🚀 Army AOC Group C Recruitment 2026 | 10th/12th/Degree కి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Published On:

Army AOC Group C

Join WhatsApp

Join Now

Army AOC Group C Recruitment 2026 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ నిజంగా ఒక అద్భుతమైన అవకాశం మామ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇండియన్ ఆర్మీలోని ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) నుండి గ్రూప్ సీ విభాగంలో 2,615 పర్మినెంట్ పోస్టుల భర్తీ చేయడానికి  అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కేవలం 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ పాసైన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దేశ సేవ చేస్తే లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలనుకునే వారికి ఈ నోటిఫికేషన్ ఒక మంచి అవకాశం మామ. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు!

Army AOC Group C నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఎన్ని, అప్లై డేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, జీతం, సిలబస్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ గురించి చాలా డీటెయిల్డ్ గా కింద ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్ గా చదివి మీకు ఈ పోస్టులకు అర్హత ఉంటే అప్లై చేసుకోండి. అలాగే, ఈ జాబ్స్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ కి  ఈ ఆర్టికల్ ని షేర్ చేయడం మర్చిపోకండి మామ, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవ్వచ్చు.

Recruitment Overview :- 

Army AOC Group C నోటిఫికేషన్ కి సంబంధించిన అప్లికేషన్ స్టార్టింగ్ మరియు లాస్ట్ డేట్స్ తో పాటు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ క్రింది టేబుల్ లో ఇచ్చాను  చేసుకోండి:

Organization Army Ordnance Corps (AOC), Ministry of Defence
Post Name Tradesman Mate, Fireman, JOA, MTS, Material Assistant
Total Vacancies 2,615
Qualification 10th Pass / 12th Pass / Degree
Job Location Across India
Apply Mode Online
Apply Start Date 24 August 2026
Last Date 23 September 2026
Official Website aocrecruitment.gov.in

Vacancy Details (పోస్టుల వివరాలు):-

Army AOC Group C నోటిఫికేషన్ ద్వారా ఆర్మీ AOC లో ప్రధానంగా ఏయే ఏయే పోస్టులు భర్తీ చేస్తున్నారో క్రింది టేబుల్ లో ఇచ్చాను:

S.No అప్లై చేయాల్సిన పోస్టు పేరు (Post Name) విభాగం
1 Tradesman Mate (ట్రేడ్స్‌మెన్ మేట్) Group C
2 Fireman (ఫైర్‌మెన్) Group C
3 Multi Tasking Staff (MTS) Group C
4 Junior Office Assistant (JOA / LDC) Group C
5 Material Assistant (MA) Group C

Education & Age Limit:-

Army AOC Group C పోస్టులకు అప్లై చేయడానికి కావలసిన విద్యార్హతలు మరియు వయస్సు చాలా డీటెయిల్డ్ గా ఇచ్చాను చెక్ చేసుకోండి: 

  • Tradesman Mate & MTS:ఈ పోస్టులకు కేవలం 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పాస్ అయితే చాలు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. వయోపరిమితి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • Fireman: ఈ పోస్టుకు జస్ట్ 10వ తరగతి పాసై ఉండాలి. అలాగే నోటిఫికేషన్ లో చెప్పిన విధంగా నిర్దిష్ట ఎత్తు, ఛాతీ కొలతలు ఉండి, ఫిజికల్ టెస్టులకు (Physical Fitness) ఫిట్ గా ఉండాలి. వయస్సు 18 నుంచి 25 ఏళ్లు.
  • Junior Office Assistant (JOA):ఈ పోస్టుకు జస్ట్ ఇంటర్మీడియట్ (12th Class) పాసై ఉండాలి. దీంతో పాటు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు (35 WPM) లేదా హిందీలో 30 WPM కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కంపల్సరీ. వయస్సు 18-27 ఏళ్లు.
  • Material Assistant: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (B.A, B.Sc, B.Com వగైరా) లేదా మెటీరియల్ మేనేజ్మెంట్ లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 27 సంవత్సరాలు.
  • వయస్సు సడలింపు: కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఓబీసీ (OBC) అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు 5 ఏళ్లు వయో సడలింపు (Age Relaxation) ఖచ్చితంగా వర్తిస్తుంది మామ.

Salary Details( జీతం వివరాలు):- 

Army AOC Group C పర్మినెంట్ ఉద్యోగాలు కాబట్టి స్టార్టింగ్ శాలరీ చాలా ఎక్కువగానే  వస్తుంది.

  • MTS & Tradesman Mate (Level-1): ఈ పోస్టులకు బేసిక్ పే ₹18,000 తో మొదలై ₹56,900 వరకు ఉంటుంది. డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు కలుపుకుని మొదటి నెలే సుమారు ₹28,000 పైగా జీతం చేతికి వస్తుంది.
  • Fireman & JOA (Level-2): బేసిక్ పే ₹19,900 నుండి ₹63,200 వరకు ఉంటుంది. అన్ని రకాల ప్రభుత్వ అలవెన్సులు కలుపుకుని స్టార్టింగ్ లోనే సుమారు ₹32,000 వరకు శాలరీ చేతికి వస్తుంది.
  • Material Assistant (Level-5): ఈ పోస్టులకు జీతం రేంజ్ ఇంకా ఎక్కువ. బేసిక్ పే ₹29,200 తో స్టార్ట్ అయ్యి ₹92,300 మధ్య ఉంటుంది. అన్ని కలుపుకుంటే నెలకు సుమారు ₹45,000 కి పైగా మొదటి జీతం తో కెరీర్ స్టార్ట్ చేయొచ్చు.

Selection Process(ఎంపిక విధానం):-

Army AOC Group C  పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 4 దశలలో ఉంటుంది: 

  1. Physical Standard / Skill Test: పోస్టును బట్టి ముందుగా ఫిజికల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ పెడతారు. ఫైర్మెన్, ట్రేడ్స్‌మెన్ పోస్టులకు ఫిజికల్ టెస్టులు (పరుగు, బరువులు మోయడం) ఉంటాయి. JOA పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇవి కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది.
  2. Written Examination (రాత పరీక్ష): మొదటి దశలో క్వాలిఫై అయిన వారికి ఓఎంఆర్ (OMR) లేదా కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఫైనల్ మెరిట్ జాబితా మొత్తం ఈ ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉంటుంది.
  3. Document Verification (డాక్యుమెంట్ వెరిఫికేషన్): రాత పరీక్షలో పాసై షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఒరిజినల్ ఎడ్యుకేషన్, కాస్ట్ సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు.
  4. Medical Examination: అన్నీ ఓకే అయ్యాక ఇండియన్ ఆర్మీ మెడికల్ రూల్స్ ప్రకారం పూర్తి బాడీ చెకప్ చేసి, ఫిట్ గా ఉంటే ఫైనల్ గా మీకు ఆఫర్ లెటర్ ఇచ్చేస్తారు.

Syllabus Details(సిలబస్ వివరాలు):-

గత నోటిఫికేషన్ల ఆధారంగా రాత పరీక్ష మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులకు ఉంటాయి. దీనిలో 0.25 (1/4th) నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్స్ చేయండి. ఎగ్జామ్ రాయడానికి 2 గంటల సమయం ఇస్తారు.

  • General Intelligence & Reasoning: 50 ప్రశ్నలు, 50 మార్కులు. సిరీస్, అనాలజీ, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్-డీకోడింగ్ లాంటి టాపిక్స్ కవర్ అవుతాయి. మంచి స్కోర్ తీసుకురావడానికి ఇది బెస్ట్ సెక్షన్.
  • General Awareness: 50 ప్రశ్నలు, 50 మార్కులు. కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.
  • Quantitative Aptitude (Maths): 25 ప్రశ్నలు, 25 మార్కులు. టైం అండ్ వర్క్, నంబర్ సిస్టమ్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ & లాస్ లాంటి బేసిక్ 10th క్లాస్ లెవెల్ మ్యాథ్స్ ఉంటుంది.
  • General English: 25 ప్రశ్నలు, 25 మార్కులు. ఇంగ్లీష్ గ్రామర్, వొకాబులరీ, సినానిమ్స్, యాంటోనిమ్స్ మరియు ప్యాసేజ్ లాంటివి అడుగుతారు.

How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి):-

Army AOC Group C  పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ మామ, ఎలాంటి తప్పులు చేయకుండా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:

  • ముందుగా అఫీషియల్ వెబ్సైట్ aocrecruitment.gov.in ని ఓపెన్ చేయండి.
  • నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని, మీ క్వాలిఫికేషన్ సరిపోతుందో లేదో క్రాస్ చెక్ చేసుకోండి.
  • తర్వాత “Candidate Register” ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి.
  • ఇప్పుడు లాగిన్ అయ్యి, మీరు ఏ పోస్టుకి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకుని మీ పర్సనల్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ టెన్త్ సర్టిఫికెట్ లో ఉన్నట్లు ఎంటర్ చేయండి.
  • లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ మరియు టెన్త్ లేదా ఆధార్ కార్డ్ ని అడిగిన సైజులో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
  • చివరిగా మొత్తం వివరాలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీ అప్లికేషన్ ని తప్పకుండా ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.

Mandatory Links:-

ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs(తరుచుగా అడిగే ప్రశ్నలు) :- 

1. Army AOC Group C జాబ్స్ పర్మినెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలా?

అవును మామ, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) కింద భర్తీ చేసే ఈ గ్రూప్ C పోస్టులన్నీ 100% పర్మినెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అగ్నివీర్ లాంటి కాంట్రాక్ట్ జాబ్స్ కావు ఇవి.

2. Army AOC Group C ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది?

సాధారణంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. మిగతా కేటగిరీల (General/OBC) అభ్యర్థులకు నామమాత్రంగా ₹100 మాత్రమే ఎగ్జామ్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది.

3.Army AOC Group C ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి Exam సెంటర్లు ఎక్కడ ఇస్తారు?

మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సికింద్రాబాద్ లేదా విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లోనే ఎక్కువగా ఫిజికల్ మరియు ఎగ్జామ్ సెంటర్లు ఇచ్చే అవకాశం వుంది. కాబట్టి ఎగ్జామ్ రాయడానికి ఎక్కడికో వెళ్లాలని టెన్షన్ అవసరం లేదు.

🔴Related Post

Leave a Comment