🚀 UPSC EPFO APFC Recruitment 2026 | Degree కి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Published On:

UPSC EPFO

Join WhatsApp

Join Now

ఈ రోజు మనం UPSC EPFO APFC Recruitment 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Hello friends, అందరికీ నమస్కారం, మీరంతా ఎలా ఉన్నారు? mama, సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక మంచి ఆఫీసర్ స్థాయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న  వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఒక అద్భుతమైన అవకాశం మామ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) విభాగంలో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. UPSC EPFO APFC ఉద్యోగం గ్రూప్ A గెజిటెడ్ ఆఫీసర్ (Group A Gazetted) కేటగిరీకి చెందుతుంది కాబట్టి, శాలరీ సూపర్ ఉంటుంది. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, మీలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా అప్లై చేసుకోండి.

కేవలం డిగ్రీ అర్హతతో ఇంత మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే నిజంగా మన అదృష్టమే అని చెప్పాలి. దేశవ్యాప్తంగా ఈసారి మొత్తం 80 ఖాళీలు భర్తీ చేస్తున్నారు, కాంపిటీషన్ ఎలా ఉన్నా సరే మనకు కావాల్సింది ఒకే ఒక్క పోస్ట్ కాబట్టి కాన్ఫిడెంట్ గా ఈ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వండి. అప్లికేషన్ ఫీజు కేవలం ₹25 మాత్రమే (ఆడవారికి, SC/ST, PwBD లకు ఫ్రీ), పైగా ఆన్లైన్ లోనే చాలా సులభంగా మీ మొబైల్ నుండి అప్లై చేసుకోవచ్చు. సో మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కి , అలాగే మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ పోస్ట్ ని తప్పకుండా షేర్ చేయండి, ఈ షేర్ వల్ల ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఈ జాబ్ నోటిఫికేషన్ హెల్ప్ అవ్వచ్చు.

Recruitment Overview:-

Organization Union Public Service Commission (UPSC) – EPFO
Post Name Assistant Provident Fund Commissioner (APFC)
Total Vacancies 80
Qualification Degree (Graduation)
Job Location Across India (Anywhere in India)
Apply Mode Online
Application Starting Date 22nd August 2026
Last Date to Apply 11th September 2026
Official Website upsc.gov.in

Vacancy Details (పోస్టుల వివరాలు):-

UPSC EPFO నోటిఫికేషన్ కి సంబంధించి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో అని కింద టేబుల్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను చెక్ చేసుకోండి:

Category (క్యాస్ట్) Vacancies (ఖాళీలు)
UR (జనరల్) 36
OBC 20
SC 11
EWS 8
ST 5
Total (మొత్తం) 80

Education & Age:-

UPSC EPFO పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధించిన అర్హతలు మరియు వయస్సు యొక్క పూర్తి డీటెయిల్స్ కింద క్లియర్ గా ఇచ్చాను చూసుకోండి:

  • విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ (B.A, B.Com, B.Sc, B.Tech లాంటివి) కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారు ఎలిజిబుల్ కాదు, సర్టిఫికెట్ చేతిలో ఉండాలి.
  • అదనపు అర్హతలు (Desirable): కంపెనీ లా, లేబర్ లా లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో డిప్లొమా ఉంటే ఇంటర్వ్యూలో కొంచెం ప్రాధాన్యత ఇస్తారు (ఇవి లేకపోయినా అప్లై చేయొచ్చు).
  • వయోపరిమితి: నోటిఫికేషన్ చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 35 సంవత్సరాలు దాటకూడదు.
  • వయో సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ (SC), ఎస్టీ (ST) అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ (OBC) అభ్యర్థులకు 3 ఏళ్లు, మరియు వికలాంగులకు (PwBD) 10 ఏళ్ల పాటు వయో సడలింపు వర్తిస్తుంది.

Salary Details(జీతం వివరాలు):- 

  • UPSC EPFO పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ 7వ పే కమిషన్ ప్రకారం లెవెల్-10 (Level-10) లో బేసిక్ పే స్టార్ట్ అవుతుంది.
  • బేసిక్ పే ₹56,100 గా ఉంటుంది. దీనికి అదనంగా కరవు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA), మరియు ట్రావెలింగ్ అలవెన్స్ (TA) అన్నీ కలుపుతారు.
  • చేతికి వచ్చేసరికి నెలకు సుమారుగా ₹90,000 కు పైగానే స్టార్టింగ్ శాలరీ వస్తుంది. ప్రతి ఏటా ఇంక్రిమెంట్స్ కూడా చాలా బాగుంటాయి మామ.

Selection Process(ఎంపిక విధానం):-

UPSC EPFO APFC ఉద్యోగాలకు ఎంపిక విధానం చాలా పారదర్శకంగా మొత్తం 4 దశల్లో జరుగుతుంది:

  1. Recruitment Test (RT): ముందుగా ఆఫ్‌లైన్ పద్ధతిలో 300 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ (MCQ) రాత పరీక్ష నిర్వహిస్తారు. దీనికి 75% వెయిటేజ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ (1/3rd) కూడా ఉంటుంది జాగ్రత్త మామ.
  2. Interview (పర్సనల్ ఇంటర్వ్యూ): రాత పరీక్షలో పాస్ అయిన వారిని 100 మార్కులకు ఢిల్లీలో ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ కి 25% వెయిటేజ్ ఇస్తారు.
  3. Document Verification: ఇంటర్వ్యూ సమయంలోనే మీ ఎడ్యుకేషన్, కాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ అన్నీ ఒరిజినల్స్ వెరిఫై చేస్తారు.
  4. Medical Examination: ఫైనల్ గా సెలెక్ట్ అయిన వారికి బేసిక్ ఫిట్నెస్ కోసం ప్రభుత్వ హాస్పిటల్ లో మెడికల్ టెస్ట్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Syllabus Details(సిలబస్ వివరాలు) :- 

UPSC EPFO కి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ మొత్తం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. సిలబస్ టాపిక్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను చూసుకోండి:

  • జనరల్ ఇంగ్లీష్ (General English) – గ్రామర్ మరియు వొక్యాబులరీ
  • ఇండియన్ కల్చర్, హెరిటేజ్ మరియు ఫ్రీడమ్ మూమెంట్
  • పాపులేషన్, డెవలప్మెంట్ & గ్లోబలైజేషన్
  • ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ (భారత రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ)
  • అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్ (దీనిపై ఎక్కువ ఫోకస్ చేయాలి)
  • ఇన్సూరెన్స్ మరియు బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్
  • జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్
  • ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ & జనరల్ మెంటల్ ఎబిలిటీ

How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి):- 

  • UPSC EPFO పోస్టులకు ముందుగా మీ మొబైల్ లేదా సిస్టం లో UPSC అధికారిక పోర్టల్ upsconline.nic.in ఓపెన్ చేయండి.
  • అక్కడ ‘One Time Registration (OTR)’ లింక్ ద్వారా మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి (ఇదివరకే ఉంటే డైరెక్ట్ గా లాగిన్ అవ్వండి).
  • డాష్ బోర్డ్ లో “UPSC EPFO APFC 2026” అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేసి పార్ట్-1 ఫామ్ తప్పులు లేకుండా నింపండి.
  • పార్ట్-2 లో మీ ఎగ్జామ్ సెంటర్ ఎంచుకుని, అడిగిన సైజులో రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో మరియు సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  • జనరల్ మరియు ఓబీసీ మగ అభ్యర్థులు ₹25 అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ లో పే చేయండి. మిగతా వారికి ఫీజు లేదు.
  • ఫైనల్ గా ఫామ్ సబ్మిట్ చేసి, అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకొని పెట్టుకోవడం మర్చిపోకండి.

Mandatory Links:-

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు):- 

  1. UPSC EPFO ఉద్యోగాలకు మన తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయా?

అవును friends, ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ కాబట్టి మన ఏపీ మరియు తెలంగాణ లోని ముఖ్య నగరాల్లో (హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటివి) ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు.

  1. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నేను ఈ UPSC EPFO ఉద్యోగాలకు అప్లై చేయొచ్చా?

లేదండి, నోటిఫికేషన్ ఆఖరి తేదీ నాటికి మీ చేతిలో డిగ్రీ పాస్ అయిన సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు.

  1. UPSC EPFO పోస్టులకు సంబంధించిన ఎక్సమ్ కి నెగిటివ్ మార్కింగ్ విధానం ఉందా?

అవును మామ, రాత పరీక్షలో తప్పు ఆన్సర్ కి 1/3 వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు తెలిసిన ఆన్సర్స్ మాత్రమే జాగ్రత్తగా పెట్టాలి, గెస్ చేసి పెట్టడం మీకు మంచిది కాదు.

🔴Related Post

Leave a Comment