India Post GDS Recruitment 2026 కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది.
Hello friends, అందరూ ఎలా ఉన్నారు మామా? మన భారతీయ తపాలా శాఖ (India Post) నుండి ఏకంగా 25,000 పైగా గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి అఫీషియల్ గా భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
కేవలం పది పాస్ అయితే చాలు, ఎలాంటి రాత పరీక్ష లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా మీ సొంత ఊరిలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించే మంచి ఛాన్స్ ఇది. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ ఎప్పుడో గానీ రావు.
మన వాళ్లకు జాబ్స్ పట్ల ఆసక్తి ఉన్నా సరైన గైడెన్స్ లేక చాలా మంది అప్లై చేయడం మర్చిపోతారు. కేవలం మీ టెన్త్ క్లాస్ మార్కుల ఆధారంగానే ఈ జాబ్ వస్తుంది కాబట్టి, కొంచెం అదృష్టం ఉన్నా లైఫ్ సెట్ అయిపోతుంది.
అందుకే మీకోసం వయస్సు, జీతం, సెలక్షన్ ప్రాసెస్, మరియు ఎలా అప్లై చేయాలి అనే పూర్తి డీటెయిల్స్ చాలా క్లియర్ గా, మీకు అర్థమయ్యేలా కింద ఇచ్చాను. ఓపికగా చదివి వెంటనే అప్లై చేసుకోండి. అలాగే ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి, వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు, ఎవరికో ఒకరికి కచ్చితంగా హెల్ప్ అవుతుంది!
Recruitment Overview:-
India Post GDS నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, పోస్టుల వివరాలు అన్నీ ఒక్క చోట సింపుల్ గా అర్థం కావడానికి ఈ క్రింది టేబుల్ లో ఇచ్చాను చూడండి మామ. ఇందులో అప్లై చేయడానికి కావలసిన స్టార్టింగ్ మరియు లాస్ట్ డేట్స్ కూడా ఉన్నాయి:
| వివరాలు | పూర్తి సమాచారం |
| Organization | India Post (Department of Posts) |
| Post Name | Gramin Dak Sevak (BPM, ABPM, Dak Sevak) |
| Total Vacancies | 25,000+ పోస్టులు |
| Qualification | 10th Pass |
| Job Location | All India (మీ సొంత ఊరిలో/జిల్లాలో) |
| Apply Mode | Online Only (ఆన్లైన్ ద్వారా మాత్రమే) |
| Apply Starting Date | 02 September 2026 |
| Last Date | 21 September 2026 |
| Official Website | indiapost.gov.in/gdsonlineengagement |
ఇందులో ఏయే పోస్టులు ఉంటాయి?:-
చాలా మందికి India Post GDS నోటిఫికేషన్ లో అసలు ఏయే డ్యూటీలు ఉంటాయి అని డౌట్ ఉంటుంది అందరికి. మనకు ముఖ్యంగా ఇందులో 3 రకాల జాబ్స్ ఉంటాయి. అవేంటో ఈ టేబుల్ లో డీటెయిల్ గా ఇచ్చాను చెక్ చేసుకోండి:
| పోస్ట్ పేరు | ఉద్యోగ స్వభావం (Job Role) |
| BPM (బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్) | వీళ్ళు పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ కి ఒక రకంగా హెడ్. ఆన్లైన్ లో మనీ ట్రాన్సాక్షన్స్ చేయడం, అకౌంట్స్ మరియు రికార్డ్స్ మెయింటైన్ చేయడం వీళ్ళ ముఖ్యమైన డ్యూటీ. |
| ABPM (అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్) | వీళ్ళు BPM కు సహాయంగా వర్క్ చేయాలి. పోస్టల్ స్టాంపులు అమ్మడం, పోస్టల్ స్కీమ్స్ గురించి ఊర్లో వాళ్ళకి వివరంగా చెప్పడం లాంటివి చేయాలి. |
| Dak Sevak (డాక్ సేవక్) | వీరు ముఖ్యంగా మనకు వచ్చే లెటర్స్, పార్సెల్స్ ను ఇంటింటికీ వెళ్లి డెలివరీ చేయాల్సి ఉంటుంది. రైల్వే మెయిల్ సర్వీస్ ఆఫీసుల్లో కూడా వీరికి డ్యూటీ పడొచ్చు. |
Education & Age Limit :-
ఫ్రెండ్స్, India Post GDS జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి మీకు పెద్ద పెద్ద డిగ్రీలు ఏమీ అవసరం లేదు. కేవలం ఈ కింది సింపుల్ అర్హతలు ఉంటే సరిపోతుంది.
- 10th Pass: గుర్తింపు పొందిన స్టేట్ లేదా సెంట్రల్ బోర్డ్ నుండి పదవ తరగతి పాస్ అయితే చాలు. ఫస్ట్ క్లాస్ రావాలనే రూల్ లేదు, పాస్ మార్కులు ఉన్నా అప్లై చేసుకోవచ్చు.
- ముఖ్యమైన సబ్జెక్టులు: మీరు చదివిన 10వ తరగతిలో మ్యాథ్స్ (Mathematics), మరియు ఇంగ్లీష్ (English) సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాలి.
- లోకల్ లాంగ్వేజ్: మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్ర స్థానిక భాష వచ్చి ఉండాలి. ఏపీ, తెలంగాణ వాళ్ళు అయితే 10వ తరగతి వరకు ‘తెలుగు’ ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండటం పక్కా రూల్.
- ఇతర స్కిల్స్: అభ్యర్థులకు కచ్చితంగా సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి (సర్టిఫికెట్ అవసరం లేదు).
- వయోపరిమితి (Age): మీ వయస్సు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అలాగే గరిష్టంగా 40 ఏళ్లు దాటకూడదు.
- ఏజ్ రిలాక్సేషన్: ఎస్సీ/ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు 5 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది. ఓబీసీ (OBC) వాళ్ళకి 3 ఏళ్లు, దివ్యాంగులకు (PwD) 10 ఏళ్ల వయస్సులో సడలింపు ఇస్తారు.
Salary (జీతం ఎంత వస్తుంది?):-
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటేనే శాలరీల గురించి భయపడక్కర్లేదు. ఇందులో జీతాన్ని TRCA అంటారు. పోస్టుల వారీగా స్టార్టింగ్ శాలరీ ఎలా ఉంటుందో చూద్దాం.
- BPM సాలరీ: ఈ పోస్టుకు సెలెక్ట్ అయితే ప్రారంభ బేసిక్ పే ₹12,000 ఉంటుంది. సర్వీస్ ని బట్టి ఇది గరిష్టంగా ₹29,380 వరకు పెరుగుతుంది.
- ABPM & డాక్ సేవక్ సాలరీ: ఈ పోస్టులకు ప్రారంభ జీతం ₹10,000 ఉంటుంది. తర్వాత ఇది క్రమంగా ₹24,470 వరకు చేరుకుంటుంది.
- అలవెన్సులు: పైన చెప్పిన బేసిక్ పే కి అదనంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చే కరువు భత్యం (DA) కూడా కలుపుతారు. కాబట్టి చేతికి ఇంకా మంచి సాలరీనే వస్తుంది మామా.
Selection Process (ఎలా సెలెక్ట్ చేస్తారు?):-
మామ, ముందే చెప్తున్నా India Post GDS జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష (No Exam) ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా పక్కా పారదర్శకంగా ఎంపిక చేస్తారు. ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చెప్తాను జాగ్రత్తగా చదివి అప్లై చేసుకోండి:
- మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నప్పుడు మీ 10వ తరగతి మార్కులను ఎంటర్ చేస్తారు కదా.
- ఆ మార్కులను సిస్టం ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేసి, ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వారిని షార్ట్ లిస్ట్ చేస్తుంది (దీన్ని 4 డెసిమల్స్ వరకు చూస్తారు).
- షార్ట్ లిస్ట్ అయిన వారికి డైరెక్ట్ గా వారి ఫోన్ కి SMS మరియు ఈమెయిల్ ద్వారా సెలెక్ట్ అయ్యారని మెసేజ్ వస్తుంది.
- మెసేజ్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని పట్టుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification) కి హాజరు కావాలి.
- సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్ అని తేలితే, మెడికల్ సర్టిఫికెట్ చూసి ఫైనల్ గా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తారు.
Syllabus (సిలబస్ డీటెయిల్స్):-
- India Post GDS రిక్రూట్మెంట్ కు సంబంధించి ఎలాంటి పరీక్ష పెట్టారు కాబట్టి, ఎగ్జామ్ సిలబస్ అంటూ ఏమీ ఉండదు మామ!
- మీరు జీకే, ఆప్టిట్యూడ్ లాంటి ఎలాంటి పుస్తకాలు కొని చదవాల్సిన పని లేదు.
- పూర్తిగా మీరు గతంలో టెన్త్ క్లాస్ లో తెచ్చుకున్న మార్కుల ఆధారంగానే జాబ్ డిసైడ్ అవుతుంది.
- ఒకవేళ మీకు 10th లో మార్కులకు బదులు గ్రేడ్స్ (CGPA) వచ్చి ఉంటే, ఆ వచ్చిన గ్రేడ్ పాయింట్ ను 9.5 తో గుణించి మార్కులు గా పరిగణించి మెరిట్ లిస్ట్ తీస్తారు.
How to Apply (ఎలా అప్లై చేయాలి?):-
India Post GDS రిక్రూట్మెంట్ కు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. నేను చెప్పే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవుతూ ఎలాంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోండి.
- ముందుగా అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్లి One-Time Registration (OTR) కంప్లీట్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చాక, లాగిన్ అయి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయాలి.
- మీ 10వ తరగతి సర్టిఫికెట్ లో ఉన్నట్లుగానే స్పెల్లింగ్స్, మరియు మార్కులు తప్పులు పోకుండా ఎంటర్ చేయాలి. ఇక్కడే చాలా మంది పొరపాట్లు చేస్తారు, జాగ్రత్త సుమా.
- మీకు ఏ బ్రాంచ్ లో జాబ్ కావాలి అనేది మీ పోస్ట్ ప్రిఫరెన్స్ (ఆప్షన్స్) వరుస క్రమంలో ఇచ్చుకోవాలి.
- మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు తెలుపు కాగితంపై చేసిన సంతకం (సిగ్నేచర్) స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
- ఫైనల్ గా జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ (EWS) కు చెందిన మగ అభ్యర్థులు ₹100 అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లో పే చేయాలి. (మహిళలకు, మరియు SC/ST/PwBD వారికి ఫీజు లేదు, ఫ్రీ గా అప్లై చేయవచ్చు!).
Mandatory Links:-
India Post GDS జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ లింక్స్ అన్నీ కింద ఇచ్చాను. దేనికోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు. వెంటనే అప్లై చేసుకోండి.
- Official Notification PDF: Click Here
- Apply Online Link: Click Here
- Official Website Link: Click Here
ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్ కోసం మన WhatsApp & Telegram Channel లో ఇప్పుడే జాయిన్ అవ్వండి
- WhatsApp Channel Join Link: Click Here
- Telegram Channel Join Link: Click Here
FAQs(తరచుగా అడిగే ప్రశ్నలు):-
- India Post GDS పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ ఎప్పుడు?
India Post GDS నోటిఫికేషన్‌కు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 02 న లింక్ ఆక్టివేట్ అవుతుంది. అప్లై చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 21, 2026.
- India Post GDS పోస్టులకు ఇంటర్వ్యూ లేదా ఎగ్జామ్ ఉంటుందా?
లేదు ఫ్రెండ్స్, India Post GDS ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష గానీ, ఇంటర్వ్యూ గానీ అస్సలు ఉండవు. కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగానే జాబ్ ఇస్తారు.
- అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? మహిళలు ఫీజు కట్టాలా?
జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మగ అభ్యర్థులకు మాత్రమే రూ.100 ఫీజు ఉంటుంది. మహిళలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, వికలాంగ (PwBD) అభ్యర్థులు ఎలాంటి ఫీజు కట్టక్కర్లేదు, వాళ్లకు పూర్తిగా ఉచితం.





