🚀 SBI Clerk Recruitment 2026 | డిగ్రీ కి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Published On:

sbi clerk Recruitment

Join WhatsApp

Join Now

దేశవ్యాప్తంగా బ్యాంకు జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు గుడ్ న్యూస్ మామ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI Clerk Recruitment 2026 కి సంబంధించి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. Hello mama, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మీ కోసం ఒక సూపర్ గవర్నమెంట్ బ్యాంక్ జాబ్ అప్డేట్ తో మీ ముందుకు తీసుకొచ్చా. ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన SBI లో ఏకంగా 9124 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ అఫీషియల్ గా స్టార్ట్ అయ్యాయి.

కేవలం ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు,ఈ SBI Clerk జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు . ఎప్పటినుంచో బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. అసలు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వయస్సు ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది లాంటి కంప్లీట్ డీటెయిల్స్ కింద చాలా స్పష్టంగా ఇచ్చాను. మీ ఫ్యామిలీలో లేదా మీ ఫ్రెండ్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉంటే కచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయండి, ఎవరికో ఒకరికి ఇది కచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఓకేనా!

Recruitment Overview:-

వివరాలు (Field) సమాచారం (Details)
Organization State Bank of India (SBI)
Post Name Junior Associate (Customer Support & Sales)
Total Vacancies 9,124 Posts
Qualification Any Graduation (Degree)
Job Location Across India
Apply Mode Online
Application Start Date 11 August 2026
Last Date to Apply 31 August 2026
Official Website sbi.bank.in

Vacancy Details (ఏ ఏ పోస్టులు ఉన్నాయి):-

SBI Clerk Recruitment నోటిఫికేషన్ లో కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ (Clerk) కేటగిరీలో టోటల్ గా 9124 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులును రెండు రకాలుగా విభజించారు మామ:

Vacancy Type Number of Posts
Regular Vacancies (రెగ్యులర్ ఖాళీలు) 7,680
Backlog Vacancies (పాత బ్యాక్‌లాగ్ ఖాళీలు) 1,444
Total Vacancies (మొత్తం ఖాళీలు) 9,124

Education & Age Limit :- 

SBI Clerk Recruitment పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధించిన అర్హతలు మరియు వయస్సు యొక్క పూర్తి డీటెయిల్స్ కింద క్లియర్ గా ఇచ్చాను చూసుకోండి:

  • విద్యార్హత (Education): మీరు ఏ గ్రూప్ లో అయినా సరే ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (B.A, B.Com, B.Sc, B.Tech లాంటివి) పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నా కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా SBI Clerk జాబ్ కి అప్లై చేసుకోవచ్చు (కానీ 31 డిసెంబర్ 2026 లోపు పాస్ అయినట్లు ప్రూఫ్ చూపించాలి).
  • స్థానిక భాష (Local Language): మీరు ఏ స్టేట్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్ర అధికారిక భాష (ఉదాహరణకు మన ఏపీ, తెలంగాణా అయితే తెలుగు) స్పష్టంగా చదవడం, రాయడం మరియు మాట్లాడటం రావాలి.
  • వయస్సు పరిమితి (Age Limit): అభ్యర్థుల వయస్సు 01 ఏప్రిల్ 2026 నాటికి మినిమమ్ 20 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు మాక్సిమం 28 సంవత్సరాలు దాటకూడదు.
  • వయో సడలింపు (Age Relaxation): గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ (SC), ఎస్టీ (ST) అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ (OBC) అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగులకు (PwBD) 10 నుండి 15 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

Salary Details(జీతం వివరాలు):-

  • ప్రారంభ వేతనం (Starting Salary): SBI Clerk Recruitment జాబ్ లో జాయిన్ అవ్వగానే మీ బేసిక్ పే ₹26,730 తో స్టార్ట్ అవుతుంది మామ. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ మొదటి నుంచే యాడ్ చేస్తారు.
  • పే స్కేల్ రేంజ్ (Pay Scale): అఫీషియల్ స్కేల్ ₹24,050/- తో మొదలై ₹64,480/- వరకు ఇంక్రిమెంట్స్ తో పెరుగుతూ వెళ్తుంది.
  • కటింగ్స్ పోను చేతికి (In-Hand Salary): బేసిక్ పే కి అదనంగా డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ (HRA), సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ లాంటివి అన్నీ కలుపుకుని మీరు పని చేసే సిటీ ని బట్టి మొదటి నెల నుంచే సుమారు ₹45,000 నుండి ₹48,000 వరకు శాలరీ నెలకు చేతికి వస్తుంది.

Selection Process(ఎంపిక విధానం):-

బ్యాంక్ జాబ్స్ అనగానే ఇంటర్వ్యూ ఉంటుందేమో అని చాలామంది భయపడతారు, కానీ ఈ SBI Clerk Recruitment జాబ్స్ కి ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. సెలక్షన్ ప్రాసెస్ మొత్తం మూడు దశల్లో జరుగుతుంది:

  1. ప్రిలిమ్స్ ఎగ్జామ్ (Preliminary Exam): ముందుగా ఆన్‌లైన్ లో 100 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫైయింగ్ రౌండ్ మాత్రమే, ఈ మార్కులను ఫైనల్ జాబ్ కి కలపరు.
  2. మెయిన్స్ ఎగ్జామ్ (Main Exam): ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి 200 మార్కులకు అసలైన మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మీరు తెచ్చుకున్న స్కోర్ ఆధారంగానే మెరిట్ లిస్ట్ తీసి జాబ్ ఇస్తారు. కట్-ఆఫ్ మార్క్స్ దాటితే జాబ్ మీ సొంతం అయినట్టే.
  3. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (Language Test): టెన్త్ క్లాస్ లేదా ఇంటర్ మార్క్స్ మెమో లో తెలుగు ఒక సబ్జెక్టుగా చదివినట్లు ఉంటే ఈ టెస్ట్ రాయక్కర్లేదు. లేదంటే మాత్రం ఫైనల్ సెలక్షన్ కి ముందు మీకు తెలుగు లాంగ్వేజ్ వచ్చా లేదా అని చిన్న టెస్ట్ పెడతారు.

Syllabus Information(సిలబస్ వివరాలు):-

SBI Clerk Recruitment జాబ్స్ కి సంబంధించిన సిలబస్ కింద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను చేసుకోండి ఒకసారి: 

  • ప్రిలిమ్స్ సిలబస్: ఇందులో కేవలం 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ (30 మార్కులు), రీజనింగ్ (35 మార్కులు) మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/మ్యాథ్స్ (35 మార్కులు). టైమ్ గంట మాత్రమే ఉంటుంది కాబట్టి స్పీడ్ చాలా ముఖ్యం. 1/4th నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది సుమా.
  • మెయిన్స్ సిలబస్: జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (50 మార్కులు), జనరల్ ఇంగ్లీష్ (40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు), మరియు రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (60 మార్కులు). మొత్తం 190 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి, టైమ్ 2 గంటల 40 నిమిషాలు.

How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి) :- 

  • SBI Clerk Recruitment జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ముందుగా మీ మొబైల్ లేదా సిస్టమ్ లో ఎస్‌బీఐ అఫీషియల్ వెబ్‌సైట్ sbi.bank.in/web/careers ని ఓపెన్ చేయండి.
  • అక్కడ “Current Openings” లో “Recruitment of Junior Associates” అనే లింక్ వెతికి దానిపై ఉన్న “Apply Online” అనే బటన్ ఉంటుంది దానిని క్లిక్ చేయండి.
  • తర్వాత కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళు “Click here for New Registration” బటన్ మీద నొక్కి మీ పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి.
  • ఆ తర్వాత లాగిన్ అయ్యి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసి, ఫోటో, సిగ్నేచర్ మరియు లెఫ్ట్ తంబ్ ఇంప్రెషన్ (Left Thumb Impression) ని క్లియర్ గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
  • చివరగా ఫీజు (జనరల్, ఓబీసీ లకు ₹750, మిగతా వారికి ఫ్రీ) ఆన్‌లైన్‌లో కట్టి అప్లికేషన్ ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి.

Mandatory Links:-

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు):-

1. SBI Clerk Recruitment 2026 కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?

ఆల్రెడీ అప్లికేషన్స్ ఆగస్టు 11, 2026 నుంచి స్టార్ట్ అయిపోయాయి, లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 31, 2026 వరకు. చివరి నిమిషంలో సర్వర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి.

2. ఏ ఏ స్టేట్స్ వాళ్ళు SBI Clerk Recruitment నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు?

ఇది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు ఏ స్టేట్ కి అప్లై చేస్తే, ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ (తెలుగు, హిందీ, కన్నడ లాగా) కచ్చితంగా వచ్చి ఉండాలి గుర్తుపెట్టుకోండి.

3. ఇంటర్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చా?

లేదండి, బ్యాంక్ జాబ్స్ కి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. కాబట్టి ఇంటర్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ కారు, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటేనే ఈ SBI Clerk Recruitment నోటిఫికేషన్ కి అప్లై చేసుకోగలరు ఫ్రెండ్స్.

🔴Related Post

Leave a Comment