SSC Stenographer Recruitment 2026 | 12th Pass కి భారీ నోటిఫికేషన్ | Apply Online Now!

By Quick Job Updates

Updated On:

SSC Stenographer Recruitment

Join WhatsApp

Join Now

SSC Stenographer Recruitment 2026 నోటిఫికేషన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది చాలా న్యూస్. Hello mama, ఎలా ఉన్నారు? సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ కోసం ఇంట్రెస్ట్ గా చేసి వారి కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి లేటెస్టుగా 731 గ్రేడ్ C మరియు గ్రేడ్ D స్టెనోగ్రాఫర్ పోస్టులు సంబంధించి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కేవలం ఇంటర్మీడియట్ (12th Pass) అర్హతతో బెస్ట్ బేసిక్ పే శాలరీ వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి.ఈ జాబ్స్ కొడితే శాలరీ తో పాటు మంచి గౌరవం కూడా ఉంటుంది మామ. ఇంటర్ అర్హతతో పాటు మీకు కొంచెం టైపింగ్ లేదా స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉంటే మాత్రం ఈ జాబ్ ని అస్సలు మిస్ అవ్వదు.

SSC Stenographer Recruitment జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు, వయోపరిమితి, సెలక్షన్ ప్రాసెస్, మరియు ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి విషయాలు ఈ పోస్ట్‌లో చాలా క్లియర్ గా రాసాను ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి మే 15 2026 లాస్ట్ డేట్ కాబట్టి లాస్ట్ డేట్ వరకు చూడకుండా వెంటనే అప్లై చేసుకోండి మామ. నా తరుపు నుంచి చిన్న రిక్వెస్ట్  ఈ జాబ్ అప్డేట్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కు కచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి,ఈ జాబ్స్ కోసం చేసేవారికి  ఈ ఆర్టికల్ చాలా బాగా హెల్ప్ అవ్వచ్చు మామ .

Recruitment Overview (సంక్షిప్త వివరాలు) :- 

అంశం  వివరాలు
Organization Staff Selection Commission (SSC)
Post Name Stenographer (Grade C & Grade D)
Total Vacancies 731 Posts
Qualification 12th Pass + Stenography/Computer  Skills
Salary  25,500/- TO 1,42,400/-Rs
Job Location All Over India
Apply Mode Online
Last Date 15 May 2026
Official Website ssc.gov.in

Education Qualifications (విద్య అర్హతలు) :- 

  • విద్యా అర్హత:  గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (12th Class) పాస్ అయ్యే ఉండాలి.
  • నైపుణ్యాలు (Skills): ఇంటర్ తో పాటు ఇంగ్లీష్ లేదా హిందీలో స్టెనోగ్రఫీ (Shorthand) టైపింగ్ స్కిల్స్ కచ్చితంగా వచ్చి ఉండాలి.ఇది మోస్ట్ ఇంపార్టెంట్.

Age Limits (వయోపరిమితి) :-

  • వయోపరిమితి (Grade D):SSC Stenographer Recruitment  గ్రేడ్ డి పోస్టులకు అప్లై  అభ్యర్థులకు వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • వయోపరిమితి (Grade C):SSC Stenographer Recruitment  గ్రేడ్ సి పోస్టులకు అప్లై చేసే చేయడానికి  అభ్యర్థులకు వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • వయో సడలింపు (Age Relaxation): కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, మరియు PWD అభ్యర్థులకు కూడా  వయో సడలింపు ఉంటుంది.

Salary details (జీతం వివరాలు) :- 

  • SSC Stenographer Recruitment Grade C: ఈ పోస్టులకు నెలకు సుమారుగా ₹44,900 నుంచి ₹1,42,400 వరకు (Pay Level 6) బేసిక్ పే ఉంటుంది.
  • SSC Stenographer Recruitment Grade D:ఈ పోస్టులకు నెలకు సుమారుగా ₹25,500 నుండి ₹81,100 వరకు (Pay Level 4) బేసిక్ పే ఉంటుంది.
  • బేసిక్ పే తో పాటు ప్రస్తుతం కరువు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA), ట్రావెల్ అలవెన్స్ (TA) అన్ని కలుపుకుంటే జాబ్ స్టార్టింగ్ లోనే చేతికి మంచి శాలరీ వస్తుంది.

Selection Process(ఎంపిక విధానం) :- 

 మామ, ఈ సెలక్షన్ ప్రాసెస్  దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి అనవసరంగా టెన్షన్ పడతారు. కానీ అసలు భయపడాల్సిన అవసరం లేదు, సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇదిగో ఇక్కడ క్లియర్ గా చెప్తున్నా జాగ్రత్తగా చదవండి.

  1. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT): మొదటగా ఆన్‌లైన్ లో మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడే మనం అసలైన టాలెంట్ చూపించాలి, ఎందుకంటే ఫైనల్ గా జాబ్ డిసైడ్ అయ్యేది ఈ మార్కుల బట్టే కాబట్టి. అయితే ఇక్కడో చిన్న విషయం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ ఎక్సమ్ కి  నెగటివ్ మర్క్స్(0.25) ఉంటాయి. సో, ఆన్సర్ పక్కాగా తెలిస్తేనే అట్టెంప్ట్ చేయండి, గుడ్డిగా ఆన్సర్స్ మాత్రం పెట్టకండి. ఒకవేళ ఎగ్జామ్ పేపర్ కష్టంగా వచ్చినా కంగారు పడకండి, నార్మలైజేషన్ లో చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మార్కులు కొన్ని కవర్ అవుతాయి.
  2. స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్: ఫస్ట్ ఎగ్జామ్ లో కట్-ఆఫ్ మార్కులు వచ్చిన వాళ్ళకి  ఈ సెకండ్ రౌండ్ ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫైయింగ్ రౌండ్ మాత్రమే. అంటే ఇందులో జస్ట్ పాస్ మార్కులు తెచ్చుకుంటే చాలు ఈ రౌండ్ క్వాలిఫై అయినట్లు.ఫైనల్ లిస్ట్ కోసం ఈ మార్కులు అసలు తీసుకోరు. ఇందులో ఒక 10 నిమిషాలు వాళ్ళు డిక్టేషన్ ఇస్తుంటే, గ్రేడ్ C కి నిమిషానికి 100 పదాలు, గ్రేడ్ D కి 80 పదాల స్పీడ్ తో మీరు షార్ట్‌హ్యాండ్ లో రాసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మనం కంప్యూటర్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా టైప్ చేయాలి.అందుకే  ముందు నుంచి కొంచెం ప్రాక్టీస్ చేస్తే మంచిది.
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV): పైన రెండు రౌండ్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క 10th, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లు, క్యాస్ట్/EWS సర్టిఫికెట్లు, మరియు ఆధార్ లాంటి ఐడీ ప్రూఫ్స్ అన్నీ పక్కాగా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఆ వెంటనే చిన్న మెడికల్ టెస్ట్ మీకు కండక్ట్ చేస్తారు. ఇవి అన్నీ క్లియర్ గా ఉంటే, ఇక మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ అయిపోయినట్టే మామ.

Syllabus details (సిలబస్ వివరాలు) :- 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్‌లైన్‌ ద్వారా మొత్తం 200 మార్కులకు జరుగుతుంది. ఈ పరీక్షలో తప్పు సమాధానానికి నెగటివ్ మర్క్స్ (0.25) కూడా ఉంటాయి కాబట్టి తెలియని ప్రశ్నలు సమాధానం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

  • General Intelligence & Reasoning: 50 ప్రశ్నలు – 50 మార్కులు.
  • General Awareness: 50 ప్రశ్నలు – 50 మార్కులు. (దీనిలో కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ కూడా కవర్ అవుతాయి).
  • English Language & Comprehension: 100 ప్రశ్నలు – 100 మార్కులు.
  • సమయం: ఈ ఆన్‌లైన్ పరీక్ష రాయడానికి మొత్తం 2 గంటల సమయం ఇస్తారు.

How to Apply (ఎలా అప్లై చేసుకోవాలి) :- 

  • మొదటిగా SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in మీ మొబైల్/లాప్టాప్ లో ఓపెన్ చేయాలి.
  • కొత్తగా ఓపెన్ చేసిన వారు అయితే బేసిక్ డీటెయిల్స్ తో One Time Registration (OTR) చేసుకోవాలి. ఇప్పటికే అందులో అకౌంట్ ఉన్నవారు డైరెక్ట్ గా లాగిన్ అవ్వాలి.
  • నోటిఫికేషన్ లో  వున్నా SSC Stenographer Recruitment 2026 ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో వున్నా అప్లికేషన్ ఫారం అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి, మీ వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా ఫిల్ చేయండి.
  • రీసెంట్గా తీసుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం మరియు అవసరమైన ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి కరెక్ట్ సైజులో అప్‌లోడ్ చేయాలి.
  • తర్వాత జనరల్ మరియు OBC అభ్యర్థులు ₹100 అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో (UPI/Net Banking ద్వారా) చెల్లించాలి. (మహిళలు, SC/ST, మరియు PWD అభ్యర్థులకు ఫీజు ఉండదు).
  • అప్లికేషన్  ఫారం పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత ఒకసారి అన్ని సరిగ్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని 15 మే 2026 లోపు అప్లికేషన్ ని  సబ్మిట్ చేసేయండి. ముఖ్యంగా అప్లికేషన్ ని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవడం మర్చిపోకండి.

Mandatory Links :-

    ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి

FAQs(తరచుగా అడిగే ప్రశ్నలు) :- 

1. SSC Stenographer Recruitment జాబ్స్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పటి వరకు వుంది ?

ఈ జాబ్స్ కి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి 15 మే 2026 వరకు వుంది.  సర్వర్ సమస్యలు రాకుండా ఉండాలంటే  వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి.

2. SSC Stenographer Recruitment పోస్టులకు స్టెనోగ్రఫీ టైపింగ్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలా?

ఎటువంటి సర్టిఫికెట్ కచ్చితంగా అవసరం లేదు, కానీ మీకు స్టెనోగ్రఫీ టైపింగ్ (Shorthand) మీద కచ్చితంగా ప్రాక్టికల్ గా వచ్చి ఉండాలి. మొదటి దశ CBT పరీక్ష పాస్ అయిన వెంటనే, స్కిల్ టెస్ట్ లో మీకు డిక్టేషన్ ని  ఇస్తారు, అది మీరు తప్పులు లేకుండా వాళ్ళ ముందు చేయాల్సి వుంటది.

3.SSC Stenographer Recruitment జాబ్స్ కి తెలుగు రాష్ట్రాల నుండి అప్లై చేసిన అభ్యర్థులకు ఎక్సమ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి?

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు సికింద్రాబాద్ (Southern Region) పరీక్షలు జరుగుతాయి. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు లాంటి ప్రధాన నగరాల్లో పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. అప్లై చేసేటప్పుడు మీకిష్టమైన 3 ఆప్షన్స్ ని ఎగ్జామ్ సెంటర్స్ గా సెలెక్ట్ చేసుకొనే ఆప్షన్ ఉంటుంది మామ  .

🔴Related Post

Leave a Comment