ISRO ICRB Recruitment 2026 కి సంబంధించి డిగ్రీ అర్హతతో ఏకంగా 267 ఖాళీల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. Hello friends, అందరూ ఎలా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రో (ISRO) లో జాబ్ సాధించాలనే డ్రీమ్ అందరికీ ఉంటుంది అలాంటి అవకాశం కూడా చాలా అరుదుగా వస్తుంది కదా ఈ నోటిఫికేషన్ అలాంటిదే మామ.ఈ ISRO ICRB నోటిఫికేషన్ ఇస్రో లో పని చేయడానికి మంచి అవకాశం మామ. ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (JPA), మరియు స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులు వున్నాయ్.
ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి మంచి గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ మామ. ఈ జాబ్ కి వయస్సు ఎంత ఉండాలి, విద్యార్హతలు, శాలరీ, ఎగ్జామ్ పాటర్న్ ఎలా ఉంటుంది అనే పూర్తి డీటెయిల్స్ ఈ పోస్ట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. మీరు అప్లై చేయడం తో పాటు, ఈ ISRO ICRB నోటిఫికేషన్ వివరాలను కచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం మర్చిపోకండి.
Recruitment Overview:-
| Organization | Indian Space Research Organisation (ISRO) |
| Post Name | Assistant, UDC, JPA, Stenographer |
| Total Vacancies | 267 |
| Qualification | డిగ్రీ (Graduation) |
| Job Location | Across India |
| Apply Mode | Online |
| Apply Start Date | 01 ఆగస్టు 2026 |
| Last Date | 20 ఆగస్టు 2026 |
| Official Website | www.isro.gov.in |
Vacancy Details (ఏయే పోస్టులు ఉన్నాయంటే):-
ISRO ICRB నోటిఫికేషన్ లో ఏ ఏ పోస్టులు ఉన్నాయో కింది టేబుల్ లో ఇచ్చాను చెక్ చేసుకోండి:
| క్రమ సంఖ్య | పోస్టు పేరు (Post Name) |
| 1 | Assistant (అసిస్టెంట్) |
| 2 | Upper Division Clerk (UDC) |
| 3 | Junior Personal Assistant (JPA) |
| 4 | Stenographer (స్టెనోగ్రాఫర్) |
Education & Age Limit (అర్హతలు & వయస్సు):-
ISRO ICRB పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధించిన అర్హతలు మరియు వయస్సు యొక్క పూర్తి డీటెయిల్స్ కింద క్లియర్ గా ఇచ్చాను చూసుకోండి:
- Assistant & UDC: మీరు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60% మార్కులు (లేదా 6.32 CGPA) తో ఏదైనా డిగ్రీ (B.A, B.Com, B.Sc, B.Tech ఇలా ఏదైనా) పాస్ అయి ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ పైన బేసిక్ నాలెడ్జ్ కచ్చితంగా ఉండాలి.
- JPA & Stenographer: ఈ పోస్టులకు కూడా డిగ్రీ లో 60% మార్కులు ఉండాలి. దీనికి అదనంగా ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ లో నిమిషానికి 60 పదాలు (60 WPM) టైప్ చేసే స్పీడ్ ఉండాలి. లేదా కమర్షియల్ / సెక్రటేరియల్ ప్రాక్టీస్ లో డిప్లొమా చేసి, కనీసం ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్న సరే అప్లై చేసుకోవచ్చు.
- Age Limit: అప్లై చేసుకునే టైమ్ కి (20 ఆగస్టు 2026 కి) జనరల్ మరియు EWS అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
- Age Relaxation: గవర్నమెంట్ రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఓబీసీ (OBC) వాళ్లకు 3 ఏళ్లు, అలాగే ఎస్సీ, ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు 5 ఏళ్లు వయో సడలింపు వర్తిస్తుంది.
Salary Details (జీతం వివరాలు):-
- ISRO ICRB పోస్టులు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి స్టార్టింగ్ శాలరీస్ చాలా బాగుంటాయి మామ. ఈ జాబ్ సెలెక్ట్ అయిన వారికి 7th Pay Commission ప్రకారం Pay Level 4 వర్తిస్తుంది.
- ట్రైనింగ్ సమయంలోనే మీ బేసిక్ శాలరీ ₹25,500/- గా ఉంటుంది.
- దీనికి అదనంగా కరువు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA), ప్రయాణ భత్యం (TA) లాంటి సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సులు అన్ని కలుపుకుంటే, మొదటి నెలలోనే నెలకు సులభంగా ₹40,000 కు పైగా చేతికి వస్తుంది.
- మామ ఇంత మంచి ప్యాకేజీ తో ఇస్రో లాంటి సంస్థలో జాబ్ అంటే మీ లైఫ్ సెటిల్ అయినట్లే!
Selection Process (ఎంపిక విధానం):-
ISRO ICRB నోటిఫికేషన్ కి సంబంధించి సెలక్షన్ చాలా సింపుల్ గా రెండు రౌండ్స్ ద్వారా సెలెక్ట్ చేస్తారు:
- Written Exam (రాత పరీక్ష): ఫస్ట్ దరఖాస్తు చేసుకున్న వారందరికీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) లేదా ఆఫ్లైన్ లో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ పెడతారు. ఇందులో క్వాలిఫై అవ్వాలి.
- Skill Test (స్కిల్ టెస్ట్): రిటెన్ ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకున్న వారిని పోస్టును బట్టి 1:5 రేషియోలో స్కిల్ టెస్ట్ కి పిలుస్తారు. అసిస్టెంట్, UDC పోస్టులకు కంప్యూటర్ లిటరసీ టెస్ట్ పెడతారు. అలాగే JPA, స్టెనో పోస్టులకు స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. ఫైనల్ గా జాబ్ మాత్రం స్కిల్ టెస్ట్ పాస్ అయిన వారి రాత పరీక్ష మార్కుల ఆధారంగానే ఇస్తారు.
Exam Syllabus (పరీక్ష సిలబస్):-
- Assistant & UDC: మొత్తం 200 మార్కులకు ISRO ICRB ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లీష్ (50), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (50), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ / మ్యాథ్స్ (50), మరియు జనరల్ అవేర్నెస్ (50) ప్రశ్నలు ఉంటాయి. ఎగ్జామ్ సమయం 120 నిమిషాలు.
- JPA & Stenographer: ఈ పేపర్ 200 మార్కులకు కాకుండా కొంచెం వేరే ప్యాట్రన్ లో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచే 100 ప్రశ్నలు అడుగుతారు. ఇక రీజనింగ్ నుంచి 50, జనరల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి.
- నెగిటివ్ మార్కింగ్: గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రతి తప్పు సమాధానానికి 0.25 (1/4th) నెగటివ్ మర్క్స్ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ పక్కాగా తెలిస్తేనే అటెంప్ట్ బెటర్.
How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి):-
- ISRO ICRB పోస్టులకు అప్లై చేసుకోవడానికి మొదటగా మీ మొబైల్ లేదా లాప్టాప్ లో ఇస్రో అఫీషియల్ వెబ్సైట్ (www.isro.gov.in) ఓపెన్ చేయండి.
- అక్కడ కెరీర్స్ (Careers) అనే పేజీలో ఉన్న “ISRO ICRB Recruitment 2026” ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి.
- మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇచ్చి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ మొత్తం స్పెల్లింగ్ తప్పులు లేకుండా ఫిల్ చేయండి.
- తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ మరియు డిగ్రీ మార్క్స్ మెమోను వాళ్ళు అడిగిన సైజులో అప్లోడ్ చేయండి.
- చివరిగా జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు ₹500 అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేసి. ఫైనల్ గా అంతా చెక్ చేసుకొని అప్లికేషన్ ను సబ్మిట్ చేసి ప్రింట్ తీసి జాగ్రత్తగా పెట్టుకోండి.
Mandatory Links:-
- Official Notification PDF: Click Here
- Apply Online Link: Click Here to Apply
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
- WhatsApp Channel: Join Our Channel
- Telegram Channel: Join Our Channel
FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు):-
1.ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ ISRO ICRB జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చా?
లేదు ఫ్రెండ్స్, దరఖాస్తు చేయడానికి ఉన్న లాస్ట్ డేట్ (20 ఆగస్టు 2026) నాటికి మీ చేతిలో డిగ్రీ సర్టిఫికెట్ లేదా ఫైనల్ రిజల్ట్స్ కచ్చితంగా ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ కారు.
2.ISRO ICRB ఎగ్జామ్ తెలుగులో రాసుకోవచ్చా లేదా ఇంగ్లీష్ లోనే ఉంటుందా?
సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి క్వశ్చన్ పేపర్ డిఫాల్ట్ గా ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. మనం ఇంగ్లీష్ మీడియం లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, తెలుగు ఆప్షన్ ఉండదు.
3.ఫీజు ₹500 కట్టాలి కదా, అది తిరిగి రిఫండ్ వస్తుందని విన్నాను నిజమేనా?
అవును ఫ్రెండ్స్! మొదట అప్లై చేసేటప్పుడు అందరూ ₹500 ఆన్లైన్ లో కట్టాల్సిందే. కానీ మీరు రాత పరీక్షకు (Exam) హాజరైన తర్వాత, జనరల్/OBC అభ్యర్థులకు ₹400 రిఫండ్ వస్తుంది. ఇక మహిళలు, SC/ST, PWD అభ్యర్థులకు అయితే మొత్తం ₹500 నేరుగా మీ అకౌంట్లోకే వెనక్కి వచ్చేస్తుంది.





