GTGH Rajamahendravaram Recruitment 2026 నుంచి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది గవర్నమెంట్ హాస్పిటల్ లో జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ బాగా పనికొస్తుంది.
హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రభుత్వ టీచింగ్ జనరల్ ఆసుపత్రి (GTGH) మరియు డి-అడిక్షన్ సెంటర్ (ADDC) నుండి వివిధ పోస్టుల భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేవలం 10th క్లాస్, డిగ్రీ లేదా ఎంబీబీఎస్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా జాబ్ ఇస్తారు కాబట్టి ఈ ఛాన్స్ ఎవరు మిస్ కాకండి మామ.
GTGH Rajamahendravaram Recruitment నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 రకాల ఖాళీలను కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. మెడికల్ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. కింద నేను అన్ని డీటెయిల్స్ లైక్ వయోపరిమితి (ముఖ్యంగా 52 ఏళ్ల వరకు ఉన్న సడలింపులు), జీతం, ఏ పోస్ట్ కి ఎవరు అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు చాలా స్పష్టంగా కింద రాసాను. ఒకసారి క్లియర్ గా చదివి లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ ని మీ వాట్సాప్ గ్రూపుల్లో మరియు మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి తప్పకుండా ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి, ఈ నోటిఫికేషన్ ఎవరికో ఒకరికి కచ్చితంగా లైఫ్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
Recruitment Overview Table :-
| అంశం | వివరాలు |
| Organization | GTGH Rajamahendravaram |
| Post Name | Medical Officer, Nurse, Accountant, Ward Boy & Others |
| Total Vacancies | 10 |
| Qualification | 10th / Degree / MBBS |
| Job Location | Rajamahendravaram, AP |
| Apply Mode | Offline |
| Last Date | 09.05.2026 |
| Official Website | eastgodavari.ap.gov.in |
Age(వయోపరిమితి) :-
వయోపరిమితి అనే విషయానికి వస్తే, అభ్యర్థులు కచ్చితంగా కింది వివరాలు చెక్ చేసుకోవాలి:
- వయోపరిమితి (Age Limit): నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయసు జనరల్ (OC) అభ్యర్థులకు 42 ఏళ్లు ఉండాలి. అయితే రిజర్వేషన్ల ప్రకారం మంచి వయో సడలింపులు ఉన్నాయి.
- వయో సడలింపులు (Age Relaxations): ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC) మరియు ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది (అంటే వీరు 47 ఏళ్ల వరకు అప్లై చేయొచ్చు).
- NOTE :- దివ్యాంగులకు (PHC అభ్యర్థులకు) ఏకంగా 10 ఏళ్ల వయసు సడలింపు వర్తిస్తుంది. అంటే వీరు 52 ఏళ్ల వయసు వరకు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Education (విద్యార్హతలు) :-
GTGH Rajamahendravaram Recruitment కి సంబంధించి ఏ పోస్ట్ కి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే, అభ్యర్థులు కింది వివరాలు చెక్ చేసుకోవాలి:
- మెడికల్ ఆఫీసర్ (Medical Officer): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ (MBBS) పాస్ అయ్యి ఉండాలి మరియు AP మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
- సైకియాట్రిక్ నర్స్ (Nurse): బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం / ఏఎన్ఎం (ANM) కోర్సు పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ / కౌన్సిలర్: సైకాలజీ లేదా సోషల్ వర్క్ (MSW) లో పీజీ లేదా డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ఫీల్డ్ లో పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.
- అకౌంటెంట్ కమ్ క్లర్క్ (Accountant): బి కామ్ (B.Com) డిగ్రీతో పాటు టాలీ (Tally), మరియు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- పీర్ ఎడ్యుకేటర్ / యోగా థెరపిస్ట్: ఎడ్యుకేటర్ పోస్టులకు డ్రగ్ అడిక్షన్ పట్ల అవగాహన, యోగా థెరపిస్ట్ కు యోగాలో డిప్లొమా లేదా సర్టిఫికెట్ ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వార్డ్ బాయ్ / చౌకీదార్ (Ward Boy / Chowkidar): కేవలం 10వ తరగతి (Tenth Class) పాస్ అయిన ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
Salary (జీతం) :-
GTGH Rajamahendravaram Recruitment కి ఎంపికైన అభ్యర్థులకు పోస్టుని బట్టి చాలా మంచి శాలరీ ఇస్తారు. వాటికి సంబంధించిన వివరాలు కింద ఇచ్చాను చెక్ చేసుకోండి.
- మెడికల్ ఆఫీసర్ (డాక్టర్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అత్యధికంగా నెలకు రూ. 60,000/- వరకు ఫిక్స్డ్ శాలరీ పే చేస్తారు.
- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మరియు కౌన్సిలర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,000/- నుంచి రూ. 30,000/- వరకు శాలరీ ఉంటుంది.
- సైకియాట్రిక్ నర్స్ లేదా ఏఎన్ఎం (ANM) పోస్టులు కు నెలకు రూ. 22,500/- వరకు జీతం చెల్లిస్తారు.
- అకౌంటెంట్ కమ్ క్లర్క్ పోస్టులకు నెలకు రూ. 15,000/- నుంచి రూ. 18,000/- వరకు జీతం ఇస్తారు.
- వార్డ్ బాయ్, చౌకీదార్ మరియు పీర్ ఎడ్యుకేటర్ పోస్టుల కు నెలకు స్టార్టింగ్ రూ. 9,000/- నుంచి రూ. 12,000/- వరకు శాలరీ ని పే చేస్తారు.
How to Apply (ఎలా అప్లై చేసుకోవాలి) :-
GTGH Rajamahendravaram Recruitment కి సంబంధించిన ఉద్యోగాలకు ఆఫ్ లైన్ (Offline) పద్ధతిలో అప్లై చేసుకోవాలి. కింద ఉన్న సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యే అప్లై చేసుకోండి :
- ముందుగా తూర్పు గోదావరి జిల్లా అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్లి అధికారిక నోటిఫికేషన్ చదివి, అక్కడ వున్నా అప్లికేషన్ ఫారం(Application Form)ని డౌన్లోడ్ చేసుకోండి.
- ఆ ఫారం లో మీ పూర్తి వివరాలు (పేరు, ఎడ్యుకేషన్, వయసు) ఎటువంటి తప్పులు లేకుండా నీట్ గా నింపండి.
- మీ 10వ తరగతి మార్కుల మెమో, డిగ్రీ/MBBS సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం (Caste Certificate), అనుభవం (Experience) ఉంటే ఆ సర్టిఫికెట్లు మొత్తం మరియు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలపై మీ సంతకం చేసి వాటన్నింటినీ అప్లికేషన్ కు జత చేయండి.
- వాటన్నింటినీ ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి, “సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ టీచింగ్ జనరల్ ఆసుపత్రి (GTGH), రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్” అనే అడ్రస్ కు మే 9వ తేదీ లోగా స్పీడ్ పోస్ట్ ద్వారా గాని లేదా స్వయంగా వెళ్లి గాని ఇవ్వండి.
Selection Process(ఎంపిక విధానం) :-
మామ, GTGH Rajamahendravaram Recruitment ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ గా కింద స్టెప్స్ ని క్లియర్ గా చదవండి :
- ముందుగా అభ్యర్థులు పంపిన దరఖాస్తు ఫార్మ్స్ ని సంబంధిత అధికారులు చెక్ చేసి తప్పులు లేని వాటిని షార్ట్ లిస్ట్ చేస్తారు.
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు కాబట్టి, కేవలం మీ విద్యార్హతల్లో (10th/Degree/MBBS) వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
- మీ యొక్క వయసు మరియు గతంలో ఎక్కడైనా పని చేసిన అనుభవం (Experience) ఉంటే దానికి కొన్ని అదనపు మార్కులు ఉంటాయి.
- ఫైనల్ గా వాటన్నింటినీ బేస్ చేసుకుని ఒక మెరిట్ లిస్ట్ (Merit List) తయారు చేసి, అందులో టాప్ లో ఉన్న వారికి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి డైరెక్ట్ గా జాబ్ పోస్టింగ్ ఇచ్చేస్తారు.
Syllabus (సిలబస్) :-
- GTGH Rajamahendravaram Recruitment జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
- కాబట్టి అభ్యర్థులు ఏ విధమైన సిలబస్ చదవాల్సిన అవసరం అస్సలు లేదు.
- పుస్తకాలతో పని లేకుండా, కేవలం మీ పాత అకడమిక్ మార్కుల ఆధారంగానే మీకు జాబ్ వస్తుంది.
Mandatory Links :-
- Official Notification PDF: Click Here
- Apply Online Link: Click Here
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
- WhatsApp Channel Join Link:- Join Our Family Now
- Telegram Channel Join Link:- Join Our Family Now
FAQs (తరుచుగా అడిగే ప్రశ్నలు) :-
- GTGH Rajamahendravaram Recruitment ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి ఎంత?
సాధారణ (OC) అభ్యర్థులకు గరిష్ట వయసు 42 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు (47 ఏళ్ల వరకు), మరియు దివ్యాంగులకు 10 ఏళ్ల (52 ఏళ్ల వయసు వరకు) వయసు సడలింపు ఉంటుంది.
2.GTGH Rajamahendravaram Recruitment కు 10వ తరగతి పాస్ అయిన వారు ఈ నోటిఫికేషన్ లో ఏ ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు?
కేవలం టెన్త్ క్లాస్ అర్హత ఉన్నవారు వార్డ్ బాయ్ మరియు చౌకీదార్ లాంటి పోస్టులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఉన్నత చదువులు లేని వారికి ఈ నోటిఫికేషన్ ఒక బెస్ట్ ఆప్షన్.
- GTGH Rajamahendravaram Recruitment పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కట్టాలా?
లేదు మామ! ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదా ఎగ్జామ్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. పూర్తి ఉచితంగా దరఖాస్తు ఫారాన్ని ఆసుపత్రి కార్యాలయంలో అందజేయవచ్చు.





