IOCL Executive Recruitment 2026 నోటిఫికేషన్ కోసం చూస్తున్న అభ్యర్థులుకు ఒక మంచి అప్డేట్. హలో ఫ్రెండ్స్… ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు కొత్త నోటిఫికేషన్ వచ్చా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలతో వచ్చాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి, ముఖ్యంగా ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ చేసిన వారికి ఈ నోటిఫికేషన్ ఒక అద్భుతమైన అవకాశం.
IOCL Executive నోటిఫికేషన్ లో వివిధ విభాగాల్లో మొత్తం 470 ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మంచి ప్యాకేజీ, లైఫ్ సెటిల్ అయ్యే కెరీర్ కావాలి అనుకునే వాళ్ళు ఈ నోటిఫికేషన్ ని అస్సలు మిస్ చేసుకోకండి. మీరు అడిగినట్లుగా ఈ పోస్టుల ఖాళీలు, డీటెయిల్డ్ సిలబస్, సెలక్షన్ ప్రాసెస్, శాలరీ ప్యాకేజీల గురించి కింద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను.ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లై చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి.
Recruitment Overview:-
| Organization | Indian Oil Corporation Limited (IOCL) |
| Post Name | Executive, Diploma Engineers & Officers |
| Total Vacancies | 470 |
| Qualification | B.Tech / BE / Diploma / MBA / PG |
| Job Location | All India |
| Apply Mode | Online |
| Apply Start Date | 05 August 2026 |
| Last Date | 03 September 2026 |
| Official Website | iocl.com |
ఏయే పోస్టులు ఉన్నాయి? (Vacancy Details):-
IOCL Executive నోటిఫికేషన్ కి సంబంధించి ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని కింద టేబుల్ లో డీటెయిల్డ్ గా ఇచ్చాను చెక్ చేసుకోండి:
| Post Name / విభాగం | అర్హత | అంచనా ఖాళీలు |
| Graduate Engineers (Civil, Mech, Electrical, Chemical) | B.Tech / BE | 250 |
| Diploma Engineers (Grade E0) | 3 Years Diploma | 100 |
| Officers (Marketing, HR, Finance) | MBA / PGDM | 90 |
| Law & Quality Control Officers | LLB / M.Sc Chemistry | 30 |
Education & Age(అర్హతలు & వయోపరిమితి):-
IOCL Executive పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధించిన అర్హతలు మరియు వయస్సు యొక్క పూర్తి డీటెయిల్స్ కింద క్లియర్ గా ఇచ్చాను చూసుకోండి:
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్ లేదా బీఈ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్) లో జనరల్/ఓబీసీ అభ్యర్థులు కనీసం 65% మార్కులతో పాస్ అవ్వాలి (SC/ST/PwBD వాళ్ళకి 55% ఉంటే సరిపోతుంది).
- డిప్లొమా ఇంజనీర్లు: సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్ లో మూడేళ్ళ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు కనీసం 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
- ఆఫీసర్ పోస్టులు: మార్కెటింగ్ మరియు హెచ్ఆర్ (HR) పోస్టులకు ఎంబీఏ (MBA), అలాగే లా పోస్టులకు ఎల్.ఎల్.బి (LLB) డిగ్రీ పూర్తయ్యి ఉండాలి.
- వయోపరిమితి: గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా ఇంజనీర్లకు గరిష్ట వయసు 26 ఏళ్లు మించకూడదు. మార్కెటింగ్, లా ఆఫీసర్లకు గరిష్ట వయసు 28 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుంది.
- వయో సడలింపు: రిజర్వేషన్ నిబంధనల ప్రకారం OBC కాండిడేట్స్ కి 3 ఏళ్ళు, SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, PwBD వారికి 10 ఏళ్లు వయో సడలింపు ఖచ్చితంగా ఉంటుంది.
Salary(జీతం వివరాలు):-
- IOCL Executive పోస్టులకు జీతాలు మామూలుగా ఉండవు మామా, సెంట్రల్ గవర్నమెంట్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాకేజీలు ఇస్తారు ఈ జాబ్స్ కి:
- గ్రేడ్ A (ఇంజనీర్లు/ఆఫీసర్లు): బేసిక్ పే ₹50,000 తో మొదలై ₹1,60,000 వరకు పే స్కేల్ ఉంటుంది. వీరికి ఏడాదికి సుమారు ₹18.4 లక్షల CTC అందుతుంది.
- గ్రేడ్ A0 (QC అసిస్టెంట్స్): వీరికి బేసిక్ పే ₹40,000 తో మొదలవుతుంది. ఏడాదికి సుమారు ₹14.8 లక్షల దాకా ప్యాకేజీ ఉంటుంది.
- గ్రేడ్ E0 (డిప్లొమా ఇంజనీర్లు): నెలకు ₹30,000 బేసిక్ పే ఉంటుంది, వార్షిక ప్యాకేజీ ₹11.1 లక్షల వరకు వస్తుంది.
- ఈ బేసిక్ పే తో పాటుగా హెచ్ఆర్ఏ (HRA), ట్రావెలింగ్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీ, పర్ఫార్మెన్స్ బేస్డ్ పే, మరియు అద్భుతమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి మామ.
Selection Process(ఎంపిక విధానం):-
IOCL Executive నోటిఫికేషన్ కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 4 దశలు ద్వారా సెలెక్ట్ చేస్తారు:
- ఆన్లైన్ రాత పరీక్ష (CBT): మొదటగా అప్లై చేసిన వాళ్ళందరికీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (ఆన్లైన్ ఎగ్జామ్) పెడతారు. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- గ్రూప్ డిస్కషన్ (GD) & గ్రూప్ టాస్క్ (GT): షార్ట్ లిస్ట్ అయిన వారికి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, మరియు లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయో చెక్ చేయడానికి ఈ రౌండ్ నిర్వహిస్తారు.
- పర్సనల్ ఇంటర్వ్యూ (PI): చివరగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ని టెస్ట్ చేయడానికి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
- ఫైనల్ మెరిట్ అండ్ మెడికల్: రాత పరీక్షకు 85%, GD/GT కి 5% మరియు PI కి 10% వెయిటేజి ఇచ్చి ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ చేసి జాబ్ ఇస్తారు.
Detailed Syllabus(డీటెయిల్డ్ సిలబస్):-
IOCL Executive పరీక్షకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ కింద ఇచ్చాను చెక్ చేసుకోండి:
- ఈ ఆన్లైన్ పరీక్షలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ టైప్ (MCQ) ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష రాయడానికి 2 గంటల సమయం ఇస్తారు.
- కోర్ సబ్జెక్ట్ (50 మార్కులు): ఇందులో సగం మార్కులు మీ డొమైన్ నాలెడ్జ్ (అంటే మీరు చదివిన సివిల్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ బ్రాంచ్) కి సంబంధించిన డెప్త్ ప్రశ్నలు ఉంటాయి.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & లాజికల్ రీజనింగ్ (30 మార్కులు): మ్యాథ్స్ బేసిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, పజిల్స్, కోడింగ్-డీకోడింగ్, డైరెక్షన్స్ లాంటి జనరల్ రీజనింగ్ ప్రశ్నలు వస్తాయి.
- జనరల్ ఇంగ్లీష్ (20 మార్కులు): బేసిక్ గ్రామర్, ప్యాసేజ్ రీడింగ్, సినానిమ్స్, యాంటోనిమ్స్ లాంటివి అడుగుతారు.
- నెగిటివ్ మార్కింగ్: జాగ్రత్త ఫ్రెండ్స్, ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి గెస్ చేసి ఏది పడితే అది పెట్టకండి.
How to Apply(అప్లై చేయడం ఎలా?):-
- IOCL Executive పోస్టులకు అప్లై చేసుకోవడానికి ముందుగా మీ మొబైల్ లేదా సిస్టమ్ లో అఫీషియల్ వెబ్సైట్ iocl.com ఓపెన్ చేయండి. “Careers” లేదా “Latest Job Openings” సెక్షన్ లోకి వెళ్ళండి.
- అక్కడ “IOCL Executive Recruitment 2026” ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి.
- మీ పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయండి.
- ఇప్పుడు మీకు వచ్చిన ఐడీ, పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేయండి.
- మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, సర్టిఫికెట్స్ ని అడిగిన ఫార్మాట్ లో అప్లోడ్ చేయండి.
- జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లు ₹1000 అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాలి. (SC, ST, PwBD లకు ఫీజు అసలు లేదు).
- ఒకసారి డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఆ ప్రింట్ అవుట్ మీ దగ్గర పెట్టుకోండి.
Mandatory Links:-
- Official Notification PDF: Click Here
- Apply Online Link: Click Here to Apply
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
- WhatsApp Channel: Join Our Channel
- Telegram Channel: Join Our Channel
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):-
1. ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఈ IOCL Executive పోస్టులకు అప్లై చేసుకోవచ్చా?
అవును మామా, ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నాటికి మీరు 65% మార్కులతో పాస్ అయినట్లు ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది.
2. ఏజ్ లిమిట్ లెక్కించడానికి కట్-ఆఫ్ డేట్ ఏది తీసుకుంటారు?
IOCL Executive నోటిఫికేషన్ ప్రకారం వయసు లెక్కించడానికి సెప్టెంబర్ 30, 2026 ని కట్-ఆఫ్ డేట్ గా పరిగణిస్తారు. అంటే ఆ తేదీ నాటికి మీ వయసు గరిష్ట వయోపరిమితి దాటకూడదు.
3. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయా?
ఖచ్చితంగా ఉంటాయి. IOCL Executive నోటిఫికేషన్ ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ కాబట్టి, మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ లాంటి ప్రధాన నగరాల్లో ఆన్లైన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అప్లికేషన్ లో మీరు దగ్గర సెంటర్ ని ఎంచుకోవచ్చు మామ.




