AAI Junior Executive Recruitment 2026 ద్వారా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించే ఛాన్స్ మామ. హలో ఫ్రెండ్స్.. ఎలా ఉన్నారు? మీ అందరు కోసం ఒక అదిరిపోయే జాబ్ అప్‌డేట్ పట్టుకొచ్చా మామా. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫీసుల్లో మొత్తం 389 మేనేజర్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, లాంటి కోర్సులు పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మామ కనుక ఫ్రెషర్స్ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ ని అస్సలు మిస్ అవ్వదు.
AAI Junior Executive జీతాలు అయితే ఊహించని రేంజ్‌లో ఉంటాయ్ మామా, నెలకు దాదాపు లక్ష రూపాయలకు పైగానే ప్యాకేజీలు ఉంటాయ్.ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో క్లియర్ గా ఇచ్చాను. సో నీతో పాటు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ పోస్ట్ ని తప్పకుండా షేర్ చేయండి, వాళ్లకి కూడా చాలా యూజ్ అవ్వచ్చు కదా!
Vacancy Details (ఏయే పోస్టులు ఉన్నాయంటే?) :-
AAI Junior Executive నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అయిన పోస్టుల వివరాలు కింద టేబుల్ ఇచ్చాను చెక్ చేసుకోండి:
| Post Name (పోస్టు పేరు) | Total Vacancies (ఖాళీలు) |
| Manager (మేనేజర్) | 260 |
| Junior Executive (జూనియర్ ఎగ్జిక్యూటివ్) | 129 |
| Total (మొత్తం ఖాళీలు) | 389 |
Recruitment Overview :-
| Organization | Airports Authority of India (AAI) |
| Post Name | Manager & Junior Executive |
| Total Vacancies | 389 |
| Qualification | Degree, B.E/B.Tech, MBA, Law |
| Job Location | All Over India |
| Apply Mode | Online (Start: 08-08-2026) |
| Last Date | 07-09-2026 |
| Official Website | www.aai.aero |
Education & Age :-
AAI Junior Executive నోటిఫికేషన్ కి సంబంధించి ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ డీటెయిల్స్ కింద క్లియర్ గా ఇచ్చాను చెక్ చేసుకోండి:
- విద్యా అర్హతలు (జూనియర్ ఎగ్జిక్యూటివ్): ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలంటే రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ (B.Sc) తో పాటు ఎంబీఏ (MBA) చేసి ఉండాలి, లేదా సివిల్, ఎలక్ట్రికల్, ఐటీ, తదితర బ్రాంచ్ లో బీఈ/బీటెక్ (B.E/B.Tech) పాస్ అయి ఉండాలి. దీనికి ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అడగలేదు, కాబట్టి ఫ్రెషర్స్ కి చాలా యూస్ అవుతుంది.
- విద్యా అర్హతలు (మేనేజర్): మేనేజర్ కేటగిరీ పోస్టులకు మాత్రం బీటెక్, ఎంబీఏ, లా, లేదా ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్స్ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా, సంబంధిత ఫీల్డ్‌లో 3 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కచ్చితంగా ఉండి తీరాలి.
- వయోపరిమితి (Age Limit): అప్లికేషన్ లాస్ట్ డేట్ (సెప్టెంబర్ 7, 2026) నాటికి వయస్సు లెక్కిస్తారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కి గరిష్ట వయస్సు 27 ఏళ్లు, మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు దాటకూడదు.
- ఏజ్ రిలాక్సేషన్: గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మామ. ఎస్సీ, ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ (OBC-NCL) వాళ్లకు 3 సంవత్సరాలు, వికలాంగులకు (PwBD) 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
Salary Details(జీతం వివరాలు) :-
- మామ, AAI Junior Executive నోటిఫికేషన్ కి సంబంధించి జీతాలు తెలిస్తే నిజంగా మతిపోతుంది.ఎందుకంటే బేసిక్ పే తో పాటు డీఏ (DA), హెచ్‌ఆర్‌ఏ (HRA), సీపీఎఫ్ (CPF), మెడికల్ బెనిఫిట్స్ లాంటి సూపర్ అలవెన్సులు ఉంటాయి.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ శాలరీ: ఈ పోస్టులకు నెలకు ₹40,000 నుంచి ₹1,40,000 పే స్కేల్ వస్తుంది. అన్ని అలవెన్సులు కలుపుకుని ఏడాదికి దాదాపు ₹14 లక్షల ప్యాకేజీ ఉంటుంది.
- మేనేజర్ శాలరీ: మేనేజర్ పోస్టులకు సెలెక్ట్ అయితే ₹60,000 నుంచి ₹1,80,000 పే స్కేల్ ఉంటుంది. దీనికి ప్యాకేజీ ఏడాదికి సుమారు ₹21 లక్షల వరకు ఇస్తున్నారు. ఇలాంటి జీతాలు బయట ప్రైవేటు కంపెనీల్లో కూడా రావడం కష్టమే మామ!
Selection Process(ఎంపిక విధానం) :-
ఈ AAI Junior Executive పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ చాలా పారదర్శకంగా పోస్టును బట్టి మొత్తం ఐదు స్టెప్స్ ఉంటాయ్:
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (Computer Based Test): దరఖాస్తు చేసుకున్న వాళ్లందరికీ ముందుగా ఆన్‌లైన్‌లో కామన్ గా (CBT) ఆబ్జెక్టివ్ రాత పరీక్ష పెడతారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification): ఎగ్జామ్ లో కట్-ఆఫ్ మార్కులు తెచ్చుకున్న వాళ్లను సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.
- ఇంటర్వ్యూ (Interview – For Managers Only): మేనేజర్ పోస్టులకు అప్లై చేసే వారికి మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఈ రౌండ్ ఉండదు.
- ఫిజికల్ / డ్రైవింగ్ టెస్ట్: కేవలం ఫైర్ సర్వీసెస్ (Fire Services) విభాగానికి అప్లై చేసే కాండిడేట్స్ కి మాత్రమే ఫిజికల్ ఎండ్యూరెన్స్ మరియు డ్రైవింగ్ టెస్టులు కండక్ట్ చేస్తారు. మిగతా పోస్టులకు ఇది అవసరం లేదు.
- మెరిట్ లిస్ట్ & పోస్టింగ్: ఈ దశలన్నీ దాటిన తర్వాత ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఫైనల్ లిస్ట్ తీసి జాయినింగ్ లెటర్ ఇస్తారు.
Syllabus(సిలబస్) :-
AAI Junior Executive ఆన్లైన్ ఎగ్జామ్ కి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ ప్యాట్రన్ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ కింది సెక్షన్స్ ఉంటాయి:
- జనరల్ పార్ట్ (Part-A): ఈ సెక్షన్ లో అన్ని పోస్టులకి కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ ఆప్టిట్యూడ్ (మ్యాథ్స్ బేసిక్స్), మరియు జనరల్ అవేర్‌నెస్ (GK & కరెంట్ అఫైర్స్) నుంచి ప్రశ్నలు వస్తాయి.
- ఇంగ్లీష్ లాంగ్వేజ్: బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్, కాంప్రహెన్షన్ మరియు వొకాబులరీ పైన కొంచెం ఫోకస్ చేయాలి. ఇక్కడ ఈజీగా మార్కులు స్కోర్ చేయవచ్చు.
- సబ్జెక్ట్ నాలెడ్జ్ (Part-B): మీరు ఏ పోస్టుకి అయితే అప్లై చేస్తారో ఆ స్పెషలైజేషన్ (సివిల్, ఐటీ, ఫైనాన్స్, లా మొ..) కి సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ తో టెక్నికల్ ప్రశ్నలు ఉంటాయి. మీ డిగ్రీ బుక్స్ బాగా రివిజన్ చేసుకోండి.
How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి) :-
- AAI Junior Executive పోస్టులకు అప్లై చేసుకోవడానికి ముందుగా మీ మొబైల్ లేదా సిస్టమ్‌లో AAI అఫీషియల్ వెబ్‌సైట్ “www.aai.aero” ఓపెన్ చేయండి.
- అక్కడ “Careers” అనే ఆప్షన్ లోకి వెళ్లి, “Recruitment of Managers and Junior Executives” అనే నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి.
- మీ యాక్టివ్ ఈమెయిల్ ఐడి మరియు మీ మొబైల్ నెంబర్ తో ప్రాథమిక రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తాయి.
- ఆ వివరాలతో లాగిన్ అయి, అప్లికేషన్ ఫామ్‌లో మీ పర్సనల్, ఎడ్యుకేషన్ వివరాలన్నీ ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేయండి.
- తర్వాత మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం (Signature) స్కాన్ చేసి కరెక్ట్ సైజులో అప్‌లోడ్ చేయండి.
- ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు ₹1000 ఉంటుంది, ఇది ఆన్‌లైన్‌లో పే చేయాలి. (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మరియు మహిళా అభ్యర్థులకు అసలు ఫీజు లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు!).
- చివరిగా మొత్తం ఫార్మ్ ఒకసారి చెక్ చేసుకుని “Submit” చేయండి. ప్రింట్ అవుట్ తీసుకొని మీ దగ్గర సేఫ్ గా పెట్టుకోవడం అసలు మర్చిపోవద్దు.
Mandatory Links:-
- Official Notification PDF: Download Here
- Apply Online Link: Click Here
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
- WhatsApp Channel join link: Join Our Channel
- Telegram Channel join link: Join Our Channel
FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు) :-
- AAI Junior Executive పోస్టులకు ఎక్స్పీరియన్స్ ఎం అయిన అడిగారా మామ?
లేదు మామ, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Junior Executive) పోస్టులకు అసలు అనుభవం అవసరం లేదు. నోటిఫికేషన్ లో చెప్పిన డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే చాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ప్రెషర్ గానే ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ పోస్టులకు మాత్రమే 3 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అడిగారు.
- AAI Junior Executive పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?
ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆగస్టు 8, 2026 నాడే స్టార్ట్ అయిపోయాయి. AAI Junior Executive పోస్టులకు అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 7, 2026 చివరి తేదీ. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే వెబ్‌సైట్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది, సో ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా అప్లై చేసుకోండి.
- ఎగ్జామ్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా బ్రో?
ఇదే మనకు అసలైన ప్లస్ పాయింట్ మామ! ఈ AAI Junior Executive Exam లో ఎలాంటి నెగటివ్ మర్క్స్ వుండవు. కాబట్టి ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ వదిలిపెట్టకుండా అన్నిటికీ ఆన్సర్స్ చేయచ్చు, దీనివల్ల స్కోర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.





