TGPSC DIET Lecturer Recruitment 2026 కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ అభ్యర్థులకు ఫైనల్ గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు. మన తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఉన్న డైట్ (DIET) కాలేజీల్లో నుంచి 86 సీనియర్ లెక్చరర్ మరియు లెక్చరర్ పోస్టుల భర్తీ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మామ. టీచింగ్ ఫీల్డ్‌లో జాబ్ కొట్టాలి అనుకునే వారికి ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్ లాంటిది.
TGPSC DIET Lecturer పోస్టులకు అప్లై చేయాలంటే సంబంధిత సబ్జెక్టులో పీజీ తో పాటు ఎంఈడీ (M.Ed) కచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి. ఇలాంటి మంచి శాలరీ ఉన్న గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ చాలా అరుదుగా వస్తాయి కాబట్టి,ఈ నోటిఫికేషన్ ని మీ ఫ్రెండ్స్ లేదా మీ రిలేటివ్స్ లో ఈ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి వెంటనే ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి. చాలా అరుదుగా వస్తాయ్ ఇలాంటి నోటిఫికెషన్స్ సో ఈ ఛాన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మామా!
Recruitment Overview :-
| వివరాలు | సమాచారం |
| Organization | Telangana Public Service Commission (TGPSC) |
| Post Name | Senior Lecturer & Lecturer in DIET |
| Total Vacancies | 86 |
| Qualification | PG Degree + M.Ed |
| Job Location | Telangana |
| Apply Mode | Online |
| Last Date | 29-Jul-2026 |
| Official Website | tgpsc.gov.in |
Education Qualification :-
- ఎడ్యుకేషన్: TGPSC DIET Lecturer పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పీజీ (PG) మరియు 55% మార్కులతో ఎంఈడీ (M.Ed) పాస్ అయ్యే ఉండాలి. అయితే SC/ST/BC/PwD కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులు ఉంటే కూడా సరిపోతుంది.
Age limit (వయోపరిమితి) :-
- వయోపరిమితి: TGPSC DIET Lecturer పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు వయస్సు 01/07/2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
Salary Details (జీతం వివరాలు) :-
మనం ఏ ఉద్యోగానికి అప్లై చేసిన ఫస్ట్ చూసేది జీతమే కదా మామ! అందుకే TGPSC DIET Lecturer గవర్నమెంట్ పోస్టులకి భారీ స్కేల్లో శాలరీ ఉంటుంది.
- సీనియర్ లెక్చరర్ (Senior Lecturer): ఈ పోస్టులకు బేసిక్ పే చాలా గట్టిగా ఉంటుంది, స్టార్టింగ్ నెలకు ₹58,850 నుండి ₹1,37,050 వరకు పే స్కేల్ ఉంటుంది.
- లెక్చరర్ (Lecturer): ఈ పోస్టులకు కూడా జీతం తక్కువేం కాదు మామా, నెలకు ₹54,220 నుండి ₹1,33,630 వరకు అఫీషియల్ పే స్కేల్ ఉంటుంది. ఇది నిజంగా లైఫ్ సెటిలింగ్ శాలరీ అని అనుకోవచ్చు.
How to Apply(ఎలా అప్లై చేసుకోవాలి) :-
TGPSC DIET Lecturer పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చిన్న తప్పు చేసినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మామా. అందుకే నేను చెప్పే ఈ స్టెప్స్ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి.
- స్టెప్ 1: ఫస్ట్ TGPSC అఫీషియల్ వెబ్సైట్ ని (tgpsc.gov.in) ఓపెన్ చేయాలి.
- స్టెప్ 2: ఒకవేళ ఇంతకుముందు TGPSC బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, “One Time Registration (OTR)” లింక్ క్లిక్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ తో కొత్తగా OTR క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ OTR ఉన్నవారు దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు.
- స్టెప్ 3: OTR ఐడీ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అయ్యాక, హోమ్ పేజీలో కనిపించే “DIET Lecturer Recruitment 2026” అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి.
- స్టెప్ 4: తర్వాత అక్కడ అడిగే క్వాలిఫికేషన్ వివరాలు, సబ్జెక్టుల సమాచారం పక్కాగా నింపాలి. మీ ఫోటో, సంతకం మరియు అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
- స్టెప్ 5: డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు “Preview” చూసుకుని, ఆ తర్వాతే ఆన్లైన్ లో నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్ ద్వారా ఫీజు పేమెంట్ చేయాలి.
- స్టెప్ 6: ఫైనల్ గా అప్లికేషన్ సబ్మిట్ చేసాక, వచ్చే అక్నాలెడ్జ్మెంట్ ఫారమ్‌ను లేదా పిడిఎఫ్‌ను ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి.
Selection Process(ఎంపిక విధానం) :-
TGPSC DIET Lecturer నోటిఫికేషన్‌కి ఎలాంటి ఇంటర్వ్యూలు వుండవు మామా, కేవలం రాత పరీక్షలో వచ్చే మెరిట్ ఆధారంగానే ఉద్యోగం వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది:
- రాత పరీక్ష (Written Examination): దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ ముందుగా ఆబ్జెక్టివ్ టైప్ (CBRT – కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా OMR షీట్ విధానంలో) పరీక్ష నిర్వహిస్తారు.
- మెరిట్ లిస్ట్ & రిజర్వేషన్: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా, తెలంగాణ ప్రభుత్వ రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు జోనల్ పద్ధతిని ఫాలో అవుతూ ఒక మెరిట్ లిస్ట్‌ను తయారు చేస్తారు.
- సర్టిఫికేట్ వెరిఫికేషన్ (Document Verification): మెరిట్ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న అభ్యర్థులను ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన కోసం TGPSC ఆఫీస్‌కు పిలుస్తారు. అక్కడ మీ యొక్క విద్యార్హతలు, క్యాస్ట్ సర్టిఫికెట్లు అన్నీ చెక్ చేస్తారు.
- ఫైనల్ అలాట్మెంట్: చివరగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిన వారికి మెరిట్ ప్రాతిపదికన డైట్ కాలేజీల్లో సీనియర్ లెక్చరర్ లేదా లెక్చరర్ పోస్టులకు ఫైనల్ సెలక్షన్ ఆర్డర్స్ ఇస్తారు.
Syllabus(సిలబస్) :-
TGPSC DIET Lecturer జాబ్ కొట్టాలంటే సిలబస్‌పై పట్టు సాధించడం చాలా ముఖ్యం మామా. ఈ ఎగ్జామ్ మొత్తం 450 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి:
- Paper-I: General Studies and General Abilities
- ఇందులో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులు కేటాయిస్తారు.
- ఈ పేపర్లో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, తెలంగాణ హిస్టరీ మరియు జాగ్రఫీ, తెలంగాణ పాలసీలు, ఇంకా బేసిక్ లాజికల్ రీజనింగ్ మరియు 10వ తరగతి స్థాయి ఇంగ్లీష్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- Paper-II: Concerned Subject (PG Level)
- ఇది చాలా క్రుషియల్ మామా, ఎందుకంటే ఇందులో మొత్తం 150 ప్రశ్నలు ఉంటే.. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున ఏకంగా 300 మార్కులు ఉంటాయి.
- మీరు పీజీ (PG) లో ఏ సబ్జెక్ట్ అయితే చదివారో (ఉదాహరణకు: తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టులు), ఆ సబ్జెక్ట్ లోని డీప్ కాన్సెప్ట్స్ మరియు టీచింగ్ మెథడాలజీల నుండి పీజీ స్టాండర్డ్‌లో ప్రశ్నలు వస్తాయి. ఈ పేపర్లోనే ఎక్కువ స్కోర్ సాధిస్తే జాబ్ మీ చేతుల్లో ఉన్నట్లే!
Mandatory Links :-
- Official Notification PDF: Click Here
- Apply Online Link: Click Here
- Official Website Link: tgpsc.gov.in
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
- Telegram Channel Join Link : Click Here
- WhatsApp Channel Join Link: Click Here
FAQs(తరుచు అడిగే ప్రశ్నలు) :-
- TGPSC DIET Lecturer పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి?
TGPSC DIET Lecturer పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్స్ జూన్ 24, 2026 న ప్రారంభమై, జూలై 29, 2026 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి.
- TGPSC DIET Lecturer పోస్టులకు వయసు ఎంత ఉండాలి?
అభ్యర్థుల వయస్సు జులై 1, 2026 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయో సడలింపు ఉంటాయి.
- TGPSC DIET Lecturer Recruitment 2026 కి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది?
OC మరియు BC అభ్యర్థులకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ₹1000 ఉంటుంది. SC, ST, PwD వాళ్లకు ₹500 ఉంటుంది. దీనికి అదనంగా ₹120 ఎగ్జామ్ ఫీజు కట్టాలి (నిరుద్యోగులకు ఈ ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన పని లేదు).




