🚀 Bank of Baroda LBO Recruitment 2026 | Graduation కి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Published On:

Bank of Baroda LBO

Join WhatsApp

Join Now

Bank of Baroda LBO Recruitment 2026 కోసం ఎదురుచూస్తున్న బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్‌కి ఈ నోటిఫికేషన్ నిజంగా ఒక అద్భుతమైన అవకాశం మామ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నుంచి భారీ స్థాయిలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి, బ్యాంకింగ్ రంగంలో మంచి జాబ్ కోసం చూస్తున్నారో, వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని మామ.

Bank of Baroda LBO పోస్టులకు అప్లై చేసుకోవడానికి డిగ్రీతో పాటుగా, కనీసం ఒక సంవత్సరం ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి (ఆంధ్రప్రదేశ్ – 80, తెలంగాణ – 50). సో, లోకల్ లాంగ్వేజ్ (తెలుగు) వస్తే చాలు, సొంత రాష్ట్రంలోనే జాబ్ కొట్టొచ్చు. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ పోస్ట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్‌లో ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి, ఆ గ్రూప్స్ లో వున్నా ఎవరికో ఒకరికి కచ్చితంగా హెల్ప్ అవ్వచ్చు!

Recruitment Overview:- 

వివరాలు సమాచారం
Organization Bank of Baroda (BOB)
Post Name Local Bank Officer (LBO)
Total Vacancies 2482 Posts
Qualification Degree / Graduation
Job Location Across India (AP & TS included)
Apply Mode Online
Apply Starting Date 13 ఆగస్టు 2026
Last Date 07 సెప్టెంబర్ 2026
Official Website bankofbaroda.in

State-wise Vacancies Details:- 

Bank of Baroda LBO నోటిఫికేషన్ సంబంధించి ఏ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఉన్నాయో కింద టేబుల్ లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను మామ:

రాష్ట్రం (State) ఖాళీలు (Vacancies)
ఆంధ్రప్రదేశ్ 80
తెలంగాణ 50
కర్ణాటక 150
తమిళనాడు 180
మహారాష్ట్ర 300
గుజరాత్ 250
ఉత్తర ప్రదేశ్ 400
మధ్యప్రదేశ్ 150
రాజస్థాన్ 150
వెస్ట్ బెంగాల్ 100
బీహార్ 80
పంజాబ్ 60
హర్యానా 50
మిగతా రాష్ట్రాలు 482
మొత్తం ఖాళీలు 2482

Education & Age Limit:-

Bank of Baroda LBO జాబ్స్‌కి అప్లై చేసుకోవాలంటే కింద చెప్పిన అర్హతలు పక్కాగా ఉండాలి మామా గుర్తుపెట్టుకోండి:

  • విద్యా అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (Graduation) పాస్ అయి ఉండాలి. అంటే B.A, B.Com, B.Sc, B.Tech లాంటివి ఏదైనా పర్లేదు.
  • అనుభవం (Experience): ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో ఆఫీసర్‌గా కనీసం 1 సంవత్సరం పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. గుర్తుంచుకోండి, క్లరికల్ ఎక్స్‌పీరియన్స్ పరిగణనలోకి తీసుకోరు చూసుకోండి.
  • భాషా ప్రావీణ్యం: మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్ర స్థానిక భాష (తెలుగు) చదవడం, రాయడం మరియు మాట్లాడటం వచ్చి ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ మామ.
  • వయోపరిమితి (Age Limit): 01 ఆగస్టు 2026 నాటికి మీ వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • వయో సడలింపు: నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు (అంటే 35 ఏళ్ల వరకు), ఓబీసీలకు 3 ఏళ్లు (అంటే 33 ఏళ్ల వరకు), పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

Salary Details(జీతం వివరాలు):-

Bank of Baroda LBO జాబ్స్‌కి శాలరీ మిమ్మల్ని కచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా హై ప్యాకేజీనే ఆఫర్ చేస్తోంది.

  • ప్రారంభ బేసిక్ పే ₹48,480/- గా ఉంటుంది.
  • స్కేల్ ప్రకారం ₹48,480 నుంచి ₹85,920 వరకు పే స్కేల్ వర్తిస్తుంది. అంటే మీ బేసిక్ పే ₹48,480 తో స్టార్ట్ అయ్యే, రిటైర్మెంట్ టైమ్ కి ₹85,920 వరకు పెరుగుతుంది అన్నమాట.
  • దీనికి తోడుగా డీఏ (Dearness Allowance), హెచ్‌ఆర్‌ఏ (House Rent Allowance), మరియు ఇతర బ్యాంక్ అలవెన్సులు (లైక్ మెడికల్, ట్రావెల్ వగైరా) అన్ని  కలుపుకుంటే స్టార్టింగ్ లోనే చేతికి కనీసం ₹70,000 కు పైగానే శాలరీ వస్తుంది.అందుకే  ఈ జాబ్స్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు మామా!

Selection Process(ఎంపిక విధానం):-

Bank of Baroda LBO జాబ్స్‌కి సెలక్షన్ ప్రాసెస్ చాలా క్లియర్‌గా ఉంటుంది. కింద వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను.ఈ జాబ్స్ కి 4 దశల ద్వారా ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ చేసుకుంటూ వెళ్లాలి.

  1. Online Test (ఆన్‌లైన్ పరీక్ష): ముందుగా అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.
  2. Language Proficiency Test (LPT): 10వ తరగతి లేదా 12వ తరగతిలో లోకల్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్టుగా చదవని వారికి మాత్రమే ఈ స్థానిక భాషా పరీక్ష (ఉదాహరణకు తెలుగు) నిర్వహిస్తారు.
  3. Psychometric Test / Group Discussion (GD): ఆన్‌లైన్ టెస్ట్ పాస్ అయిన వారిని తర్వాత రౌండ్ కి పిలుస్తారు. బ్యాంక్ అవసరాన్ని బట్టి సైకోమెట్రిక్ టెస్ట్ లేదా గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఇందులో మీ పర్సనాలిటీని, కమ్యూనికేషన్ స్కిల్స్ ని చెక్ చేస్తారు.
  4. Personal Interview (పర్సనల్ ఇంటర్వ్యూ): చివరగా పై రౌండ్స్ క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడే మీ సబ్జెక్ట్ నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ ని ఫైనల్ గా టెస్ట్ చేసి, సెలెక్ట్ చేస్తారు.

Syllabus Pattern(సిలబస్ వివరాలు):-

Bank of Baroda LBO జాబ్స్‌కి సంబంధించిన సిలబస్ ప్యాట్రన్ కింద ఇచ్చాను. చెక్ చేసుకోండి:

  • Reasoning and Computer Aptitude: 50 ప్రశ్నలు, 50 మార్కులు. (టైమ్: 45 నిమిషాలు)
  • General/Economy/Banking Awareness: 50 ప్రశ్నలు, 50 మార్కులు. (టైమ్: 45 నిమిషాలు)
  • Data Analysis & Interpretation (Quantitative Aptitude): 50 ప్రశ్నలు, 50 మార్కులు. (టైమ్: 45 నిమిషాలు)
  • English Language: 40 ప్రశ్నలు, 40 మార్కులు. (టైమ్: 35 నిమిషాలు)

How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి):-

Bank of Baroda LBO జాబ్స్‌కి అప్లై చేసుకోవడం చాలా సింపుల్. కింద ఇచిన స్టెప్స్ ని ఫాలో అవ్వండి:

  • ముందుగా బ్యాంక్ అఫీషియల్ వెబ్‌సైట్ bankofbaroda.in ఓపెన్ చేయండి.
  • అందులో “Careers” సెక్షన్ కింద “Current Opportunities” లోకి వెళ్ళండి
  • “Recruitment of Local Bank Officer (LBO) 2026” లింక్ పైన క్లిక్ చేసి, “Apply Now” మీద ప్రెస్ చేయండి.
  • మీరు మొదటిసారి అప్లై చేస్తుంటే “New Registration” ద్వారా మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి. మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మీ మెయిల్ కి వస్తాయి.
  • ఆ తర్వాత ఆ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి, అప్లికేషన్ ఫామ్ నింపండి. ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ గా ఫిల్ చేయండి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ (మీ ఫోటో, సిగ్నేచర్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్, లెఫ్ట్ తంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్) నోటిఫికేషన్ లో చెప్పిన సైజ్ ప్రకారం అప్‌లోడ్ చేయండి.
  • చివరిగా మీ కేటగిరీని బట్టి ఫీజు (General/OBC/EWS – ₹850, SC/ST/Women/PwBD – ₹175) ఆన్‌లైన్‌లో పే చేసి ఫామ్ సబ్‌మిట్ చేయండి. అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోకండి!

Important Links:-

Bank of Baroda LBO జాబ్స్‌కి కింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి నోటిఫికేషన్ క్లియర్ గా చదివి, అప్లై చేసుకోండి

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు):-

  1. Bank of Baroda LBO జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?

Bank of Baroda LBO పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవడానికి చివరి తేదీ 07 సెప్టెంబర్ 2026. లాస్ట్ మినిట్ సర్వర్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే అప్లై చేసుకోండి మామా!

  1. ఫ్రెషర్స్ ఈ  Bank of Baroda LBO పోస్టులకు అప్లై చేసుకోవచ్చా?

లేదు, Bank of Baroda LBO పోస్టులకు కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో ఆఫీసర్‌గా కనీసం 1 సంవత్సరం పని చేసిన అనుభవం ఉంటేనే మీరు ఈ జాబ్స్ కి ఎలిజిబుల్.

  1. మన ఏపీ, తెలంగాణలో పోస్టింగ్ ఉంటుందా?

కచ్చితంగా ఉంటుంది! ఏపీలో 80 మరియు తెలంగాణలో 50 ఖాళీలు ఉన్నాయి. మీకు లోకల్ లాంగ్వేజ్ (తెలుగు) బాగా వస్తే చాలు, మన రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్!

🔴Related Post

Leave a Comment