యం).
  • ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అమ్మకాలు (Target based Sales) మరియు సేల్స్ ప్రమోషన్ వ్యూహాలు ఎలా ఉండాలో అవగాహన.
  • ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మరియు కస్టమర్లతో ఎలా మాట్లాడాలి అనే సైకోమెట్రిక్ సంబంధిత ప్రశ్నలు.

How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి):-

South Indian Bank Junior Officer పోస్టులకు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశా చూసుకొని అప్లై చేసుకోండి:

  • స్టెప్ 1: ముందుగా SIB అఫీషియల్ వెబ్సైట్ www.southindianbank.bank.in ఓపెన్ చేసి అందులో వున్నా ‘Careers’ పేజీకి వెళ్లండి.
  • స్టెప్ 2: ఆగస్టు 19 నుంచి ఆగస్టు 31 లోపు మాత్రమే అప్లికేషన్ లింక్ యాక్టివ్ గా ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, మరియు వర్క్ ఎక్స్పీరియన్స్ తప్పులు లేకుండా ఫిల్ చేయండి.
  • స్టెప్ 4: వైట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో (50KB లోపు), సిగ్నేచర్ (50KB లోపు) మరియు మీ రెజ్యూమ్ (PDF ఫార్మాట్ లో 1MB లోపు) అప్లోడ్ చేయండి.
  • స్టెప్ 5: ఎటువంటి ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్ గా వివరాలు సరిచూసుకుని సబ్మిట్ కొట్టేసి, ఆ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.

Mandatory Links:-

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు):-

  1. South Indian Bank Junior Officer పోస్టులకు ఎప్పటి లోపు అప్లై చేయాలి?

ఆన్లైన్ అప్లికేషన్స్ ఆగస్టు 19, 2026 న ప్రారంభం అయ్యాయి. అప్లై చేయడానికి ఆఖరి తేదీ ఆగస్టు 31, 2026. వెబ్సైట్ సర్వర్ బిజీ రాకముందే త్వరగా అప్లై చేసుకోండి.

  1. South Indian Bank Junior Officer పోస్టులకు సంబంధించి ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఏజ్ లో రిలాక్సేషన్ ఉంటుందా?

ఉంటుంది, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయస్సు 30 ఏళ్లు కాగా, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

  1. South Indian Bank Junior Officer ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది?

ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ కు అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఏ కేటగిరీ అభ్యర్థులైనా సరే పూర్తి ఉచితంగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

 

🔴Related Post

Leave a Comment